పెసిమిస్ట్ డాగ్

రోడ్డుపక్క విరిగిన కరెంటు పోలుకు

యెలుగని బుడ్డబల్బు వోలే వుంది బతుకు

చాలాసార్లు నల్ల కుక్క ఎదురొచ్చే కారు కింద పడి చావాలని ఉరికింది

ఆ కారోడికి కారుణ్యం లేదు

మృత్యుగానం వినకుండా తప్పుకు పోయాడు

 

డాటా అయిపోయాక తిరిగి తిరిగి ఆరిపోయే మొబైల్ వోలే

ఆత్మరతిలో చినిగిపోయిన ఎముకల గూడు వోలే

రహస్యంగా తీసిన నాసి రకపు పోర్న్ వీడియో వోలే

దయ్యాల కోన వోలే వుంది

దుఃఖితాత్ముల లోకం

 

చదవలేని సాఫ్ట్ కాపీ వోలే

ఎన్నటికీ కొనలేని యాపిల్ ఫోన్ వోలే

ముసలితనం వొచ్చినా ఎక్కలేని జెట్ ప్లేన్ వోలే

ఎవరూ పూడ్చలేని భూమిపుండు వోలే వుంది

ఈ భైరవ జీవితం

 

ఒకేఒక్క నెక్కర్ వున్నోడు

చినిగి పీలికలైనా తొడుగక తప్పనట్టు వుంది

ఈ ఒకే ఒక్క తోలు దేహం

 

చిరాకుతో వొదిలేయలేము

ఓపికతో మోయలేము

*

జిలుకర శ్రీనివాస్

2 comments

Leave a Reply to Giri Prasad Chelamallu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు