1నీ మూసిన మనసును తెరుచుకో ఇక
నిశ్చింతగా నీ తలుపులు తెరుచుకో
నీకోసం తపనపడే కనులు నిన్ను తాకవు
నీ స్పర్శకు చాచే చేతులు లేవు
నోరారా నీ పేరు పిలిచే పెదవులు పలకవుప్రణయ మారుతాలు చొరబడతాయని భయం వద్దు
నీ వాకిట్లోని ఆశల పూలు పూసే మొక్క వాడిపోయింది
ఇప్పుడప్పుడే చిగురించే అవకాశమూ లేదునిర్లక్ష్యాన్ని తట్టుకునీ తట్టుకునీ అలసిపోయింది
కన్నీళ్ళను కార్చి కార్చి ఎండిపోయింది
నీ కోసం ఎదురు చూసి చూసి వగచిపోయింది
ఎన్నాళ్ళని అలా బతుకుతుంది పాపం!నిన్ను చూడాలనీ…ఆకాశం అంచులు తాకాలనీ
పదేపదే నీ తలుపుల్ని తట్టే వాళ్ళెవరూ లేరు
నీ చుట్టూ నువ్వు గీసుకున్న గిరిలో
నువ్విక హాయిగా తిరగొచ్చుసగం ప్రాణాలతో తిరిగిన ఆశ చచ్చిపోయింది
నీకోసమే కాచుకుని కూర్చున్న ఒక జీవితం ముగిసిపోయింది
ప్రేమే లోకం అనుకున్న ఆమె అలల తాకిడికి కొట్టుకుపోయింది
నీ మూసిన మనసును తెరుచుకో ఇక హాయిగామూసిన తలపుల మాటు నుంచి ఎన్నాళ్ళీ ప్రపంచాన్ని చూస్తావు
నీ కోసమే పరితపించిన గుండె వెళ్ళిపోయింది
ఎక్కడో ఏదో మూల చస్తూ బతకడానికి
ఎవరెలా పోతేం నీకేం…
నీ మూసిన మనసును తెరుచుకో ఇక హాయిగా*
2
సామీప్యం
ఎక్కడో దూరంగా నువ్వు
ఒకనిముషం దిగులు
పక్కనే ఉన్నావన్న తలపు
మరునిమిషమే సాంత్వన
జీవితం మోహాల సమాహారం అంటావు
నాకు మాత్రం శాశ్వత సుందర స్వప్నంఒంటరిగా నిశ్శబ్దంలో కూరుకుపోయినప్పుడు కూడా
ఎన్నో స్మృతులు
నీతో మాట్లాడినవీ, పోట్లాడినవీ
నీ నవ్వులవీ,
నువ్వొచ్చిన సంబరాలవీ
నువ్వు వెళ్ళిన కన్నీళ్ళవీ
నాలోనూ, నా ఖాళీతనంలోనూ
అల్లుకుపోయింది అంతా నువ్వేఒకరి అవయవాలు
వేరొకరి శరీరంలో చిక్కుబడ్డం సరే
నీకై నేను కట్టుకున్న ఈ చిన్ని
ప్రపంచంలో నేనే నువ్వైపోయాక
నా ఊపిరే నీ గుండెల్లోంచి
వస్తుంటే ఇంకా నీకుదూరంగా
ఎలా ఉండడం….?అనిశ్చల సాగరంలో
మూడు పడవలు
ఒకదానిలో నువ్వూ
మరొకదానిలో నేనూ
మూడవదానిలో మనిద్దరం
కలిసి తీరం చేరేదెన్నటికో
గమ్యాన్ని ఆస్వాదించేదెప్పటికో!*
తెరుచుకో ఇక హాయిగా!
ఏరువాక శీర్షిక కవితల ప్రత్యేకం. మీ కవితలు editor@saarangabooks.com కి పంపించండి!
Add comment