మర్త్యలోకం

అక్కడ
అందరూ మరణిస్తారని తెలిసీ
జీవితం గురించి కలలు కంటుంటారు
సీతాకోకచిలుకలు కావాలని
గొంగళిపురుగుల్లా హైబర్నేట్‌ అవుతుంటారు!
పోలార్‌ బేర్‌ లాగా ఒక ధ్రువం చెంతనే
విసిగిపోయి వేలాడుతుంటారు,
పరిథి దాటి రాలేని చట్రాల్లో పరుగిడుతుంటారు!
లగ్జరీలు
అందరాని ద్రాక్షలా ఊరిస్తుంటే
తకేషీ కేజిల్‌ లాంటి సాహసాల నడుమ
ఎలాగోలా లంకించుకుని..
.. విజేతలమని భ్రాంతి పడుతుంటారు
మరణం కాచుకుని ఉన్నప్పుడంతా
జీవితమే కావాలనీ…
జీవించేటపుడు మరణిస్తే బాగుండుననీ…
మనుషులెప్పుడూ
ఆ రెంటిలో ఏదో ఒకటి కోరుకుంటుంటారు
అక్కడ
అందుకే మరణాలూ-జననాలూ
అనవరతం!
A poem without title
ఒకప్పుడు
ప్రపంచంలో మనుషులుండేవాళ్ళు కారు
మెల్లగా చెట్లూ, పక్షులూ, జంతువులూ
వచ్చాయి
పురుషుడు-స్త్రీ కూడా వచ్చారు
వాళ్ళే మనుషులమని చెప్పుకున్నారు
మనిషి మెల్లగా
ప్రకృతిలో మమేకమయ్యాడు
కొన్ని
రహస్యాలు తెలుసుకున్నాడు
శాస్త్రాలూ, ధర్మాలూ అన్నీ కనిపెట్టాడు
పురాణాలూ, శాసనాలూ చేశాడు
ఇది
ఇలాగే ఉండాలి అని శాసించాడు
కొంతకాలానికి
అంతా
హస్తగతం చేసుకున్నాడు
యుద్ధాలూ, గొడవలూ
హత్యలూ, ఆత్మహత్యలూ
కులాలూ, మతోన్మాదాలూ
రాజకీయాలూ, అరాచకీయాలూ
అవమానాలూ, అత్యాచారాలూ…
… ఎన్నో మొదలయ్యాయి!
ఇప్పుడు
మనుషులనబడేవాళ్ళున్నారు
కానీ
మనుషులుగా ఒప్పుకోబడే వాళ్ళు తగ్గిపోయారు!
*

గీతా వెల్లంకి

8 comments

Leave a Reply to తండ హరీష్ గౌడ్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రెండు కవితలు
    బాగున్నాయి..
    మారిపొయిన మనిషి తనం గురించి
    చెప్పిన విధానం గొప్పగా ఉంది.
    కవయిత్రికి……అభినందనలు
    శుభాకాంక్షలు.
    కె.ఎల్వీ _ హనంకొండ

  • రెండూ బావున్నాయి..మొదటిదీ బాగా నచ్చింది్

  • మీ మర్త్యలోకం లో విహరించి హైబర్నేట్ అవుతూ కలలుకనేవాళ్ళని మీ కళ్లతో చూసాను..మంచి కవిత గీత గారు. All the best

  • అక్కడ,.. ఒక్కప్పుడు.,, ,రెండు. ముత్యంకవిత లే..మీకు మనః పూర్వక అభివందనలు.. మేడం.👌👌💐

  • Both are unique in their own way ….Different ones from your regular love poetry😍😍😍

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు