నే పుట్టి పెరిగిన గడ్డలో
మూడే రంగులున్నాయట నిజమా!?
నడుస్తున్న పాదాలన్నీ
ఎర్ర రంగు అద్దుకుంటుంటే
ప్రేమకు చితికిన గుండెలు
గాయాలపాలై మట్టి రంగులో
కలిసిపోతూ నల్లగా మెరుస్తున్నాయి!
నేల నెర్రలు బారి జీర బోతున్న గొంతుకలను
గుమ్మాలకి గుమ్మడి కాయలుగా వ్రేలాడదీసి
స్టేటస్ సింబల్ నవ్వులు పులుముకుంటున్నాయి!
ప్రేమకి రంగు లేదని
కలిసిన మనసులకు విలువలేదని
పుట్టుకతో వచ్చిన రంగులకి
పరువు రంగులు వేసుకుని,
నీ ఇంటి గేటు రంగే
నీ రంగైతే చాలంటూ
నీవు అద్దేటి రంగుల్లో
నిజం మరుగైపోతుందని భ్రమ పడతావు!
నిజం చాపకింద నీరులా
నిన్ను వెంటాడుతూనే ఉంటుంది
నీ బిడ్డల కన్నుల్లో కన్నీటి ధారలై వర్షిస్తూ
దారులన్నీ రక్తసిక్తమై
ఎల్లలు లేని ప్రయాణాలు చేస్తున్నా
ఇంకా పుట్టుకలోని రంగుల్ని పులిమి చూసుకుంటున్న
నీ అహం
వెన్నంటి చెదపురుగై తొలిచేస్తూ
ఆటవిక సమాజాన్ని తలపిస్తుంటే
నిర్మలమైన మనసులు చీకటి రంగులో కలిసిపోతున్నాయి!
*
‘నేల నెర్రెలు బారి జీరబోతున్న గొంతుకలను
గుమ్మాలకు గుమ్మడి కాయలుగా వేలాడదీసి
స్టేటస్ సింబల్ నవ్వులను పులుముకుంటున్నాయి’ powerful rendition rupa.
‘పుట్టుకతో వచ్చిన రంగులకు పరువు రంగులు వేసుకుని..’ ఒక శక్తివంతమైన కాన్సెప్ట్ ను ఎగ్జాక్ట్ గా డీల్ చేసింది ఈ కవిత. నిర్మలమైన మనసులు చీకటి రంగులో కలిసిపోకుండా ఉండాలంటే రంగులు వివర్ణమై అవర్ణ సమాజం రావల్సిందే. Happy to see your poetry in saranga. 💐 Keep rocking..
Thank you very much madhavi garu 😊
చాలా మంచి కవిత రాసిన “రూప రుక్మిణి గారికి అభినందనలు”, మీ కలం నుంచి వచ్చే ప్రతి అక్షరం ఆణిముత్యమే….
మీరు మరిన్ని మంచి భావాత్మకమైన కవితల్ని పాఠకులకు అందించాలని ఆకాంక్షిస్తూ….
……. శ్రీనివాస్ బీర.
Thank you very much sir 😊
Superb. పుట్టుకతో వచ్చిన రంగులకి పరువు రంగులు
Thank you very much sir 😊
చాలాబావుందండీ .
పుట్టుకలోని రంగుల్ని పులిమి చూసుకుంటున్న అహం ఉన్నంతకాలం ఏ సమాజమూ మారదు ..
ఆలోచించేలా చేసింది కవిత
Thank you very much mam😊
Adbhutham..
Thank you kavita 😊
రంగుల గురించి అద్భుతంగా రాసారు రూప గారూ.. గుమ్మడి కాయల పద ప్రయోగం బావుంది
అవును ఇంకా రంగుల్ని చూసుకుంటున్న అహం అలాగే ఉంది. చక్కటి కవిత.
Thank you very much maam😊
మీ కవిత పొరలు పొరలుగా అనేక భావాల్ని పలికింది. అభినందనలు
Thank you very much sir 😊