తెలంగాణ మట్టిలో ఆపిల్ పండించిన రైతు కథే-కేడా కొడ్స్తా

స్థానిక వనరులతో ప్రపంచంలో నమ్మకంగా నిలబడవచ్చనేది నమ్మకం కలిగించింది ఆయన అన్వేషణ.

  చుట్టూ గోస ఉంటుంది. చాలా మంది అవస్థ పడుతూ, హింసపడుతూ…. బతుకు ఈడుస్తారు. కొంతమంది మాత్రమే ఆ పరిస్థితులను తట్టుకొని కొత్తగా చిగురుస్తరు. కొత్త దారులు వెతుక్కుంటరు.

                                                                                  ***

వ్యవసాయం – అందునా తెలంగాణ వ్యవసాయం అంటే రైతుల పాలిట మోయలేని భారంగా మారిన దుస్థితి నెలకొని ఉంది. వ్యవసాయ నేపథ్యంలో వచ్చే కథలు అంటే కూడా అప్పులు, రైతు ఆత్మహత్యల చుట్టూనే తిరుగుతాయి. వీటికి భిన్నంగా వ్యవసాయ కథల్లోనూ బయటి సమాజానికి స్ఫూర్తినిచ్చే ఆశావహ కథను రాశాడు అక్కల చంద్రమౌళి.  తెలంగాణ కాశ్మీర్ గా చెప్పుకునే ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన రైతు బాలాజీ నిజ జీవితంలో చేసిన ఒక ప్రయోగాన్ని కథగా మలిచాడు. కాశ్మీర్ లాంటి వాతావరణం ఉన్న చోట కాశ్మీర్ లాగే ఆపిల్ పంటలు పండిస్తే అన్న ఆలోచనతో బాలాజీ అనేక కష్టనష్టాలు ఎదుర్కొని తన కలల పంట పండించాడు. పత్తి పంటలతో ఆవరించిన తెలంగాణ భూమిలో ఆపిల్ తోటను సాగుచేసి, కొత్తదారులు వేశాడు. ఆ కథను మనకందించారు అక్కల చంద్రమౌళి. 

తను రాసిన తొలి కథ కెడ కొడ్స్తా తోనే ప్రశంసలు అందుకున్నారు. చంద్రమౌళి కథకుడిగానే కాకుండా సినిమా రంగంలో గీత రచయితగా కొనసాగుతున్నారు. మొయిల్ చిత్రం టైటిల్ సాంగ్ గిరేటి బూగ పాటతో గుర్తింపు సాధించారు. తన కథ కేడా కొడ్స్తా  గురించి మర్చిపోలేని కథానుభవంలో ఇలా వివరించారు.    

                                                                       ***

అందరికి అన్నం పెట్టెవాడే రైతు వ్యవసాయమే ఆధారం .సేద్యం ఆగినాడు మానవ మనుగడే ముందుకు సాగదు. గ్రామాలన్నీ యుద్ద వాతావరణంలో ఉన్నాయి. వ్యవసాయమంతా అనేక సంక్షోభకాలాన్ని ఎదుర్కొంటోంది. దానికి ఎరువుల వాడకంతో మరింత కుదేలున పడింది.

ఆలోచన ఒక రూపం ఇవ్వడానికి ఆచరణలో పెడితే సాధ్య,అసాధ్యంలు తెలుసుకోవడానికి జీవితగమనం గురించి తెలుసుకోవచ్చు. వ్యవసామంటే ఒక జీవితవిధానం…. అది మన మనుగడతో ముడిపడి ఉంది.

మనుషుల ప్రాణం కేవలం తమ శక్తి ద్వారా నిలబడటం లేదు. ప్రక్రృతి కాపాడుతుంది. మనిషి, ప్రక్రృతి సంబంధం తెలుసుకోవడమే వ్యవసాయం.

 జామ,బత్తాయి,సితాఫలం,అరటిపండు,నారింజపండు,మామిడి పండుని అతి దగ్గరగా చూసి ఉంటాం. కానీ అతి ఖరీదైనదిగా భావించే ఆపిల్ పంటను మనం చూసి ఉండం . కొత్తరకం  పంటను కలలు కనడం వాటిని ఎట్లా ఆచరణ,అనుభవపూర్వకంగా గెలవాలో తెలిపే కథ ఇది .  ప్రక్రృతి నియమాలను అర్థంచేసుకోవటం దాని దగ్గరగా చూడటం దాన్ని  అర్ధంచేసుకుని రైతు ఒక కొత్తరకం పంటను కలగన్నాడు.

మన అనుభవం నివసిస్తున్న కాలం,మనుషులు,పరిస్థితులనుంచి కొత్త నిర్మాణమతున్న ఆలోచనతో పెనుగులాడుతుంది. ఆ పెనుగులాట రైతుగా కావచ్చు మరెదైనా సాధించటం  కావచ్చు.

బాలాజీ రైతుకు తాతలనాటి పూర్వం వ్యవసాయ  జ్ఞానం ఉంది. ఆ జ్ఞానమే ముందుకు బలమైన శక్తిని ఇచ్చింది. దానికి కొత్త పంటలు పండించాలనేది ఆలోచన తోడైంది.

దాన్ని సాకారం చేసుకోవడం కోసం భూమి తోటి, పురుగులతోటి, వాతావరణ, ఎరువులతోటి , మార్పులతోటి కొట్లాడిండు. ఆ కోట్లాట కోసం ,అన్వేషణ కోసం శాస్త్రీయ, దేశీయ పద్దతులు అధ్యయనం ఉంది. ఇది ఆయనొక్కడి కోసం కాదు. మనందరి కోసం.  భారతదేశంలోని వంద కోట్ల రైతులు ఇప్పుడు పెనుగులాటలో ఉన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే మూడు రకాల జీవనాగరికతలున్నాయి ఒకటి పరిశ్రమలు, పురాతన ఆదివాసి, మూడోది సమృద్ధిగా పంటలు పండించే వ్యవసాయ సంస్కృతి.  నేను పెరిగినదంతా పారిశ్రామిక వాడల్లో పెరిగాను. నన్ను తెలుసుకునే సమయంలో  ఆదిలాబాద్ పరిశోధన చేసే సమయంలో అనేకమంది  మనుషులను కలిశాను. మాట్లాడాను.

ఆసిఫాబాద్ సంస్కృతి మరియు గొండు జీవితాలు ఆసక్తిగా అనిపించి పరిశోధన చేసే సమయంలో బాలాజీతో పరిచయం ఏర్పడింది. అప్పటికి ఆయన వ్యవసాయం జీవితం నాకేవి అస్సలు కించిత్ కూడ  తెలువదు. అట్లా ఏమి తెలియకుండానే తనను పరిశీలించడం మూలాన ఆయన ఆలోచనలు విభిన్నమని ఒకానొక దశలో నాకర్ధమైంది.

ఆపిల్ తోట మొక్కలు హిమచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చానని చెప్పాడు. వ్యవసాయం క్షేత్రంలో నాటుతున్నాని చెప్పాడు. దానికోసం వ్యవసాయ క్షేత్రం వెళ్ళాను. అతను కొత్త ప్రపంచం దారులు వెతుకుతున్నాడని అర్ధమైంది.

అప్పుడే నా కథకు బీజం పడింది.  ఆయన జీవితం మరింత ఆసక్తిగా కనిపించింది. భూమి మర్మం, మొక్క మర్మం తెలుసుకోవడం దానిలో గెలుపు ఓటములు సమంగా చూడటం ఒక అభ్యాసంగా చేయడమనేది నేను గ్రహించాను. దాన్ని కథగా రాయాలని నిర్ణయం కొచ్చాను. వందల సార్లు అతి దగ్గరగా గంటల కొద్దీ కలిసి ప్రయాణం చేశాను.

రుతువులను అర్థం చేసుకోవడం,గాలిని,ఎండనీ ,చల్లటి వాతావరణ మార్పులకు సంఘర్షణలకు తట్టుకుని నిలబడటం ఆత్మవిశ్వాసం  నాకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది.

అది నేను నిలబడటానికి, నా కలలను ప్రాక్టీకల్ అనుభవంగా చూడటానికి  ఆపిల్ మొక్క సంభాషించినప్పుడు జీవితం అర్థమైంది.

 అస్సాం  తేయాకు తోటల్లో కొమురం భీం అనేకానేక విషయాలు పంటల జ్ణానం సంపాదించింది తిరిగి వచ్చాక ఆదిలాబాద్ లో వ్యవసాయంలో ఆయన జ్ఢానం కొన్నెండ్ల తర్వాత ఆదివాసి ప్రాంతంలో ఆపిల్ పంట కొనసాగింపుగా  అయింది. ఇప్పుడు కొత్తరకం పంటలతో  అభివ్రధ్దికి కారణం అప్పటిదే.

నలభైనాటికే ఆదిలాబాద్ నల్లరేగడి నేలలో నాగలిదున్ని  వ్యవసాయం చేశారు. పత్తి,మిర్చి,పొగాకు వ్యాపారపంటలేసేవారు. అడ్వాన్స్ వ్యవసాయ తెలివి ఇప్పటిది కాదు ఇవన్ని రైతు కొత్తగా చేయడానికి ఈ రైతుకి ప్రేరణ కలిగించిదనేది వాస్తవం.

స్థానిక వనరులతో ప్రపంచంలో నమ్మకంగా నిలబడవచ్చనేది నమ్మకం కలిగించింది ఆయన అన్వేషణ.

మామిడి తోట కన్నా దిగుబడినిచ్చేది కాదు కానీ… కొత్త ప్రయోగానికి ఒక మూల బీజం ఏర్పడింది.

ఆనాడు తేయాకు పంటల్లోని భీము జ్ఞానం ఇక్కడిదాకా ఆ జ్ఞానం అడవంచున కొండల్లో ఆఫిల్ సేద్యకర్తను తయారుచేసింది.

స్థానిక ప్రజలు కొత్తదారులను వెతుకుతుంటారనేది, నిరంతరంగా జరిగే ఒక చలనదశ.

కొత్తగా ఒక రైతు ప్రయోగంగా  భూమిని సేద్యం చేయాలనుకుంటే చుట్టూ ఉన్న బ్యాంక్ గానీ,అధికారుల,సమాజం నుంచి సరైనా ప్రోత్సాహం ఉండదు.ఆ కొత్తరకం జ్ఞానం ఆమొదించదు. ఉత్పత్తిశక్తుల అభివృధ్ధి నిరోధకాలు బయటి సమాజంలో కనబడుతాయి.

గ్రామాలల్లో అనేకానేక గొడవలచేత, యువత అటు పోలిటికల్, పోలీస్ స్టేషన్  తగాదాలతో చుట్టుకుని నిర్వీర్యమై స్థానికతను నదిలి బయటకు పోయే స్థితిలో ఉన్నారు. వ్యవసాయం చేసే స్థితి నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు.

వీరిని వ్యవసాయరంగం వైపు మరల్చడానికి స్థానికత చుట్టే తిరుగుతుంది. రాగులు ,కందులు ,మినుములు సజ్జలు పండిన నేలలో పత్తి కమర్షియల్ పంటలతో సతమతమయ్యి పోషకారాలోపం తిండిలేక ఆసిఫాబాద్ లాంటి గ్రామాలలో ప్రజలు పేలవంగా ఉన్నారు.

ఒక దశను నుంచి మరోక దశకు చేరడానికి లోలోపల పెనుగులాట మొదలైంది. ఆ పెనుగులాటలో రైతు తన స్వంత అస్తిత్వం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలనుంచి బయటపడడానికి….గ్రామాల రైతు రోల్ మోడల్ గా తయారు కావాలసింది ఉంది.

*

చందు తులసి

7 comments

Leave a Reply to వేణు.బి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల చరిత్ర, సంస్కృతి రచయితలు మేధావులు ఇంకా సరిగా అర్థం చేసుకోలేదు. రచయిత, చందుతులసి గార్లు కేంద్రే బాలాజీని ఆదివాసీ రైతుగా, గిరిజన రైతుగా సంబోధించారు. కేంద్రే బాలాజీ ఆదివాసి కాదు. గిరిజనుడు ముమ్మాటికి కాదు. కేంద్రే బాలాజీ ఆదివాసి ప్రాంతంలోకి వలస వచ్చిన వంజరి కులానికి చెందిన వ్యక్తి. ఆదివాసీ ప్రాంతంలోకి వలస వచ్చిన హిందూ కులాలలో ఇది ఒకటి. ఆదివాసి ప్రాంతంలో వడ్డీ వ్యాపారస్తులుగా ఎదిగారు. ఆదివాసీ ప్రాంతంలో కొనసాగిన ఆదివాసేతరుల మహా వలస కారణంగా ఆదివాసులు అస్థిరతకు గురయ్యారు. చాలావరకు ఆదివాసి భూములు ఈ కులాల పరమైనాయి. దీని ప్రతిఫలంగా ఇంద్రవెల్లి తిరుగుబాటు జరిగింది.
    అయితే తెలంగాణలో ఆపిల్ సాగు కెరమెరి, నిజామాబాద్ ప్రాంత రైతులు సాగు చేస్తున్నారు.

  • అదిలాబాద్ జిల్లా ఆదివాసుల చరిత్ర, సంస్కృతి రచయితలు మేధావులు ఇంకా సరిగా అర్థం చేసుకోలేదు. రచయిత, చందుతులసి గార్లు కేంద్రే బాలాజీని ఆదివాసీ రైతుగా, గిరిజన రైతుగా సంబోధించారు. కేంద్రే బాలాజీ ఆదివాసి కాదు. గిరిజనుడు ముమ్మాటికి కాదు. కేంద్రే బాలాజీ ఆదివాసి ప్రాంతంలోకి వలస వచ్చిన వంజరి కులానికి చెందిన వ్యక్తి. ఆదివాసీ ప్రాంతంలోకి వలస వచ్చిన హిందూ కులాలలో ఇది ఒకటి. ఆదివాసి ప్రాంతంలో వడ్డీ వ్యాపారస్తులుగా ఎదిగారు. ఆదివాసీ ప్రాంతంలో కొనసాగిన ఆదివాసేతరుల మహా వలస కారణంగా ఆదివాసులు అస్థిరతకు గురయ్యారు. చాలావరకు ఆదివాసి భూములు ఈ కులాల పరమైనాయి. దీని ప్రతిఫలంగా ఇంద్రవెల్లి తిరుగుబాటు జరిగింది.
    అయితే తెలంగాణలో ఆపిల్ సాగు కెరమెరి, నిజామాబాద్ ప్రాంత రైతులు సాగు చేస్తున్నారు.

    • మీ సమాచారానికి ధన్యవాదాలు సార్. కొత్త విషయాలు తెలిశాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు