టు పాక్ షకుర్ ,(లిసానే పారిష్ క్రూక్స్ )(జూన్ -16 1971-సెప్టెంబర్ -13 1996) అమెరికా రాప్ సంగీత ప్రపంచంలో ఉల్కాపాతంలా, ఆకాశంలో మిరిమిట్లు గొలిపేలా వెలిగి నేలరాలిపోయిన తార . జూన్ -16 ,1971 లో జన్మించి 25 సంవత్సరాలకే హత్యకు గురయ్యాడు. . ఇంతవరకు ఆ హత్య వీడని మిస్టరీ గా ఉంది. ఆతని సంగీతంలోనూ , కవిత్వం లోనూ ఆతను పెరిగిన ఆఫ్రికన్ అమెరికన్ జీవితాలలోని విషాదం,దోపిడీ ,వారి జీవితాలలో ఎదుర్కునే కాఠిన్యమైన నిజాలతో నిండి ఉంటుంది. అయితే ఆటను సంపాదించుకున్న పేరు తనకి శత్రువు అయ్యింది . తనతో పాటు ఉండే ఇతర హిప్ హాప్ గ్రూప్ వివాదాల మధ్య చిక్కుకున్నాడు . ఒకసారి జైలు జీవితం కూడా రుచి చూసాడు .అయినా సంగీతం తో తన ప్రయాణం ఆపలేదు . అతని మరణం తప్పదని ముందే ఊహించుకున్న టు పాక్ నమ్మిన సిద్ధాంతాల కోసం , విలువల కోసం మరణించడం తనకు ఇష్టమేనని రాసుకున్నాడు . ఈ రోజుకి రాప్ సంగీతం లో ధ్రువ తార లా ఉంటూ మన దేశం లోని యువతకి కూడా ఆరాధ్యుడైనాడు టు పాక్.
1
సిమెంట్ పగుళ్ల లో పెరిగిన గులాబీ
మీరు ఇది విన్నారా
సిమెంట్ పగుళ్ల నుండి గులాబీ పెరిగిందని ?
ప్రకృతి నియమాలన్ని అబద్ధమంటూ
కాళ్ళు లేకుండా నడిచిందని ?
నవ్వు వస్తుంది కానీ ,తన కలలు కాపాడుకుంటూ
స్వచ్ఛమైన గాలి పీల్చడం నేర్చుకుంది .
ఎవ్వరూ పట్టించుకోపోయినా
సిమెంట్ పగుళ్ల లో పెరిగిన గులాబీ
కలకాలం జీవించుగాక !
(Original: The Rose that grew from concrete)
2
నా రోదన
~
అప్పుడప్పుడు , నేను ఒంటరిగా ఉన్నప్పుడు
ఒక్కణ్ణే ఉన్నానని నేను రోదిస్తాను .
నే నేడ్చినప్పుడు కన్నీళ్లు చేదుగా ,వెచ్చగా
రూపం లేకుండా జీవం తో ప్రవహిస్తాయి
ముందుకు సాగేందుకు కష్టమైనప్పుడు
నా గుండె పీలికలైందని ఏడుస్తాను .
నా సోద చెప్పుకుంటె వినే చెవులుంటె
నా ప్రియమైన స్నేహితుడు దగ్గరే ఏడ్చేవాణ్ణి
ఎవరున్నారు అంతసేపు ఆగి
నువ్వు జీవించేందుకు సాయపడేవాడు ?
ప్రపంచం వేగంగా సాగుతోంది . అదే నయం
ఆగి , నీ బాధకు కారణమేమిటో చూడడం కన్నా
ఎంత వేదన , ఎంత బాధ
మరి నేను కొన్ని సార్లు రోదిస్తాను
అది ఎందుకో ఎవరూ పట్టించుకోరు.
(Original: I cry )
Tupak poetry flip kart lo teppinchi chadivaanu modatlo Andhrajyothi lo suhasini gari vyasam chadivi vallamma tanapaj rasinadi chadavalanna kutuhalamto.. Me parichayam bagundi