పలవరింతలో

క మాట
ఒక కరచాలనం
ఒక పిలుపు
కరువైన చోట
మనిషి మనగలడా?
తనకు తానుగా
ఎన్ని నినాదాలు చేసినా
గది గోడలు దాటని వేళ
గుండె ప్రకంపనలు ఏమగునో!
నీకూ నాకూ మధ్య
దూరమెప్పుడో
సృష్టించబడి
మొలిచిన ముళ్ళ కంచె
పెకలించగలమా?
ఒక మూలుగులాంటి
మాట చెవిలో దూరి
గుండె లోతులలో
ప్రతిధ్వనిస్తే
గడ్డ కట్టిన కాలం పగిలిపోదా!
ఏనుగో ఒంటో
తోడేళ్ళు తరుముతుంటే
గీచిన బొమ్మ పగిలి
నేలంతా పరచుకున్న పాదరసం
ఇప్పుడు జ్వరానికి
కాచుక్కూచున్న పులి
కరచిపట్టిన మెడ వెనుక
చల్లగా నా చేయె
తెల్లని ఈ గోడల నిండా
పరచుకున్న లేడి నెత్తురు
నల్లటి కుక్క పాదాల ముద్రలతో
పిడికిలి బిగవని
వేళ్ళ మధ్యగా జారిపోతున్న
ఎర్ర రిబ్బను అనంతంగా
నేలంతా పరచుకున్న
కల ఒకటి తెరచిన కనుపాపలపై
(వి.వి.సార్ ని తలచుకుంటూ)
*
Avatar

కెక్యూబ్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • చాలా బాగా రాశారు వర్మ గారూ.

  పిడికిలి బిగవని
  వేళ్ళ మధ్యగా జారిపోతున్న
  ఎర్ర రిబ్బను అనంతంగా
  నేలంతా పరచుకున్న
  కల ఒకటి తెరచిన కనుపాపలపై

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు