కనులోతు చేసుకున్న
నలుపంటిన
దారెంట చీకటి తోడైన,
మునుపెన్నడూ అంటని రాత్రిని
వెంటబెట్టుకు
అడుగుల ఖాళీలన్నీ
శూన్యనానికి అంటించి
చూపంత దూరాన్ని
లెక్కల ముడేసుకుని
అల్లీ
అదిగో మళ్లీ
నిండైన గర్భిణీ మేఘం
ఇంటితల
దారి చూసి
వొంటరిగా చినుకుతుంది
తడిచి
ముద్దైన పాతబట్టల మొఖమోలే
యింటి తలుపలా తెరుచుకుంటాను
***
పొద్దున
దారంతా పరుకుకున్న
పూలూ ఆకులూ సగం నరకబడినట్టున్న కొమ్మలూ
నన్ను కానవు
చప్పుడు చెయ్యని
గొంగళి పురుగులా నేనూ
భూమి పాకుతాను
***
రాత్రి వర్షపు కోరికను పొదిగి
మరోమారు
ఊపిరి ఆగినట్టు
ఉత్సాహం బట్టబయలు ఐనట్టు
గాలిదిక్కు కొట్టుకుపోతూ
బయటిదారి అడుగుతాను
మట్టి అడుగులు తొక్కిన గడప
నవ్వుతుంది
తడి స్పర్శ
కాలికంటదు
***
కను కాపలా రెప్పలూ
తడి తగిలీ
వొకంత విస్తుబోతాను
అంతా వో మాయనలుపు
ఔతాను.
*
చిత్రం: సత్యా బిరుదరాజు
|
మాయ నలుపు
మట్టి అడుగులు తొక్కిన గడప
నవ్వుతుంది
Add comment