దేవుని భూమిలో….

రణించే జీవులను ఖననం చేయడానికి
కాసింత నేలకోసం వెతుకుతుంటాం కదా
మరీ ఆ నేలనే మరణిస్తుంటే మాట్లాడకుండా ఉంటారెం?
రోగాలు మనషులకే కాదు ఆలోచనలకూ ఉంటాయి…
తాకితే సోకే అంటువ్యాధులకు మందున్నట్టే
మాటలతో పాకే విద్వేషపు రోగాలకు మందుకనిపెడ్తే బాగుండు!
పిల్లలొస్తే వాళ్ళ కడుపునింపాలని చూసే తల్లుల రొమ్ములు
పాలకోసం ఏడ్చి ఏడ్చి ఎండిన పెదాలు
పక్కపక్కనే పడి ఉన్న పిల్లల పెదాలు, తల్లుల రొమ్ములు
దేవుడు,పవిత్ర క్షేత్రం అంతా పాలకుల కట్టుకథలు
యుద్ధం మిగిల్చిన మరుభూమే సాక్ష్యం
దేవుని భూమిలో శవాల కుప్పలు,బూడిద దిబ్బలే ఆనవాళ్ళు
AI తో ముప్పని మొరిగే మనుషుల్లారా!
మారణహోమం జరుగుతున్న స్పందించని మీతోనే ముప్పు
రోబోలకన్నా మానవత్వం సచ్చిన మనుషులే ప్రమాదకారులు!!
ఒక కడలి – అనేక నేను
కడలిని చేరాలని లేదు
తీరాన్ని తాకాలని లేదు
అలలను చూడాలని లేదు
ఏ తీరమో తెలియక
నా మనసే ఇపుడు
అల్లకల్లోలం అయిన కడలిలా మారింది
కారణం నీవనలేను
నీవసలే కాదని కూడా అనలేను
నాకు నేను చేసుకున్నదా అని ఆలోచిస్తే…
కడలి మీద కదులుతున్న తరగలా
గాయం తాలూకూ రసి కారుతున్న దృశ్యంl
అడవిని చీల్చుతూ విసిరి విసిరి వీచే గాలి
తనను కూడా గాయపరుచుకుంటుందన్న వాస్తవాన్ని
నిండారా ఎవరికి వారమే చూసుకుంటే కానీ
స్పురణలోకి రాదు.. రానంత కాలం
అది బయట చేసే గాయమనే భ్రమలోనే ఉంటాము.
*

దిలీప్.వి

1 comment

Leave a Reply to chelamallu giriprasad Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రోబోలకన్నా మానవత్వం సచ్చిన మనుషులే ప్రమాదకారులు!!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు