భారతీయ హైకులు

1.
సాయంత్రమవుతోంది-
పాత వార్తల మీద
పేపరువాడి నిద్ర
     — ఏ.త్యాగరాజన్,ముంబయ్
2.
ఆస్పత్రి కిటికీల గుండా
నొప్పి మాయమవుతోంది –
చెర్రీలు వికసిస్తూ
      — అమితవ దాస్ గుప్త, కోల్ కతా
3.
నాకూ
పర్వతశ్రేణికి నడుమ
రైలు పోతోంది.
    — ఏ.సేతురామయ్య, ఢిల్లీ
4.
చర్చ్ శ్మశానం-
దగ్గర్లో ఎక్కడ్నుంచో
లిల్లీల సువాసన
     — గౌతమ్ నాదకర్ణి, ముంబయ్
5.
రాత్రి వ్యాహాళి –
నెమ్మదిస్తాను
మల్లెపొదల దగ్గర
         —- జొహన్నెస్ మంజ్రేకర్, మైసూర్
6.
దట్టమైన పొగమంచు-
దూరంగా వేసిన కూతలో
రైలు అదృశ్యమయింది.
         — కళా రమేష్, పూణే
7.
ధ్యానం అయిపోయింది-
కొమ్మల మధ్యన
నిండు చంద్రుడు.
        — కె.రమేష్, చెన్నై
8.
అడుగులేస్తున్నాను-
పిట్ట
ఉదయపు పిలుపు వైపు
        — కామేశ్వర రావు, పూణే
9.
పక్షిపాట-
పాత వంతెన
గుండా వెళుతూ
        — పూజా మలుస్థే, మహారాష్ట్ర
10.
వసంత వర్షం-
సంభాషణలో
తరువూ,నేను
      — పురుషోత్తమరావు రావెల, గుంటూరు,
11.
నిండు చందమామ-
కారు పక్క యువతి
తన నీడ మీద నుంచుంది.
       — ఆర్.జె.కల్పన,ముంబయ్
12.
ఆలయ శిథిలాలు-
గాలి మాత్రమే ఇంకా
పూలు అర్పిస్తోంది.
      — రోహిణీ గుప్త, ముంబయ్
13.
కరెంట్ కోత-
ఈ రోజు నేను
పక్షుల కిలకిలు విన్నాను.
     — ఉషా కిరణ్, బెంగుళూరు
14.
పంట పొలాల్నీ
పర్వతాలని మింగేసింది-
భారీ పొగమంచు
   — సునిల్ ఉనియాల్ , లక్నో
*

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

4 comments

Leave a Reply to Pallipattu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవిత రాసిన హైకూ రాసిన లేదా అనువదించిన మీకు మీరే సాటి అన్న…హృదయ పూర్వక అభినందనలు

  • మంచి హైకు ఎంచుకుని అనువదించారు. బావున్నాయి శ్రీనూ -మాకినీడి

  • అద్భుతమైన హైకూలు అందించిన మీకూ..
    చదివించిన సారంగకు ధన్యవాదాలు అన్న…
    శుభాకాంక్షలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు