ఇప్పుడు
వాక్యం నదిలా ప్రవహించాలి
కొండల్లో పుట్టి అరణ్యాల గుండా
ప్రవహించే వాక్యం
ఊరినీ తాకుతూ వాడనూ
చేరుతూ ప్రవహించాలి
ఎత్తు పల్లాలను ఒరుస్తూ
ఇసుకనూ మట్టిని
కలగలుపుతూ రాతి మలుపుల
చుట్టూ తిరుగుతూ ప్రవహించాలి
జలపాతాల హోరును వినిపిస్తూ
తన హృదయ లయను
పచ్చని మైదానాల చుట్టూ
నినదిస్తూ ప్రవహించాలి
నెత్తురంటిన పూలను ఓదారుస్తూ
సరికొత్త విత్తులను నాటుతూ
లేలేత చిగుళ్లను ప్రకాశింప చేస్తూ
ప్రవహించాలి
వాక్యం జీవ నదిలా ప్రవహిస్తూ
సముద్రాన్ని అల్లుకుని
ఆకాశాన్ని నేలకు దించి
వసంతాన్ని ఆవిష్కరించాలి.
*








excellent
Excellent sir ..nice poem
Beautiful poem