సకీనా అనే పదిహేడేళ్ల అమ్మాయి కోసం వెతుకుతుంటాడు ఆమె ముసలి తండ్రి. చివరికి ఓ రెఫ్యూజీ క్యాంప్ లో కనిపిస్తుంది, ఓ మంచం మీద జీవచ్ఛవంలా పడి ఉంటుంది. అతని ఆనందపు కేకలు విని, ఏంటంటూ గదుముతాడు అక్కడున్న డాక్టర్. ‘ఆ పిల్ల తండ్రి’నంటాడా అమాయకుడు ఆత్రంగా. గదంతా చీకటి. ‘ఖోల్ దో’ అంటాడు డాక్టర్, కిటికీరెక్కలనుద్దేశించి. ముసలాయన కిటికీ తెరిచి, ఆ వెలుగులో కూతుర్ని చూసుకుని సంబరపడుతుంటే, విప్పమన్నాడనుకు
సాధారణమైన జీవితాలు కథలుగా మారినప్పుడు, సాధారణంగా వాటిలో చమత్కారం ఉండే అవకాశం తక్కువ. కానీ మంటో కథలు అందుకు మినహాయింపు. ఇక్కడ చమత్కారమంటే పెదవుల మీద విరిసే చిన్నపాటి నవ్వు మెరుపు కాదు, అదొక విషాదభరితమైన విరుపు. అది ఓ పక్క కథకుడి నైపుణ్యానికి గమనికగా మారి, చూపులగుండా పరుగులు తీస్తూనే, మంటో పూర్తి పేరు – సాదత్ హసన్ మంటో. 1912, మే పదకొండున, పంజాబ్ లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆత్మాభిమాని. నిర్మొహమాటస్తుడు. తనలోని ఆవేదనకు, కోపాన్ని ఔట్లెట్ గా చేసుకున్నవాడు. బొంబాయి నగరాన్ని పిచ్చిగా ప్రేమించినవాడు. తన కథల అద్దాల్ని, సమాజం ఎదుట నిర్భయంగా నిలబెట్టి. నిజాల్ని చూసుకోమన్నవాడు. ఇనుప ఊచల ఆసరాతో పైకెగబాక జూసి నేలరాలిన సాలెపురుగు లాంటివాడు మంటో. ఎదురుగా ఉన్నదే, కళ్ళతో చూసిందే, చెవులతో విన్నదే, మనసు అర్థం చేసుకున్నదే రాసాడతడు. అతనిది రెక్కలు తెగిన పక్షిలాంటి వేదన. హృదయాన్ని రెండు ముక్కలు చేసుకుని, ఒకదానితోనే బ్రతకాల్సి వచ్చిన నరకయాతన.
మంటో రాసిన ఓ కథను, అతని భార్య చదువుతున్నట్టుగా సినిమా మొదలవుతుంది. ‘మీ కథలు భయపెట్టినంతగా, నన్ను మరేవీ భయపెట్టలేవం’టుందామె. అది, భారతదేశంలో స్వేచ్చా వాయువులు నిండబోతున్న కాలానికి, సరిగ్గా ఏడాది ముందరి సమయం. అప్పటికే అతను చాలా కథలు రాసాడు. ఇంకా ఇంకా రాస్తున్నాడు కూడా. సినిమా రంగంలో కూడా నిలదొక్కుకునే ప్రయత్నంలో, సాహిత్యంతో సహా లూటీ అవుతున్నాడు. దేశభక్తి గురించో, ఆంగ్లేయుల అరాచకాల గురించో రాయమని తోటి సాహిత్యకారులు ఎంతగా చెప్పినా వినకుండా, అభాగ్యులైన వేశ్యలూ, అసహాయులైన ఆడవారూ ఎదుర్కొంటున్న కష్టాలనూ, అన్యాయాలనూ, నైతిక విలువల వలువలు ధరించని కథల రూపంలో ప్రదర్శిస్తున్నాడు. వాడకూడని పదాలు వాడుతున్నాడన్న ఆరోపణలతో, కోర్టు కేసుల్లో చిక్కుకుంటున్నాడు. అయినా అతను తన దేశాన్ని అమితంగా ప్రేమిస్తూనే ఉన్నాడు. తన బిడ్డ, స్వతంత్ర భారతంలో పుట్టబోతోందని ఎంతో సంబరపడతాడు కూడా.
కానీ దేశాన్ని రెండు ముక్కలు చేసిన ఆ స్వాతంత్య్రం, అతన్ని, తనదీ, పరాయిదీ కాని ప్రాంతానికి తరిమేస్తుంది. అప్పటినించే అతను, వేళ్లతో సహా పెకిలింపబడి, మరో చోట పాతబడిన మహా వృక్షంలా ఎండటం మొదలుపెడతాడు. పుట్టి పెరిగిన ప్రాంతాలపై, నగరంపై ప్రేమను చంపుకోలేక విలవిలలాడతాడు. మాటిమాటికీ ముఖం దిమ్మెక్కించేంత బలమైన దెబ్బలు తింటున్నా, ముక్కు సూటితనాన్ని మాత్రం వదులుకోలేకపోతాడు మంటో. అతని నిజాయితీ, నిర్భయత్వమే కాదు, పంచ ప్రాణాలూ పెట్టి రాసుకున్న ఆఫ్సానాలు కూడా అతనికి తిండి పెట్టలేకపోతాయి; పైగా వివాదాల్లోకి తోసి వినోదిస్తాయి కూడా. దేశ విభజన కారణంగా నష్టపోయి, నాశనమైపోయిన లక్షలాది కుటుంబాల గురించీ, దిక్కులేకుం
ఆ మద్యం మహమ్మారి, అతని మనసుకేమాత్రం సాంత్వన చేకూర్చిందో తెలీదు గానీ, అతని శరీరాన్ని మాత్రం మెల్ల మెల్లగా తినేస్తుంది. దీనికి తోడు, పిల్లల వైద్యానికి కూడా మందులు కొనలేనంత ఆర్ధిక దౌర్బల్యం, మోసకారి ఎడిటర్లు చూపే మొండి చేతులూ, సహనమూర్తి అయిన భార్యలో కూడా వ్యతిరేకతను పుట్టించేటంతటి అనననుకూల పరిస్థితులూ… పోనీ అలా అని, ఉన్న ఒక్క స్నేహితుడూ (అప్పటి వర్ధమాన నటుడు శ్యామ్ చడ్డా) చాస్తున్న స్నేహ హస్తపు సాయాన్ని అందుకుందామంటే, అడ్డుగా వచ్చి కూర్చునే ఆత్మాభిమానమొకటి. చివరికి, తన కుటుంబం కోసమైనా తాగుడు మానాలని నిర్ణయించుకుని, రీహాబిటేషన్ సెంటర్ లో చేరతాడు. అక్కడితో సినిమా పూర్తయినప్పటికీ, తర్వాత మంటో ఎంతో కాలం బ్రతకలేదు. మద్యం మహమ్మారి శిధిలం చేసి పెట్టిన శరీరం, అతనికి ఇంకెంతో కాలం నివాసంగా నిలబడలేకపోయింది. ఏ నేలకూ చెందని చోట పడి మరణించిన అతని కథలోని ఓ పాత్రలాగే, అతని మనసు అప్పటికే చచ్చిపోయింది. మిగిలిపోయిన అతని దేహం కూడా, 1955 జనవరి 18న, అంటే అతని 42వ ఏట, అలా మట్టిలో కలిసిపోయింది. బ్రతకాల్సివచ్చిన ఆ కాస్త సమయంలోనే, ఏవేవో జీవితాల్నీ, ఎవరెవరివో జ్ఞాపకాల్నీ, ఎన్నెన్నో దుఃఖాల్నీ – ఓ చిన్ని పెన్సిల్ ముక్కకు గుచ్చి తెచ్చి, కాయితాల నిండా ఎండబెట్టాడు మంటో మన కోసం. అతని కథలతో కూడిన ఇరవై రెండు కథా సంకలనాలు ప్రచురితమయ్యాయంటే, ఎన్నెన్ని కథల్ని, ఎంత సులువుగా, ఆశువుగా రాసేసి ఉంటాడో ఊహించుకోవచ్చు.
మంటోని మంటోలాగే నిలిపి చూపగలిగిన నిలువెత్తు అద్దంలాంటి సినిమా ఇది. సినిమా మొదలవుతుండగానే, తెర మీద ప్రత్యక్షమయ్యే, కళాత్మకత నిండిన ఖచ్చితమైన రంగుల సమ్మేళనం, మనకి ఆ సినిమా ఎలా ఉండబోతోందో ముందుగానే చెప్పేస్తుంది. చిట్టచివరివరకూ ఆ మూడ్ ను ఎక్కడా చెడిపోనివ్వదు. దాంతోపాటుగా, మంటో జీవిత కథతో, అతను రాసిన కథల్ని కలిపిన విధానం, సినిమాకి మరింత విలువను చేకూర్చింది. కానీ అతని మరిన్ని కథలూ, అందులోని పాత్రలూ, అక్కడలా అతనితో కలిసిపోతూ, ఇంకాసేపు కనిపిస్తే బావుండుననిపిస్తుంది.
ఆ కాలంనాటి వాతావరణాన్నీ, సామాజిక పరిస్థితులనూ కళ్లకు కట్టినట్టుగా చూపిందీ సినిమా. నవాజుద్దీన్ సిద్ధికీ నటన కారణంగా మంటో మీద ప్రేమ పుట్టిందో, లేక మంటో వ్యక్తిత్వాన్ని నవాజుద్దీన్ అంత గొప్పగా ఆవిష్కరించగలిగాడో తెలీదు గానీ, ప్రతీ క్షణం ఆ తెర మీద కదలాడిన వ్యక్తి, ఎంతో ప్రీతిపాత్రంగా అనిపించాడు. కానీ ముఖ కవళికలూ, కళ్ల పరంగా పోల్చుకుంటే మాత్రం, ముందుగా అనుకున్న ఇర్ఫాన్ ఖాన్ నే బాగా నప్పి ఉండేవాడేమో. మంటో మీదా, అతని కథలు మీద నందితా దాస్ కు ఉన్న ప్రేమంతా, ఆమె దర్శకత్వ ప్రతిభలో కలిసిపోయి ప్రవహించడంతో, తెరమీది బొమ్మలు, జీవంతో నిండిన జీవితాలై తొణికిసలాడాయి. కానీ సినిమాని పరిమితం చేసే సమయాభావం కారణంగా, మంటో మనతో ఎంతోసేపు లేడన్న అసంతృప్తి మాత్రం, కాస్తో కూస్తో కలిగి తీరుతుంది.
*
|
మండే కథల ‘మంటో’
ఇక్కడ చమత్కారమంటే పెదవుల మీద విరిసే చిన్నపాటి నవ్వు మెరుపు కాదు, అదొక విషాదభరితమైన విరుపు.
avunu manto gurinchi rasina ee vishayamu chaduvutuntene naaku vipareetamina bahyamestundi–
manchi cinemanu parichayam chesinanduku dhanyavadhalu madam.