దున్నేగిత్తలుపై వాలి
మన్నుబెడ్డలపై వాలి
పరమ మురిపెంగా
పవిత్రాతి పవిత్రంగా
నొగపైనా
మేడిపైనా
కాడిపైనా
మట్టిపై మమకారాన్ని
పాదాలనిండా మోసుకుని వాలే
నా ప్రేమరెక్కల తూనీగా..!
వాలొచ్చునుగదా వొకతూరి
కావళ్ళుమోసిన నా భుజాలమీద
కాయలు కాసిన నా ముంజేతులమీద!
కల్మషాల కుటిలకుండ కాలవవతలే పగలగొట్టేసి
ప్రేమించడం నేర్చుకున్నాను
నేలని
గాలిని
గాలిపీల్చి నేలమీద బతుకు పాటపాడే
సమస్తాన్ని..!
తలపై
కలపై
లోలోపల అలలపై నువ్వలా వాలితేచాలు
నువ్వలా వాలితే చాలు…
ఎదవాకిళ్ళల్లో వాన కురుస్తుంది
పాదులపొత్తిళ్లలో
ప్రాణం మొలుస్తుంది.!
*
కల్మషాల కుటిలకుండ కాలవకవతలే పగలగొట్టేసి
ప్రేమించడం నేర్చుకున్నాను. చాలా బాగుంది కవిత.
అభినందనలు కవి మిత్రమా.
ధన్యవాదాలు సర్
బాగుంది సార్…
ధన్యవాదాలు సర్
ఎద వాకిళ్ళలో వాన కురుస్తుంది
ధన్యవాదాలు అన్న
కవిత చాలా బావుంది
ధన్యవాదాలండి…💐