పాటిబండ్ల రజని కవిత్వం

‘పాలింకిపోవడానికి మాత్రలున్నట్టే-  మనసింకి పోవడానికీ మాత్రలుంటే బాగుండ’ని పాటిబండ్ల రజని తన అబార్షన్ స్టేట్ మెంట్ కవితలో

చేసిన వ్యాఖ్యలు స్త్రీల శరీరాలే తప్ప మనసుల జాడ కనలేని వారికి కనువిప్పు.

స్త్రీలు అనుభవించే మానసిక, శారీరక హింస, అణచివేతలను, అసమానతలను పాటిబండ్లరజని ప్రశ్నించారు. పునరుత్పత్తి స్వేచ్ఛ కోసం గొంతెత్తారు. పితృస్వామ్య భావజాలంపైతిరుగుబాటు ప్రకటించారు.  స్త్రీవాద కవిత్వం మీద జరిగిన దాడిని, అణచివేత ప్రయత్నాలనుసమర్థవంతంగా తిప్పికొట్టారు.  స్త్రీలను వంటింటికే పరిమితం చేసే ధోరణిని తిరస్కరించారు.

Post modern poetry లో విప్లవ కవిత్వ శాఖలా స్త్రీవాద కవిత్వం విసృతమవుతున్నసమయంలో తన తిరుగుబాటును బలంగా నమోదు చేసిన కవయిత్రి పాటిబండ్ల రజని.

 

ఝాన్సీ పాపుదేశి

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవితగా, చెప్పిన, ఆ వాక్యాలు ని ఎన్నిసార్లు తల్చుకుంటామో, ఈబతుకుల్లో.. మనసు ఇంకి పోవడానికి, మాత్రలు రాలేదు.ఈజీవితం మారలేదు.. కవిత, మీ గొంతుక లో👌.మేడం. ధన్యవాదాలు.

  • పొరపాటుగా 1919 లో రాసిన కవితగా చదివాను. 1990 లో రజని గారు రాసిన కవిత అది. పొరపాటుకు క్షమాపణలు🙏🏻

  • ‘‘మానవ సంబంధాల ఉన్నతీకరణే సాహిత్యం, మానవీయ విలువల్నీ, ఆ సంబంధాలనూ అత్యద్భుతంగా ప్రతిబింబించడమే కవిత్వం. వీటిని తరతరాలకు అందించేది సాహిత్యమే. సాహిత్య అధ్యయనం తగ్గిపోతే, మానవ సబంధాలు క్షీణిస్తాయి.

    అందుకే, మంచి మంచి కథలు చెబుతూ పిల్లల్లో మానవీయ విలువలు పెంపొందించాలి. వారికి బాల్యం నుంచి సున్నితత్వం నేర్పాలి.

    పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు సెల్‌ఫోన్‌ చూపించే బదులు, వారికి కథలు చెబితే వారిలో గ్రహణ శక్తి పెరుగుతుంది. అలా మన కథల సంప్రదాయాన్ని పునరుద్ధరిద్ధాం’’ అని అన్నారు బలమైన భావజాలమున్న స్ర్తీవాద రచయిత్రి, కవయిత్రి పాటిబండ్ల రజని గారు.

    ” అసమానతలపై అసహనమే నా సాహిత్యం ” ~ పాటిబండ్ల రజని

    https://lit.andhrajyothy.com/interviews/asamanathala-pi-ashaname-na-saahithyam-25915/page/1

  • కవితను కవితంత గొప్పగా చదివారు..బావుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు