(గత సంచిక తరువాయి)
2
చెబుతా విను, అది ఒక బడి;
మనసు మీద సులభంగా
జ్ఞానకాంతి ప్రసరించే
బోధనగల పాఠశాల.
అన్ని తెగల షేకుదొరలు
విద్యకొరకు వదులుతారు,
పిల్లలేమొ చదువుతారు
గురువుల విజ్ఞానబోధ.
ఉన్నాడొక కైజక్కడ,
శ్రద్ధమీర చదువుతాడు;
ఎర్రని తన పెదవులతో
మాణిక్యాలొలుకుతాడు.
లైలా మరి వేరొక తెగ,
లేబ్రాయపు వయసు తనది;
మృదువైనది తన వర్తన,
చూడచక్కనైన రూపు.
వికసించిన మనసు తనది,
సాధారణ దుస్తుల్లో
ఉదయకిరణమంటి వెలుగు,
ప్రశాంతసుందర రూపిణి.
నల్లనివా జింక కళ్ళు,
నిండు చందమామలా
పున్నమంటి వెన్నెల
కురిసే తన చెక్కిళ్ళు.
వేలకొలది హృదయాలను
గెలిచేదా సౌందర్యం!
అదుపులకది లొంగిరాదు,
అవధి లేని ఆశ్చర్యం!
చకితులైరి చూచువారు,
పరవశించిరందరూ!
మనసారా ఆనందం
గ్రోలిన వారొకే ఒకరు!
అలలవోలె తేలిపోవు
నలనల్లని కురులు తనవి!
రాత్రివేళ చీకటిలా
అలుముకున్న భ్రాంతి కలుగు!
అందుకనే పిలుస్తారు
ముద్దుగాను లైలీ అని;
చీకటిలో వెన్నెలగా
మెరుస్తుంది లైలా అని!
ఒక చూపుకు చెలరేగె
ఉవ్వెత్తున కలవరం,
ఒక చూపుకు చెదిరింది
మదిలోపల ఆలోచన!
కైజు గుండె వలపుతో
దాల్చింది అరుణిమ,
తియ్యనైన తలపుతో
ధీరత్వం కోల్పోయె!
నుదుటిపైన నర్తించెను
తుఫానులా ఆవేగం;
తోచలేదు ఆమె మనసు
ఆకట్టే దారేదీ!
తన చెక్కిలి చూడసాగె
కన్నార్పని ఏకాగ్రత;
అలా అలా చూస్తుంటే
ప్రేమ పొంగె ఉవ్వెత్తున.
త్వరలోనే స్పందించెను
హృదయం వారిద్దరికీ;
కలనైనా వేరవ్వని
ప్రేమ గెలిచె ఇరువురినీ.
పుస్తకాలు నెమరేసె
తక్కినవారందరూ;
వీరిరువురు ఆర్తిగా
మాటాడె చూపులతో.
విద్యల్లో పైచేయికి
పోటీ పడె విద్యార్థులు-
కీర్తికాంక్ష మనసంతా!
వీరికేమొ ప్రేమమయం!
పుస్తకాల విజ్ఞానం
శోధించారందరూ;
ఒకరినొకరు చూసుకొంటు
స్తబ్ధుగా వీరిద్దరు!
శాస్త్రగ్రంథాలలోన
అభిరుచులే లేవింక!
చదువులోన ఆసక్తి
అడుగంటె ఇద్దరికీ!
ప్రేమ ఒకటి తప్పనిచ్చి
వేరేదీ ధ్యాస లేదు;
తీయనిదా ప్రేమ ముడి
కళ్ళల్లో గజళ్ళు!
*
ఔను, గెలిచింది ప్రేమ-
ఇల నన్నింటిని మించి,
నవయవ్వన శోభతో
యువతీయువకుల నడుమ.
ప్రేమపారవశ్యంలో
మునిగినవారిరువురికీ
కళ్ళల్లో బాష్పాలు,
పెదవులపై చిరునవ్వు.
మృదువైన మాటల్లో
క్షణాలు గడిచిపోయాయి;
స్వచ్ఛమైనదా ప్రేమ
నవవసంత రుతువులాగ.
ముందరున్న దారంతా
పూలబాటగా తోచె,
నులివెచ్చని వేసవిలా
కరిగిపోని బాసలాయె.
*
ప్రేమసాగరాన మునిగి,
నిద్రపోయె శంకలనీ,
చూడరని తమనెవరూ
భ్రాంతిలోన పడ్డారు.
వేరే పనిలేక తమని
లోకం గమనిస్తుందా?
విషపు నాలుకలు చాచి
ఆడిపోసుకుంటుందా?
ఎవరికీ తెలియదుగా
తమ ప్రేమావేశమని,
మనసులోన వారిద్దరు
బెరుకుగానె వున్నారు.
గోప్యంగా తామేమో
వున్నామనుకున్నారు,
అందరికీ తెలిసిందే
వారి మనసు ఒక్కటని.
*
హద్దు లేని లౌక్యానికి
చూపుల్లో ప్రతి ఒకటీ
విశదపరిచి తెలిపింది
మనసులోని భావాలు.
నిజంగా ఎన్నడైన
నిజమైన ప్రేమనేది
కళ్ళల్లో భావాలు
దాచడం నేర్చిందా?
వేనవేల వంకీలు
తిరిగాయి కురులన్నీ,
పెదవులేమొ మణులాయె
ముత్యాల పలువరసలు.
చీకట్లో మెరుపుల్లా
జ్వలించే కాంతులతో
ఉండి ఉండి మెరిసిపోయె
నలనల్లని ఆ కనులు.
అంతటి ఆ సౌందర్యం
సమ్మోహనం చేస్తుంటే,
ఎగిసిపడే హృదయాన్ని
దొంగిలించి పోతుంటే-
మనిషైతే ఎవరైనా
ఉంటాడా కలక లేక?
ఏదో యిది కలలే అని
మిన్నకుండి కదల లేక!
చూశాడా సౌందర్యం కైజ్,
చూశాడా మార్దవం;
చూశాడా మోములోన
మధురమైన భావాలు.
చూడగాను చూడగాను
జ్వలించింది మస్తిష్కం;
చూపు మరలిందంటే
కాటేసే ఎడబాటు!
రేయైనా పగలైనా
లేదు లేదు విశ్రాంతి;
లైలాయే మనసంతా
నిండిపోయె నిరంతరం.
అంతలోనె ఎడబాటు
వచ్చిపడిందయ్యయ్యో!
గుండెలోన జ్వాలలు
ఉవ్వెత్తున ఎగిసిపడె.
తాను కూడ వగచింది
అతనితోటి సమంగా;
మిన్నువిరిగి మీదపడె
విధినే నిందించింది.
పరుగిడే అడుగులతో
దిక్కులేక వెర్రిగా
వీధినపడి తిరుగుతాడు
అతడేదో వెతుకుతూ.
వెతకబోయినది యేదో
ఇంకా మరి దొరకదాయె,
తనకేమి కానుందో
తనకే మరి పట్టదాయె.
నిట్టూర్పులు మూల్గులతో
ఎడదంతా ఎగిసిపడె;
ధారలుగా కన్నీరు
కళ్ళవెంట జారసాగె.
మనసులోని బాధంతా
అణచలేని పెనుగులాట,
అణచబోతె రేగుతుంది
అంతకు రెండింతలుగా.
ఒకనాటి ఉదయాన్నే
ఉపశమనం కోసమై
పారిపోయె ఎడారికి
దుఃఖంతో మతిపోయి.
తలమీద కప్పుకోను
ఉత్తరీయమైన లేదు,
కాళ్ళు కాలిపోకుండా
చెప్పులు కూడా లేవు.
ఏరాత్రికి ఆ రాత్రి
బాధ మరీ రెచ్చిపోయె;
ఎడబాటుకు వెతలతోటి
గుండె బరువు హెచ్చిపోయె.
దూరంగా ఎక్కడో
లైలా తన మేడలో!
చేరాలని వెతికాడు
రహస్యమౌ దారి ఒకటి.
ఆ యింటి తలుపు మీద
ముద్దు పెట్టుకున్నాడు;
ఆ ముద్దే అమృతమని
మనసులోన తలచాడు.
ఆ స్వర్గధామానికి
పాదాలు సాగిపోయె;
వెలకొలది రెక్కలతో
వేగంగా ఎగిరిపోయె.
ఆరాధన అతనిది
అంతవరకు నోచింది;
క్రూరమైన ముళ్ళదారి
అడ్డంగా నిలిచింది!
(రెండవ ఆశ్వాసం సమాప్తం)
-ఇంకావుంది
పాఠకులకు విజ్ఞప్తి.
నేను పోస్టు చేయడంలో జరిగిన పొరపాటువల్ల ‘లైలా మజ్ను ‘ రెండో భాగంలో పాదాలన్నీ కలిసిపోయాయి. దయచేసి నాలుగేసి పాదాలు విడివిడిగా చదువుకోవలసిందిగా ప్రార్థన.
చెబుతా విను, అది ఒక బడి;
మనసు మీద సులభంగా
జ్ఞానకాంతి ప్రసరించే
బోధనగల పాఠశాల.
అన్ని తెగల షేకుదొరలు
విద్యకొరకు వదులుతారు,
పిల్లలేమొ చదువుతారు
గురువుల విజ్ఞానబోధ.
ఉన్నాడొక కైజక్కడ,
శ్రద్ధమీర చదువుతాడు;
ఎర్రని తన పెదవులతో
మాణిక్యాలొలుకుతాడు.
లైలా మరి వేరొక తెగ,
లేబ్రాయపు వయసు తనది;
మృదువైనది తన వర్తన,
చూడచక్కనైన రూపు.
వికసించిన మనసు తనది,
సాధారణ దుస్తుల్లో
ఉదయకిరణమంటి వెలుగు,
ప్రశాంతసుందర రూపిణి.
నల్లనివా జింక కళ్ళు,
నిండు చందమామలా
పున్నమంటి వెన్నెల
కురిసే తన చెక్కిళ్ళు.
వేలకొలది హృదయాలను
గెలిచేదా సౌందర్యం!
అదుపులకది లొంగిరాదు,
అవధి లేని ఆశ్చర్యం!
చకితులైరి చూచువారు,
పరవశించిరందరూ!
మనసారా ఆనందం
గ్రోలిన వారొకే ఒకరు!
అలలవోలె తేలిపోవు
నలనల్లని కురులు తనవి!
రాత్రివేళ చీకటిలా
అలుముకున్న భ్రాంతి కలుగు!
అందుకనే పిలుస్తారు
ముద్దుగాను లైలీ అని;
చీకటిలో వెన్నెలగా
మెరుస్తుంది లైలా అని!
ఒక చూపుకు చెలరేగె
ఉవ్వెత్తున కలవరం,
ఒక చూపుకు చెదిరింది
మదిలోపల ఆలోచన!
కైజు గుండె వలపుతో
దాల్చింది అరుణిమ,
తియ్యనైన తలపుతో
ధీరత్వం కోల్పోయె!
నుదుటిపైన నర్తించెను
తుఫానులా ఆవేగం;
తోచలేదు ఆమె మనసు
ఆకట్టే దారేదీ!
తన చెక్కిలి చూడసాగె
కన్నార్పని ఏకాగ్రత;
అలా అలా చూస్తుంటే
ప్రేమ పొంగె ఉవ్వెత్తున.
త్వరలోనే స్పందించెను
హృదయం వారిద్దరికీ;
కలనైనా వేరవ్వని
ప్రేమ గెలిచె ఇరువురినీ.
పుస్తకాలు నెమరేసె
తక్కినవారందరూ;
వీరిరువురు ఆర్తిగా
మాటాడె చూపులతో.
విద్యల్లో పైచేయికి
పోటీ పడె విద్యార్థులు-
కీర్తికాంక్ష మనసంతా!
వీరికేమొ ప్రేమమయం!
పుస్తకాల విజ్ఞానం
శోధించారందరూ;
ఒకరినొకరు చూసుకొంటు
స్తబ్ధుగా వీరిద్దరు!
శాస్త్రగ్రంథాలలోన
అభిరుచులే లేవింక!
చదువులోన ఆసక్తి
అడుగంటె ఇద్దరికీ!
ప్రేమ ఒకటి తప్పనిచ్చి
వేరేదీ ధ్యాస లేదు;
తీయనిదా ప్రేమ ముడి
కళ్ళల్లో గజళ్ళు!
*
ఔను, గెలిచింది ప్రేమ-
ఇల నన్నింటిని మించి,
నవయవ్వన శోభతో
యువతీయువకుల నడుమ.
ప్రేమపారవశ్యంలో
మునిగినవారిరువురికీ
కళ్ళల్లో బాష్పాలు,
పెదవులపై చిరునవ్వు.
మృదువైన మాటల్లో
క్షణాలు గడిచిపోయాయి;
స్వచ్ఛమైనదా ప్రేమ
నవవసంత రుతువులాగ.
ముందరున్న దారంతా
పూలబాటగా తోచె,
నులివెచ్చని వేసవిలా
కరిగిపోని బాసలాయె.
*
ప్రేమసాగరాన మునిగి,
నిద్రపోయె శంకలనీ,
చూడరని తమనెవరూ
భ్రాంతిలోన పడ్డారు.
వేరే పనిలేక తమని
లోకం గమనిస్తుందా?
విషపు నాలుకలు చాచి
ఆడిపోసుకుంటుందా?
ఎవరికీ తెలియదుగా
తమ ప్రేమావేశమని,
మనసులోన వారిద్దరు
బెరుకుగానె వున్నారు.
గోప్యంగా తామేమో
వున్నామనుకున్నారు,
అందరికీ తెలిసిందే
వారి మనసు ఒక్కటని.
*
హద్దు లేని లౌక్యానికి
చూపుల్లో ప్రతి ఒకటీ
విశదపరిచి తెలిపింది
మనసులోని భావాలు.
నిజంగా ఎన్నడైన
నిజమైన ప్రేమనేది
కళ్ళల్లో భావాలు
దాచడం నేర్చిందా?
వేనవేల వంకీలు
తిరిగాయి కురులన్నీ,
పెదవులేమొ మణులాయె
ముత్యాల పలువరసలు.
చీకట్లో మెరుపుల్లా
జ్వలించే కాంతులతో
ఉండి ఉండి మెరిసిపోయె
నలనల్లని ఆ కనులు.
అంతటి ఆ సౌందర్యం
సమ్మోహనం చేస్తుంటే,
ఎగిసిపడే హృదయాన్ని
దొంగిలించి పోతుంటే-
మనిషైతే ఎవరైనా
ఉంటాడా కలక లేక?
ఏదో యిది కలలే అని
మిన్నకుండి కదల లేక!
చూశాడా సౌందర్యం కైజ్,
చూశాడా మార్దవం;
చూశాడా మోములోన
మధురమైన భావాలు.
చూడగాను చూడగాను
జ్వలించింది మస్తిష్కం;
చూపు మరలిందంటే
కాటేసే ఎడబాటు!
రేయైనా పగలైనా
లేదు లేదు విశ్రాంతి;
లైలాయే మనసంతా
నిండిపోయె నిరంతరం.
అంతలోనె ఎడబాటు
వచ్చిపడిందయ్యయ్యో!
గుండెలోన జ్వాలలు
ఉవ్వెత్తున ఎగిసిపడె.
తాను కూడ వగచింది
అతనితోటి సమంగా;
మిన్నువిరిగి మీదపడె
విధినే నిందించింది.
పరుగిడే అడుగులతో
దిక్కులేక వెర్రిగా
వీధినపడి తిరుగుతాడు
అతడేదో వెతుకుతూ.
వెతకబోయినది యేదో
ఇంకా మరి దొరకదాయె,
తనకేమి కానుందో
తనకే మరి పట్టదాయె.
నిట్టూర్పులు మూల్గులతో
ఎడదంతా ఎగిసిపడె;
ధారలుగా కన్నీరు
కళ్ళవెంట జారసాగె.
మనసులోని బాధంతా
అణచలేని పెనుగులాట,
అణచబోతె రేగుతుంది
అంతకు రెండింతలుగా.
ఒకనాటి ఉదయాన్నే
ఉపశమనం కోసమై
పారిపోయె ఎడారికి
దుఃఖంతో మతిపోయి.
తలమీద కప్పుకోను
ఉత్తరీయమైన లేదు,
కాళ్ళు కాలిపోకుండా
చెప్పులు కూడా లేవు.
ఏరాత్రికి ఆ రాత్రి
బాధ మరీ రెచ్చిపోయె;
ఎడబాటుకు వెతలతోటి
గుండె బరువు హెచ్చిపోయె.
దూరంగా ఎక్కడో
లైలా తన మేడలో!
చేరాలని వెతికాడు
రహస్యమౌ దారి ఒకటి.
ఆ యింటి తలుపు మీద
ముద్దు పెట్టుకున్నాడు;
ఆ ముద్దే అమృతమని
మనసులోన తలచాడు.
ఆ స్వర్గధామానికి
పాదాలు సాగిపోయె;
వెలకొలది రెక్కలతో
వేగంగా ఎగిరిపోయె.
ఆరాధన అతనిది
అంతవరకు నోచింది;
క్రూరమైన ముళ్ళదారి
అడ్డంగా నిలిచింది!
(రెండవ ఆశ్వాసం సమాప్తం)
-ఇంకావుంది
రామయ్యగారికి ధన్యవాదాలు. శ్రమపడి నాలుగేసి పాదాలు విడదీశారు. పాదవిభజన సరిగా వుంటే సులభంగా అర్థమౌతుంది. కానీ నేను పోస్టు చేస్తే మాత్రం పాదాలన్నీ కలిసిపోతున్నాయి. ఎలాగో తెలియడం లేదు.