నక్షత్రాలతో నిండిన నింగి నువ్వని తెలిసి
ముద్దాడాలని
ప్రయత్నిస్తుంది మనసు మంచు మైదానం
ఎలా ఆకట్టుకోగలదూ?
ఒట్ఠి ఘనీభవన తెలుపు!
తనను నీరుగా మార్చే,
తప్త కిరణాల జాడ లేదు-
పూల రంగులూ,పండ్ల తీపులూ, లేవు,
రాళ్ళూ,రప్పల సాంగత్యం ఒక విధిగా
మిగిలినట్టు ఒంటరి పిట్ట!
ఎడారి దేహం లోపలి,
శూన్యపు గూడు,
ఒకానొక గతాన, క్షితిజాన,
యధాలాపంగా తాకిందనీ
భువనం దివిని ఏల గలదా?
నది సాగారాన్ని తనలో ఇముడ్చుకోగలదా?
కోరికలదేముందీ? ఊహలదేముందీ?
ఎంత కైనా తెగించగలవు,
తెంపరితనం తెప్పించగలవు,
అందులోంచే పుట్టిన ధైర్యం పేరు ప్రేమ-
అనుకుందేమో,
శూన్యం పాత్ర,
ఏ చిన్న కదలికకైనా,
విరిగిపడడమే కదా దాని గుణం కదా-
తెలియక కాదు, తెలిసే దిగింది అగాధంలోకి-
మరీ నీదో, తిరస్కరణ
ఇక మొదలైంది
ప్రయాసల సముద్రంలో చిల్లులు పడ్డ
పడవ ప్రయాణం
ప్రేమ రాహిత్యపు జీవితం.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
మిగిలినట్టు ఒంటరి పిట్ట
Thank u
చాలా బాగుంది సర్
Thank u
బాగుంది అండి
Thank u