టాల్‌ రేడియో కథల పోటీ వివరాలు

టాల్‌ రేడియో కథల పోటీ వివరాలు

సాహితీలోకానికి!

టాల్‌ కైండ్‌ నెస్‌ సందర్భంగా… టాల్‌ రేడియో కథల పోటీని నిర్వహించిన విషయం తెలిసిందే. మానవతా విలువలను ప్రతిబింబించే కథలను పంపమంటూ మేము ఇచ్చిన ఆహ్వానానికి మంచి స్పందన వచ్చింది. పోటీ కోసం దాదాపు మూడు వందల కథలు పరిశీలనకు వచ్చాయి. కొన్ని మంచి కథలు వచ్చినప్పటికీ అవి అత్యున్నత బహుమతుల స్థాయిలో లేవనే అభిప్రాయం అనేకమంది న్యాయనిర్ణేతల నుంచి వినిపించింది. అందుకని పోటీకి వచ్చిన కథల నుంచే, పది మంచి కథలను ఎంపిక చేసి వాటికి 2,500/- రూపాయల చొప్పున బహుమతిని ప్రోత్సాహకరంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కథలను ‘టాల్‌ రేడియో ద్వారా’ త్వరలోనే ప్రసారం చేస్తాము. కథలు బహుమతికి ఎంపిక కాకపోవడం అనేది వివిధ అంశాలకు సంబంధించిన విషయం కాబట్టి ఈ నిర్ణయాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నాము. బహుమతికి ఎంపిక కాని కథలను సదరు రచయితలు ఇతర పత్రికలకు పంపవచ్చును. మా ప్రకటనను మన్నించి స్పందించిన ప్రతి ఒక్క రచయితలూ వేల ధన్యవాదాలు. మీతో మా ప్రయాణం ఇలా కొనసాగుతూనే ఉంటుందని ఆశిస్తున్నాము.

(బహుమతికి ఎంపికైన కథలు: సర్కిల్‌ – కె. ఎ. మునిసురేష్ పిళ్ళె, పడమటి సంధ్య – వారణాసి నాగలక్ష్మి, యద్భావం తద్భవతి – డాక్టర్ ఎమ్ సుగుణ రావు, సుచరితం – ఎం.వి.రామిరెడ్డి, చల్లదనం చాటున – భమిడిపాటి గౌరిశంకర్‌, దిల్‌ వాలే – కోటమర్తి రాధా హిమబిందు, మనిషితనం – ఎస్వీకె.సంహితానాయుడు, వర్షం సాక్షిగా – దుద్దుంపూడి అనసూయ, మమతల పొదరిల్లు – సీత, వసుధైక విల్లాస్‌ – శ్యామ్‌ వాడవల్లి)

– టాల్ రేడియో బృందం

ఎడిటర్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • టాల్ రేడియో-సారంగ గారికి, నమస్తే. మీరు ఒక అసాధారణమైన థీమ్ పై (Kindness) పోటీ జరపడం గొప్ప విషయం. అభినందనలు. సహృదయంతో మీరు పోటీలో గెలవని కథల్ని ఇతర పత్రికలకి పంపుకోవచ్చని తెలిపారు. అయితే కథలు ఒక థీమ్ పై రాసినవి కావున ఇతర పత్రికలకి సరిపోవు. తిరగరాయడమో, లేక మేమే బుట్ట దాఖలు చేసుకోవడమో చేయాలి. ఒక సలహా – పోటీలో గెలిచిన 10 కథలతో పాటు మరో 10 లేక 15 కథల్ని సాధారణ ప్రచురణకి తీసుకొని వేస్తే బాగుంటుంది కదా? నేను పోటీలో పాల్గొన్నాను. నాకు తెలుసు – ఈ కథ ఇతర పత్రికల ఫార్మేట్లో ఇమడదని. దీన్ని నేను నా తదుపరి కథ సంకలనంలోనే వేసుకోవాలి. నాలానే ఈ సంకటంలో తోటి రచయితలు / త్రులు ఉంటారు. మీకు తెలుసు – ఈ పోటీలోనైనా ఎక్కువమటుకు సాధారణ ప్రచురణలకి తీసుకొనే సంస్కృతి ఉంది. ఆలోచించండి. టి. సంపత్ కుమార్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు