తిండిబోతు దెయ్యం అండ్ హర్ష రెండో తరగతి

Sometimes we are blind,deaf,dumb and even like deadbodies.?

ఒక్కొక్కసారి లేదా అప్పుడప్పుడూ లేకపోతే ఎప్పుడూ నిజంగా మనముందు ఏమౌతుందో ,ఏమి జరుగుతుందో తెలియదు.తెలుసుకోలేం. కారణం అప్పటికి జరుగుతున్న విషయాల పైన,సంఘటనలపైనా  మనకు తెలిసిన మరో అభిప్రాయం మనకి ఉండటం లేదా థింకింగ్ ఔట్ ఆఫ్ ది బాక్స్ నుండి బయటకు రాకపోవడం,లేదంటే సునిశితంగా దగ్గరగా ఓపికతో చుట్టూరా గమనించకపోవడం.పరిసరాల్ని తదేక దృష్టితో పట్టించుకోకపోవడం.రోజు చూసే విషయాలే ఒక్కఒసారి ఒక్కోవిధంగా కొత్తగా మనకు తోస్తాయి.తడతాయి.తారసపడతాయి.వూహింపులేనివి,మనకళ్లముందు జరిగినప్పుడు మనం ఇలా కూడా ఆలోచించి ఉండాల్చిందే అని అనుకుంటాము.అలా ఆలోచించలేక పోయినందుకు మనమీద మనకే సందేహాలు మొదలౌతాయి.మౌనంలోకి జారిపోతాం.ఒక బలమైన సంఘటన ముందు బలహీనమువుతాం.ముఖ్యంగా పిల్లల విషయాల్లో మన అంచనాలు తారుమారు అవుతుంటాయి.బాగా చదివే పిళ్ళాడోకడు చదువులో వెనకబడుతుంటాడు.బాగా మాటకరిగా ఉండేవారు వెనువెంటనే అంతర్ముకులౌతారు.బిన్నబిన్న మార్పులకు పిల్లలు నిరంతరం గురవుతారు.పెద్దలకు అందకుండా పోతుంటారు.పిల్లలు మన ద్వారా పుడతారు తప్ప మననుంచి కాదు.వాళ్ళప్రపంచం వాళ్ళకి వేరేగా ఉంటుంది.

తిండిబోతు దెయ్యాన్ని సీసాలో బంధించి సముద్రంలో విసిరేశారు.చేపలు పట్టడానికి వెళ్లిన జాలర్ల వలలో సీసాలో బంధించిన దెయ్యం చిక్కింది.పట్టిన చేపలన్నింటిని అమ్మేయగా బుట్టలో మిగిలిన చేపల్లో సీసాలో బంధించిన తిండిబోతు  దెయ్యం కూడా ఉంది.జాలరి మిగిలిన చేపల్ని ఇంటికి తెచ్చి మంచివాటిని ఏరి పులుసుపెట్టమని భార్యకు చెప్పి బజారుకి వెళ్ళాడు.భార్య ,తెచ్చిన చేపల్లో కొన్నిoటిని బయటకు తీసి శుభ్రం చేసి పులుసుపెట్టి బజారుకి వెళ్లిన భర్తకోసం వేచిచూస్తోంది.ఇంతలో ఎలా తప్పించుకుందో ఏమో సీసాలో బందీయయిన దెయ్యం తప్పించుకుoది.ఇన్ని రోజులు తిండిలేక ఇబ్బంది పడిన దెయ్యాo వడ్డించిన భోజనాన్ని పూర్తిగా తిని అటక మీదకు వెళ్లి విశ్రాంతి తీసుకుంది.బజారుకి వెళ్లిన భర్తతో తిరిగి ఇంట్లోకి వొచ్చిన భార్య ఖాళీ పాత్రలను చూసి ఆశ్చర్యానికి గురయి, భోజనాన్ని ఎవరు తిన్నారో అని ఆలోచింపసాగారు.ఎంత ఆలోచించినా దారి దొరక్క ఆరోజుకి నీల్లుతాగి నిద్రపోయారు.రోజు వారు వండే ఆహారాన్ని హాయిగా తింటూ అటక మీద పడుకుంటూ దెయ్యం సంతోషంగా కాలం గడుపుతుంది.

ఇలా కాదు అని ఒకరోజు భార్యాభర్తలిద్దరూ ఒక ఉపాయం వేశారు.రోజు వండినట్టే భోజనం వండి చాపమీదపెట్టి తమ బందువుల్ని భోజనానికి పిలవడానికని గట్టిగా  అరిచి చెప్పి ఇంటిబయటకు వొచ్చి తలుపు చాటున ఉండి చూడ సాగారు.వొండిన పాత్రలు వదిలేసి వెళ్లిన భార్యభర్తల్ని చూసి జాలిపడి ఆనందంతో పాత్రలనిండా ఉన్న ప్రత్యేక వంటల్ని తినటం మొదలుపెట్టింది దెయ్యం.తలుపు దగ్గర నిలబడి చూస్తున్న భార్యాభర్తలిద్దరూ దెయ్యాన్ని చూసి అర్చర్యపోయారు.దెయ్యం పాత్రల్లో ఉన్న భోజనం మొత్తం తిని తేపుకుంటూ వెళ్లి అటక మీద నిద్రపోయింది.తిండిబోతు దెయ్యం నుండీ ఎలాగైనా తప్పించుకోవాలానే పట్టుదలతో మరుసటి రోజు ఉదయం ఒక ఉపాయంతో అన్నంలో రాళ్లు కూరల్లో కారం దండిగా దట్టించి వంటలు చేసి చాపమీద పెట్టి ఇంటి బయటకు వెళ్లారు భార్యాభర్తలు.యధావిధిగా దెయ్యం అటకమీద నుండి దిగి వొండిన పదార్థాల్ని తినటం ప్రారంభించింది.తినటం మొదలుపెట్టిన కాసేపటికే తిండిబోతు దెయ్యం నాలుక మండి ఒళ్ళంతా మంట పుట్టసాగింది.దేహమంత తట్టుకోలేని మంటేత్తి ఇంటినుండి పారిపోయింది.దెయ్యం బాధ ఓదిలినందుకు బార్యభర్తలిద్దరు సంతోష పడ్డారు.
అని కధ ముగించాడు రెండో తరగతి చదువుతున్న హర్ష.

హర్ష మా ట్యూషన్కి వచ్చే విద్యార్థుల్లో ఒకడు.ఎప్పుడూ చదువుల్లో ముందుండే హర్ష ఈ ఏడాది చదువుల్లో చురుగ్గా లేడనీ,మార్కులు తగ్గుతున్నాయనీ హర్ష అమ్మానాన్న నా దగ్గర పిర్యాదు చేశారు.ఏదో పేద్ద నష్టం జరిగినట్టు బాధపడ్డారు. రెండో తరగతి చదువుతున్న హర్ష కి చదవడానికి మాత్రం ఏముంటుంది?చిన్నతనం నుండే పిల్లల్ని ఆ రకంగా పెంచి పెద్దచేసి ఏమి సాదిద్దామనో అర్ధంకాలేదు.ఐనా పిర్యాదుని ఆరాతీయాలి కాబట్టి హర్ష వాళ్ళ అక్కని హాసినిని అడిగితే హర్ష ఫోన్లో ఎక్కువ ఆడుతున్నాడని క్లియర్ చేసింది.హర్షకి ఫోన్ అందుబాటులో ఉంచింది ఎవరు?అని సందేహమొచ్చినా సముదాయపడి
హర్షని అడిగితే ,కాస్త బయపెడితే ,మొబైల్ల్లో car game for toddlers kids ఆడుతున్నానని చెప్పాడు.అంతటితో ఆగక నా మొబైల్ ఇచ్చి ఆ గేమ్ ని డౌన్లోడ్ చేయమనుంటే క్షణాల్లో ఆ గేమ్ డౌన్లోడ్ చేసి చూపాడు.ఆతరువాత నాకు కలిగిన ఆశ్చర్యంతో ఇంకా నీకు మొబైల్లో  ఎం తెలుసు అంటే? ఫేస్ బుక్,వాట్సప్ అనిచెప్పి ఇంకా నాకు యూ ట్యూబ్ ఓపెన్ చేయటం కూడా తెలుసు అనీ, తను రోజూ యూ ట్యూబ్ లొనే కధలు వింటానాని చెప్పి తిండిబోతు దెయ్యం కధ గురించి చెప్పాడు.నా శరీరం ఆత్మా సంభ్రమాచార్యాలకు గురయి ఏమి మాట్లాడాలో అర్థంకాలేదు.చివరిగా ఇవన్నీ నీకు ఎవరు నేర్పారు అంటే u.k.g.చదువుతున్న తన కజిన్ నేర్పాడని చెప్పి నన్ను ఇంకాస్త లోతుకు దిగ్గొట్టాడు.నన్నే కాదు మిగతా ట్యూషన్ పిల్లళ్ళందరికి ఒక షాక్ ఇచ్చాడు.

పిల్లలు ఫోన్ కి ఆకర్శించబడటం,ఫోన్ ఇవ్వకపోతే ఏడవటం నానా యాగీ చేసి పేరెంట్స్ ని సతాయించటం స్కూల్లో డైలీ వింటున్నదేగాని ukg పిల్లాడు సెకండ్ క్లాస్ పిల్లోడికి సెల్ వాడకాన్ని నేర్పించటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసింది.దిగులును కూడా సృష్టించింది.
ఎందుకు ఈ దిగులు అంటే పిల్లల్ని వాళ్ళకున్న లేదా కలిగించుకున్న  ప్రత్యేకతలు సాధారణమైనవి కాదు.ఏఏ ప్రత్యేకతలు పిల్లల ఎదుగుదలకు కారణం అవుతాయో అదే ప్రత్యేకతలు వాళ్ళ అంతరింపుకు కూడా కారణం కాకుండా పోవు.
ఐతే టీచర్స్ గా పని చేస్తున్న చాలామందికి పిల్లల ప్రపంచం తాలూకు సరైన అవగాహన ఉందా?పోనీ పిల్లలెం చేస్తారు అనే ఆలోచనగానీ,పిల్లల మానసిక స్థితి ఎలా పరిణితి చెంది ఏ సంవేదనలతో  వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేస్తాయోనన్న కనీస ఉహింపు ఉందా?అంటే సమాధానం లేదు.నిజంగా పిల్లల ప్రపంచం అవగాహన లేకపోతే పిల్లలకు బోధించటం సాధ్యమైన పనికాదు.ఒక వ్యవస్థని నిర్మించటంలో జరిగే తప్పిదాల వలనే వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు వ్యక్తులకు నష్టం కలిగిస్తున్నాయి.

ఇప్పుడు హర్ష చదవటం లేదు అనే పిర్యాదు ఒకవైపు.
అద్భుతంగా తిండిబోతు దెయ్యం కథని narrate చేయటం ఒక వైపు.మార్కులు తెచ్చుకోవడం తేలికయిన పనా?సృజనాత్మకంగా కధని narrate చేయటం తేలికైన పనా?అసలు ఈతేడా తెలియాల్చింది ఎవరికి?రాయిలో శిల్పం ఉందని తెలియాల్చింది రాయికా?శిల్పికా?మట్టిని గింజగా వడకట్టాల్చింది మట్టా?మట్టిని ఎత్తుకునే రైతా?తెలియాల్చిన వాళ్ళకే తెలియాల్చినవి తెలియకపోతే తెలియనివాళ్ళకి తెలియనివి చెప్పటం, తెలియజేయడం తెలుస్తుందా?ఒక బొమ్మ గీయటంలో
సృజన,ఒక పాటపాడటంలో నైపుణ్యం,ఒకకథ చెప్పటంలోపల సామర్ధ్యం,ఒక కవిత రాయటంలో ఉండే క్లిష్టత పిల్లల్ని కన్న అమ్మానాన్నకే అర్థం కాకపోతే,పాఠం చెప్పే టీచర్లకే అంతుపట్టకపోతే పిల్లలకి ఆ పనులమీద ఆసక్తి ఎలా కలుగుతుంది.?ఎటు చూసినా పిల్లలు మనకు మార్కుల ఫేక్టరీల్లా కనిపించాలి.ఒక సెలెబ్రిటిల్లా వెలిగిపోవాలి.చెప్పాల్సిందంతా రాంగ్ డైరెక్షన్ లో చెప్పి మంచిదారిలో నడవమంటాం.హర్షాలు హర్శించబడట్లేదు సృజనలు సృజన చేయకూడదు..ఏంటో? అంతా ఉల్టా…విలోమం…రివర్స్…ఫన్నీ..ఈఒక్క మాట జర కళ్ళలో వేసుకోండి…హృదయంలోకి లాక్కొండి..
Nothing in this world can take the place of persistence. Talent will not: nothing is more common than unsuccessful men with talent. Genius will not; unrewarded genius is almost a proverb. Education will not: the world is full of educated derelicts. Persistence and determination alone are omnipotent.
Calvin Coolidge

పెద్దన్న

4 comments

Leave a Reply to ROJANA MARABATHULA Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • nice harsha. lkg la nunche pillalni nirantharam chadivinchi school vallaki fees katte nagarika samajam manadhi sir. deyyam katha naku bhale nachindi
    keep it up sir

  • నిజంగా నిజం, పిల్లల మార్కుల పెయిన్ శ్రధ్ద వారి మనసు పై తల్లిదండ్రులు, ఉపాద్యాయులు ఉంచితే
    కొత్త తరం తయారవుతుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు