కోటేశ్వరమ్మ వంద వసంతాలు!

బెజవాడ – మొగల్రాజ పురం- సిద్ధార్థ కాలేజీ సెంటర్- సున్నపుబట్టీలు- వీటన్నీటి మధ్యా కొండపల్లి కోటేశ్వరమ్మ గారూ. ప్రశాంతమైన దీపం. వందేళ్ళ జీవితంలో కొన్ని క్షణాలే అర్థవంతంగా వుంటాయి ఎవరికైనా. కాని, ఆమె ప్రతి క్షణం అర్థవంతమే! అలాంటి క్షణాలు మీలో ఎందఱో చూసి వుంటారు, అనుభవించి వుంటారు. వాటిని సారంగతో పంచుకోండి. ఆమె గురించి మీ మాటలూ, జ్ఞాపకాలూ, పుస్తక అనుభవాలూ…అన్నీ రాయండి. editor@saarangabooks.com కి పంపించండి.

ఎడిటర్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా దూరంలో ఉండడం వల్ల వెళ్లలేకపోతున్నాను . 2016 లో కోటేశ్వరమ్మగారిని మనవరాలు సుధా ఇంట్లో కలిసి చాలా సేపు మాట్లాడాను. ఆ రోజు ఆవిడ రాసిన గొప్పపుస్తకం “నిర్జన వారధి..” కూడా పొందగలిగాను. కరుణా, రమేష్ లు ఢిల్లీ లో ఉండేటప్పుడు , తెలుగు సంస్కృతిక కార్యక్రమాల్లో తరచూ కలవడమే కాక, ఎంతో అప్యాయమయిన స్నేహం ఉండేది. వారి పిల్లలిద్దరికీ నేను సుబ్బు అంకుల్ గా తెలుసు.

    “నిర్జన వారధి..” ఒక గొప్ప పుస్తకం. ఈ రోజు ఉద్యమాల లో స్త్రీల గురించి రాస్తున్న చాలామంది సాహిత్య కారులు కోటేశ్వరమ్మ గారి పుస్తకం “నిర్జన వారధి..” & నంబూరి పరిపూర్ణ గారి “వెలుగు దారులలో ” చదివితే , ఉద్యమాలలోనూ , ఆందోళనలోనూ పాల్గొన్న స్త్రీల వ్యక్తిత్వ పరిణతి అర్త్ధమవుతుంది.

    కోటేశ్వరమ్మ గారి వంద వసంతాల పండగ మరపురాని విధంగా జరగాలని మ్నస్పూర్తిగా కోరుకుంతున్నాను.

  • దేవరకొండ సుబ్రహ్మణ్యం గారూ, ఉద్వేగంతో మాటలురాని వాడినౌతున్నాను. మీకు చేతులు జోడిస్తున్నాను.

    ” నిర్జనవారధి ” రీప్రింటు పుస్తకాలు Hyderabad Book Trust వారినుండి పాఠకులకి అందుబాటులోకి రావడానికి మరో రెండు వారాలు పట్టవచ్చు. అప్పటిదాకా, ఈ-బుక్ కోసం కినిగె వారి కింది లింకు :

    http://kinige.com/book/Nirjana+Vaaradhi

  • మొన్న 22 న ఈ పండకకు వెళ్లలేకపోతున్నాని రాసాను. కానీ వీలు చేసుకొని ఆ 100 సంవత్సరాల వస్వంత పండగలో పాల్కొందుకే నిశ్చయించుకొని ఆగష్టు 4 ఉదయం విశాఖ చేరుతున్నాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు