ఒక మాట
ఒక కరచాలనం
ఒక పిలుపు
కరువైన చోట
మనిషి మనగలడా?
తనకు తానుగా
ఎన్ని నినాదాలు చేసినా
గది గోడలు దాటని వేళ
గుండె ప్రకంపనలు ఏమగునో!
నీకూ నాకూ మధ్య
దూరమెప్పుడో
సృష్టించబడి
మొలిచిన ముళ్ళ కంచె
పెకలించగలమా?
ఒక మూలుగులాంటి
మాట చెవిలో దూరి
గుండె లోతులలో
ప్రతిధ్వనిస్తే
గడ్డ కట్టిన కాలం పగిలిపోదా!
ఏనుగో ఒంటో
తోడేళ్ళు తరుముతుంటే
గీచిన బొమ్మ పగిలి
నేలంతా పరచుకున్న పాదరసం
ఇప్పుడు జ్వరానికి
కాచుక్కూచున్న పులి
కరచిపట్టిన మెడ వెనుక
చల్లగా నా చేయె
తెల్లని ఈ గోడల నిండా
పరచుకున్న లేడి నెత్తురు
నల్లటి కుక్క పాదాల ముద్రలతో
పిడికిలి బిగవని
వేళ్ళ మధ్యగా జారిపోతున్న
ఎర్ర రిబ్బను అనంతంగా
నేలంతా పరచుకున్న
కల ఒకటి తెరచిన కనుపాపలపై
(వి.వి.సార్ ని తలచుకుంటూ)
*
చాలా బాగా రాశారు వర్మ గారూ.
పిడికిలి బిగవని
వేళ్ళ మధ్యగా జారిపోతున్న
ఎర్ర రిబ్బను అనంతంగా
నేలంతా పరచుకున్న
కల ఒకటి తెరచిన కనుపాపలపై
Thank you Sir
🙏🙏,కవిత,బాగుంది. సర్!
Thank you madam
” నిద్రిస్తున్న యోధుడి గాయంలోంచి చిగురిస్తున్న మోదుగు పూల
మృధు స్పర్శ లోలోకి పాకుతూ గుండెలయను పెంచుతూ
నరాలలో రక్తకణ కాసారాన్ని ఉడుకెత్తిస్తూంది ”
అని ఇంతకు మునుపోసారి అన్న కెక్యూబ్ వర్మగారూ,
” పిడికిలి బిగవని వేళ్ళ మధ్యగా జారిపోతున్న ఎర్ర రిబ్బను
అనంతంగా నేలంతా పరచుకున్న కల ఒకటి… తెరచిన కనుపాపలపై ”
అంటూ విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు గారి గురించిన మీ తలపుల పలవరింతకు ఎలా స్పందించాలో తెలియని అశక్తత నాది.
మావోయిస్టులతో కలిసి ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారన్న అభియోగంపై విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు గారు రెండేళ్లుగా జైల్లో ఉన్నారు. 80 ఏళ్లకు పైబడి వయోభారంతోను అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
” There was neither common sense nor political sense in putting Telugu poet and activist Varavara Rao in jail two years ago without trial and bail. He did support Naxalite excesses, but jailing a writer for that is equivalent to giving his writing more mileage. Varavara Rao was a proclaimed Marxist and some of his ideological convictions were of the extremist kind. His defence of Maoist excesses was not acceptable to many. But his was an intellectual approach to politics, and it was important that it was countered by intellectual arguments. Police approach not only did not solve the problem; it left the intellectual foundations of the problem unchallenged. ~ by T J S George, in The Indian Express news paper https://www.newindianexpress.com/opinions/columns/t-j-s-george/2020/jul/26/why-varavara-rao-matters-2174791.html
Thanks for your concern sir. మునుపు రాసినది గుర్తు పెట్టుకుని quote చేసి రాయడం చాలా సంతోషమేసింది సర