నల్లని భవిష్యత్తు

అంపశయ్యజీవితంమీద

ఎలా ఉంటుంది హాయి దేహానికి…..

నిరంతరం సూదిమొనదారుల్లో

నడుస్తున్నపాదాలకు ప్రశాంతతెలా….

****

చుట్టూ వీస్తున్న అభద్రతాసుడిగాలులు

చెవుల్లో హోరెత్తుతుంటే!

నిమ్మలంగా ఉంటుందా మనసు?

ప్రయత్నించి సుడిగుండాల్ని

తప్పించుకొన్నాఅదృశ్యతిమింగళాలు

ఎక్కడో మాటేసిఉంటాయి తస్మాత్…

*****

భవిష్యత్తు భయం నిరంతరం నల్లని నీడలా

అన్నిదారుల్లో వెంటాదుతుంటే!

కనులు తెరిచినా …..

కనిపించని కాళ్లకిందనలుగుతున్న

మెత్తని పూలను కూడా

గుర్తించలేని స్థితిఅయోమయం

***

ఎప్పటికీ మబ్బులుఅందవని తెలిసినా

ప్రయత్నించడం మానుకొంటామా…

నిలువెల్లాగాయాలై శరీరం రక్తమోడుతున్న

ఆపగలమా….పోరాటాన్ని

ఈ బతుకు పోరులో దుఃఖిస్తున్నఅశ్రువు

గెలుపు ఓటములు సహజం అని తెలిసినా…

గెలిస్తే ఆకాశం లోకి ఎగురుతూ

ఓడితే పాతాళానికి కుంగుతూ

నిరంతరం మనముందు రాలిపడుతున్న

పురాజ్ఞాపకాలను ఎరుకుంటూ

అనుభవాల సంచుల్లో దాసుకుంటూ

గమ్యం తెలియని ప్రయాణికులమై

కాలాన్ని ముదాము నెమరేసుకుంటూ….

ఆశలకొమ్మలచివర్లను

అందుకోవాలని తపనతో…..

*

బాణాల శ్రీనివాస రావు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • The poem is replete with metaphors dramatizing realities of life which is not a bed of roses but fuul of thorns . Life is a ceaseless struggle waged for emancipation despite the fact that it has to face challenges passing through failures and successes . Excellent about life. Congrats! jb

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు