మళ్లీ వర్షం మొదలైంది

” తెలీదు….మొదటి సారి వ్రాసినప్పుడు…మనసు ఖాళీ అనిపించింది, బరువు దిగి పోయినట్లు. అదీ కావాలని వ్రాసింది కాదు, చెప్పుకోలేక కాగితం మీద పెట్టిన లైన్లు..అంతే”

It’s raining

Now, but it

Started a while ago

Inside .

……….

When you began

To talk.

వర్షం …అంటే జ్ఞాపకం….

జ్ఞాపకం అంటే నువ్వు….నీకు తెలిసినవి కొన్ని…తెలియనివి కొన్ని..అన్నీ కలిసి నేను పోగు చేసుకున్నవి…బుట్టెడు..

నిన్న ఆదివారం సన్నగా జల్లు పడుతోంది…చుట్టూరా నిశ్శబ్దం…నన్ను కూడా నింపుకుంటూ.

ఇంత ప్రశాంతత ఈమధ్య లేదు కదా,.ఏదైనా వ్రాయాలని అనిపించింది….లాప్టాప్ తీసుకుని కుర్చున్నానా …నాలుగు లైన్ల తరువాత….చూస్తే…వాసనలేని పూవుల్లా ఉన్నాయి ..ఉహూ…

ఎందుకిలా..ఇంత మంచి వాతావరణం ..ఆహ్లాదంగా ఉంటే….కానీ అక్షరాలు ఒలికితే కదా….

అదే ఇంకోసారి అయితే అర్థరాత్రి సగం నిద్రలో కూడా పూనకం వచ్చినట్లు….కాగితం అంతా నిండిపోతాయి…ముఖ్యంగా నీకు రాసే ఉత్తరాలు అయితే మాత్రం…

మొబైల్ లో స్క్రోల్ చేశాను ఏదైనా అయిడియా కోసం ….నా నోట్ పాడ్ లో…అప్పుడప్పుడు తట్టే పదాల్ని రాసుకుని ఉంచే అలవాటు… ఈరోజు ఎందుకో సన్నగా అలజడి లోపల….ప్రశాంతంగా లేదు. ఎదో ఫోల్డర్లు వెదుకుతుంటే నీ ఫోటో…ఎప్పటిదో ..

స్వచ్ఛంగా….నన్ను వెంటాడే నవ్వు….An assuring smile…వర్షం జల్లులా…..

To feel the rain ..

One has to get wet….

Completely!

……………..

I started writing. Then it felt.

‘The Unbearable Lightness of Being’.

*.       *.       *

“వూ…..తరువాత? ”

ఖాళీ పేజీ చూసి అడిగాను, ఇంకేమీ లేదా అన్నట్లు.

సావేరి నుండి మౌనం… అలానే కాసేపు ఉండనిచ్చాను. ఇద్దరం బయట కురిసే వర్షం చూస్తూ కూర్చున్నాం. నిశ్శబ్దం అసలు ఇబ్బందిగా లేదు. ఇద్దరి మధ్య మాటలు లేని సమయం ఇబ్బంది గా లేనప్పుడే నిజమైన స్నేహం ఉన్నట్లట, ఎప్పుడో చిన్నప్పటి కొటేషన్. అదే అంటే నవ్వింది ఇందులో డౌట్ ఏముంది అన్నట్లు.

” కాఫీ?”

“ష్యూర్, వేడిగా… నేనూ రానా?”

“ఫర్లేదు, నువ్వు వర్షం చూడు, ఫైవ్ మినిట్స్ లొ వస్తాను” అన్నాను.

మేఘమలహర్ ఆన్ చేశాను, మ్యూజిక్ సిస్టంలో…రెండు కాఫీ కప్పులతో నేను తిరిగి వచ్చేటప్పటికి తనేదో బుక్ లో నోట్ చేసుకుంటోంది.

” నీకు తెలుసా? నువ్వు ఉండటం నాకెంత లక్షరీ నో జీవితంలో? అన్ కాంపరబుల్!”

చిన్నగా నవ్వాను, అంటే తనేదో డిస్టర్బ్ గా ఉన్నట్లు అర్థం.

” నాకు తెలుసు, ఇప్పటికీ ఒక వంద సార్లు చెప్పావు, కానీ సావెరి! దిస్ టూ షల్ పాస్!”

” ట్రూ! అదే ఆలోచిస్తున్నాను, కానీ మీ రోల్ నా జీవితం లో ఎంతో మీకు తెలీదు. నేను ఇప్పటి స్టేట్ ఆఫ్ మైండ్ నుండి మూవ్ ఆన్ అవ్వచ్చు, ఇంకెన్నో మార్పులు రావచ్చు, బట్ ద ప్లేస్ యు హవ్ విల్ బి ఫరెవర్”

నేనేం మాట్లాడలేదు. షి కన్ అండర్ స్టాండ్ మై సైలెన్స్! తన మూడ్ నీ బట్టి నువ్వు మీరు మారుతుంటాయి.

మేఘమలహార్ పూర్తయ్యింది. క్రీపర్స్ నుండి వరండాలో జారి పడుతున్న నీళ్ళ చప్పుడు, గాలికి ఆకుల సవ్వడి తప్ప ఇంకెవరూ లేరు.

” ఎందుకు నువ్వు వ్రాయాలి అనుకుంటున్నావు, వై డు యు వాంట్ టు రైట్? మే బి ఎందుకు వ్రాయడం ?” అడిగాను.

సావేరి డీప్ గా ఫీల్ అవుతూ ఉంటే, మాటలకి ముందు వెనుక నిశ్శబ్దపు సవ్వడి ఎక్కువ….నాకు తెలుస్తుంది. బహుశా నాకు మాత్రమే తెలుస్తుంది. తన జీవితంలో నాకు పరిచయం లేని పేజీలు ఏవీ లేవు, నేను చదవాలి అనుకోక బద్దకంగా వదిలేసిన పేరాలు కొన్ని ఉంటాయేమో అక్కడక్కడ.

” తెలీదు….మొదటి సారి వ్రాసినప్పుడు…మనసు ఖాళీ అనిపించింది, బరువు దిగి పోయినట్లు. అదీ కావాలని వ్రాసింది కాదు, చెప్పుకోలేక కాగితం మీద పెట్టిన లైన్లు..అంతే”

” ..ఇంకా…”

” ప్రతి రోజు కలిసే మనుషులు, నేను ఎఫెక్ట్ అవుతున్న తీరు, స్పందనలు…ఎలా అని అందంగా చెక్కగలిగే నేర్పు లేదని మీకు తెలుసు ..

మనసుని లైన్లలో పరచడం తప్ప…”

“ఐ నో!”

” మీరు అన్నీ విని భరించగలిగి ఉండబట్టి…లేకపోతే…నా ఇంబాలన్సు కి….బహుశా ఏ రమణ ఆశ్రమంలోనో, పాండిచ్చేరి లోనో, ఇంకెక్కడో.. చేరేదాన్నేమో”

నవ్వేసాను” …రెండు ఎక్స్ట్రీమ్ స్టేట్స్…ప్రేమ ఆర్ ఎమోషన్, ఫిలాసఫీ ..నా”

“కాదా మరి?”

” ఒక్క విషయం అడగనా? ” చిన్న తడి సావెరి గొంతులో.

” చెప్పు”

” నేను ఇన్నిసార్లు మీ ముందు మాట్లాడాను, మనసు బాలేక పరిగెత్తుకు వచ్చేస్తాను, చెప్పలేనివి, నా రాతల్లో ముందు మీకే చూపిస్తాను, సరిగ్గా ఎలా కావాలని నా మనసుకు అనిపిస్తుందో మీ రియాక్షన్ అలానే ఉంటుంది….”

నేను మౌనంగా వింటున్నాను…తన ముఖంలో చూస్తూ….

“…..అర్థరాత్రి మనసు ఆపుకోలేక ఒకలైను వాట్సాప్ చేస్తే, నేను డిస్ట్రబ్ అయ్యానని మీరు సెటిల్ చేసేదాకా పడుకోరు…. రియాలిటీ చెక్ కోసం నన్ను తిట్టినా, చిన్నపిల్ల వా నువ్వేమైనా అని కొప్పడినా, ఆ టైమ్ కి అది అవసరమే అనిపిస్తుంది”

“కానీ ఇంత కన్ ఫ్యుసెడ్ గా ఎమోషనల్ గా ఉన్న నన్ను , సొంత వాళ్ళే భరించే ఓపిక కష్టం. దే సే అయాం మూడీ!”

మళ్లీ నిశ్శబ్దం ….తన కళ్ళల్లో నీళ్ళు….మరీ ఎమోషనల్ అయిన మనసులు ఎలా ఉంటాయో నాకు తెలుసు …

” మీరెలా భరిస్తారు… నా పనుల్లో పడితే ఎక్కువగా పలకరించే టైం కూడా ఉండదు ఒక్క అయిదు నిముషాలు వాట్సాప్ కాన్వరసేషన్ తప్ప. కొన్నిసార్లు గిల్టీగా ఉంటుంది”

నేను నవ్వేసాను, “ఫర్లేదు, అర్థం చేసుకోగలను అని నీకు తెలుసు”

” కాదు, నా ప్రాపంచిక బంధాల్లో నేను పీకల్లోతు కూరుకు పోయినప్పుడు మనసుకి ఒక అష్యురన్స్ ఎక్కడో లోతుల్లో….చాలా సార్లు నేను మాట్లాడలేను…But it’s all the duty I need to perform in the relationship s I am tied to. యాం ఐ టేకింగ్ యు ఫర్ గ్రాంటెడ్?”

పెద్దగా నవ్వాను,” ఏమైంది నీకీరోజు….అది అవుతూనే ఉంటుంది సావెరీ, ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఆ ఫీలింగ్ రావడం ఆ ఇంప్రెషన్ ఇంకొరికి ఇవ్వడం సహజం. నాకు చాలా సీనియర్ ఒకరు చెప్పారు, ఎవరైనా సమస్య మనతో షేర్ చేసుకుంటూ ఉన్నంత కాలం, ఆ అనుభవం టుగేదర్నేస్ బావుంటుంది, ఆ ప్రాబ్లెమ్ ఇద్దరినీ కలిపి ఉంచిందా, లేక కలిసి ఉన్నందున ప్రాబ్లం డీల్ చేయడం తేలిక అయ్యిందా, అనే అవేర్నెస్ అవసరం. కొన్నిసార్లు సమస్య దూరమయ్యాక మనమే సమస్య మిస్ అవుతామట. అలా కాకుండా మనల్ని మనం వాచ్ చేసుకుంటూ ఉండటం అవసరమని చెప్పారు.”

“ఉమ్….సో ట్రూ”

” ఇంకేంటి చెప్పు….”

” ఉహూ…ఏం లేదు. వెళ్ళనా? ”

” పద డ్రాప్. చేస్తాను. రాత్రి చుక్కలు చూసాక దార్లో యు విల్ ఫీల్ మచ్ బెటర్”

……

ఇద్దరం కార్లో ఏమీ మాట్లాడుకోలేదు. చల్లటి గాలి ఒక్కటొక్కటిగా బయట పడుతున్న నక్షత్రాలు….ఇష్టం లో కూడా పెయిన్ ఉంటుంది సంతోషంతో పాటు….మే బి నా లాంటి వాళ్లకు. తన క్వార్టర్ వచ్చింది.

” గుడ్ నైట్ సావేరీ, హాయిగా పడుకో! ”

“…….”

” చెప్పు, ఏమైనా మాట్లాడాలా?”

” మీరిందాక అడిగారు, మొదటి పేజీ తర్వాత…? ” అని.

” అవును”

” ఇప్పటిదాకా మాట్లాడాను…..అదే. I wrote in my speech.”

” చాలా మంచి స్టార్ట్. మొదటి పేజీ .. అదేవరికోసం”

చిన్నగా నవ్వింది. ” గుడ్ నైట్”

” గుడ్ నైట్!”

……

ఇంటికొచ్చాక వాట్సాప్ మెసేజ్ సావేరి నుండి…

” In loving you

I forget myself.

When there is no self

No pain, No hurt

I forgot myself

In my love for you”

పడుకునేముందు తనకి రిప్లై ఇచ్చాను, ఎదురు చూస్తోందని తెలుసు….

” నా కు తెలుసు! కొన్ని బంధాలు ప్రాపంచిక సంబంధాలకు అతీతం….దే బిలాంగ్ టు అనదర్ స్పేస్! వర్షం భూమికి చెందుతుందా లేక ఆకాశానికా, ఈశింట్ ఇట్ బెటర్ నాట్ టు క్వశ్చన్ దిస్?”

………

సమాధానంగా స్మైల్ సింబల్!

మళ్లీ వర్షం మొదలైంది.

*

 

 

 

 

శ్రీరంగవల్లి

చదవటం ఇష్టం. ఇలాంటివి అని చెప్పడం కష్టం - వాతావరణాన్ని బట్టి( బయటా లోపలా) ఏదైనా కావచ్చు: టాగూర్, రూమి, చలం ఇంకా చాలా. మనుషుల్ని చదవటం ఇంకా ఇష్టం - రోజువారీ జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరి ప్రభావం మనమీద అంతో ఇంతో లేకుండా ఉండదు అని నమ్ముతాను. ఇలాంటి చాలా అద్దాల్లో కనిపించే మనల్ని పరీక్షగా చూసుకోవడానికి జె.కె ఫిలాసఫీ ఇంకా ఇష్టం. వృత్తి రీత్యా మాధమ్యాటిక్స్ ఫాకల్టీ, అప్పుడప్పుడు రాసుకున్న లైన్లు ఎప్పుడైనా ఇలా..బయట పడుతూ ఉంటాయి-

ఆమె( ఇమ్మే) చ్యూరు గా…..

4 comments

Leave a Reply to Valli Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వల్లీ గారూ, ఒక్కో వాక్యం చాలా తేలికగా తేలికపరిచేలా ఉంది. మీరన్నట్టు “… క్రీపర్ మీది నుంచి జారుతున్న వర్షపు చుక్కల్లా” ఉన్నాయి. ఆ ఇద్దరూ నాకు తెలిసినట్టు ఆ సంభాషణ, సందర్భంలో నేనూ (రీడర్) ఉన్నట్టు అనిపించింది చదివేప్పుడు <3 keep writing, keep sharing. ఇక నుంచీ వర్షం మీ జ్ఞాపకం కూడా నాకు.

  • నమస్తే వల్లి గారూ….
    మీరు Rishivally వల్లి అక్క లా రేఖ ద్వారా పరిచయం. చాలా బాగుంది, నిశబ్దం లో ఆనందం అనుభవిస్తే తెలుస్తుంది. మనం బాధలో ఉన్నప్పుడు చెప్పకుండా తెలుసుకొనే సన్నిహిత స్నేహితులు కొంత మందే ఉంటారు. కొన్ని వాక్యాలు చదివినప్పుడు రేఖ గుర్తు వచ్చింది…

    • చాలా సంతోషం సుధా, మీరు చెప్పింది నిజం. అలాంటి మనుషులు, మనసులు ఉండటం, ఒక పెద్ద బ్లెస్సింగ్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు