టు పాక్ అనే ఒక తుఫాను గురించి…

టు పాక్ షకుర్ ,(లిసానే పారిష్ క్రూక్స్ )(జూన్ -16 1971-సెప్టెంబర్ -13 1996) అమెరికా రాప్ సంగీత ప్రపంచంలో ఉల్కాపాతంలా, ఆకాశంలో మిరిమిట్లు గొలిపేలా వెలిగి నేలరాలిపోయిన తార . జూన్ -16 ,1971 లో జన్మించి 25  సంవత్సరాలకే హత్యకు గురయ్యాడు. . ఇంతవరకు ఆ హత్య వీడని మిస్టరీ గా ఉంది. ఆతని సంగీతంలోనూ , కవిత్వం లోనూ  ఆతను  పెరిగిన ఆఫ్రికన్ అమెరికన్ జీవితాలలోని విషాదం,దోపిడీ ,వారి జీవితాలలో ఎదుర్కునే కాఠిన్యమైన నిజాలతో నిండి ఉంటుంది. అయితే ఆటను సంపాదించుకున్న  పేరు తనకి శత్రువు అయ్యింది . తనతో పాటు ఉండే ఇతర హిప్ హాప్ గ్రూప్ వివాదాల మధ్య చిక్కుకున్నాడు . ఒకసారి జైలు జీవితం  కూడా రుచి చూసాడు .అయినా సంగీతం తో తన ప్రయాణం ఆపలేదు . అతని మరణం తప్పదని ముందే ఊహించుకున్న టు పాక్ నమ్మిన సిద్ధాంతాల కోసం , విలువల కోసం మరణించడం తనకు ఇష్టమేనని రాసుకున్నాడు . ఈ రోజుకి రాప్ సంగీతం లో ధ్రువ తార లా ఉంటూ మన దేశం లోని యువతకి కూడా ఆరాధ్యుడైనాడు టు పాక్. 

1

సిమెంట్ పగుళ్ల లో  పెరిగిన గులాబీ
మీరు ఇది విన్నారా
సిమెంట్ పగుళ్ల నుండి గులాబీ పెరిగిందని ?
ప్రకృతి నియమాలన్ని అబద్ధమంటూ
కాళ్ళు లేకుండా నడిచిందని ?
నవ్వు వస్తుంది కానీ ,తన కలలు కాపాడుకుంటూ
స్వచ్ఛమైన గాలి పీల్చడం నేర్చుకుంది .
ఎవ్వరూ  పట్టించుకోపోయినా
సిమెంట్ పగుళ్ల లో పెరిగిన గులాబీ
కలకాలం జీవించుగాక !
(Original: The Rose that grew from concrete)
2
నా రోదన 
~
అప్పుడప్పుడు , నేను ఒంటరిగా ఉన్నప్పుడు
 ఒక్కణ్ణే ఉన్నానని నేను రోదిస్తాను .
నే నేడ్చినప్పుడు కన్నీళ్లు చేదుగా ,వెచ్చగా
 రూపం లేకుండా జీవం తో ప్రవహిస్తాయి
ముందుకు సాగేందుకు కష్టమైనప్పుడు
నా గుండె  పీలికలైందని ఏడుస్తాను .
నా సోద చెప్పుకుంటె వినే చెవులుంటె
నా ప్రియమైన  స్నేహితుడు దగ్గరే ఏడ్చేవాణ్ణి
ఎవరున్నారు అంతసేపు ఆగి
నువ్వు జీవించేందుకు సాయపడేవాడు ?
ప్రపంచం వేగంగా సాగుతోంది . అదే నయం
ఆగి , నీ బాధకు కారణమేమిటో చూడడం కన్నా
ఎంత వేదన , ఎంత బాధ
మరి నేను కొన్ని సార్లు రోదిస్తాను
అది ఎందుకో ఎవరూ పట్టించుకోరు.
(Original: I cry )

ప్రసూన బాలాంత్రపు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Tupak poetry flip kart lo teppinchi chadivaanu modatlo Andhrajyothi lo suhasini gari vyasam chadivi vallamma tanapaj rasinadi chadavalanna kutuhalamto.. Me parichayam bagundi

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు