కనికరం

మాన్యాలూ, మడులూ లేని మా కులాల్లో కోళ్ళ గంపలే ధాన్యలక్ష్మి గాదెలు.

పాదిరి గారి అబ్బాయి కథలు- 2                                                                                              డిసెంబర్ 23

1885 నుండి 1985 దాకా కోస్తా ఆంధ్రా జిల్లాల్లో పై సదువులకు పెద్ద దిక్కు మా ఏసీ కాలేజీ అని పేరు. తెల్లోళ్ళు, అందులోనూ కిరస్తానపోళ్ళు పెట్టిన కాలీజీ అయినప్పుటికీ అంటూ, అప్రాచ్చం అవకాడ నూకి యాడేడ దచ్చాది నుంచీ, ఉత్తరాది నుంచీ బియ్యేలు సదూకోటానికి సూట్కేసుల నిండా బొక్కులూ, గుడ్డలూ, కొబ్బిరి నూనే, స్నోలూ ఏసుకుని అన్ని పెద్దకులాల పిల్లలూ వొచ్చేవోళ్ళు. మా కుర్రోళ్ల ట్రంకు పెట్ట్టెలు ఆళ్ళ వీ ఐపీ సూట్టుకేసులముందు దూరంగా చిన్నబోయి వుండేవి. మా కాలేజీలో సీటు దొరకటం పెద్దపెద్ద ఆసావుల పిల్లలకే గగనంగా వుండే రోజులు అనుకునేవోళ్ళు. ఎట్టాగైనా సీటు కొట్టెయ్యాలని ఆళ్ళు ఎత్తే ఎత్తులు ఒగిటీ అరా గాదు.

అప్పుటుమటికి మాలా-మాదిగోళ్ళ దేముడు అని చీదరిచ్చుకున్నా, చెర్చీల ఎంపటి తిరిగి మెల్లి మెల్లిగా పాదిరిగోరి సావాసం మొదులు పెట్టీ, ఆయన్ని బతింలాడో, బెల్లిచ్చో ఎట్నోకట్టా పైపంచె తాకట్టు పెట్టైనా సరే ఆయనకాడ బాత్తీసం సట్టిపీకెట్టు పుట్టిచ్చుకొచ్చి మతం మారేవనీ, కన్వోర్టేడ్ క్రీష్టియన్స్ అనీ అపద్దాలు బొంకే జనాలు కొంతమందైతే, కాత్తెంత బిర్రుగా వుండే పాద్దిరిగోరి కాడ ఈ బాగోతాలు చెల్లక సంఘం మొత్తం ముందు కాకపోయినా ఎవుళ్ళూ ల్యాకోకుండా చూసుకుని ఏ గురువారం మజ్జానవో చెర్చీకి వొచ్చి పాద్దిరిగోరితో నిజ్జింగానే బాత్తీసం తీసుకుని సడీ సప్పుడూ కాకుండగా సట్టిపీకెట్టు పొట్టుకు పోయే బ్యాచ్చీలు మరి కొన్ని. ఈయన్నీ కాకుండగా అసలు ఒకేసారి తాలూకా ఆపీసుకు పోయి వందో, వెయ్యో ఇచ్చి మాల దాసర్లవనో, మాదిగ డక్కలోళ్ళవనో కాయితకాలు పుట్టిచ్చే ఉంకో తడి గుడ్డల గుంపు గూడా వుండేది. ఈళ్ళు ఏకా ఏకీ ముందు రోజుల్లో ఉజ్జోగాలకు కూడా గ్యాలం ఏసుకుని కూకునే మడుసులన్నామాట.

అవితే, ఈళ్ళందరికీ తెలీని రగశ్యం ఏందంటే, ఏసీ కాలేజీ మాలా మాదిగల కోసమే కట్టిన కాలేజీ కాదు అని. తెల్ల దొరల పాలనలో, ఇండియా దేశంలో జరిగిన అరాకొరా అభివృద్ది పనుల్లో, మరీ ముక్ష్యంగా కోస్తా జిల్లాల్లో జరిగిన మత ప్రచారంలో భాగంగా ఇసుమంటి కాలేజీలూ, ఆసుపత్రులూ నాలుగైదు తెరుసుకున్నయ్. తెల్లోళ్ళ పార్లమెంటులో వలస దేశాల మీద జరిగే బడాయి చర్చల్లో , ఆటి బాగోగుల గురిచ్చి గుండెలు అవిసిపోతన్నట్టు ఆళ్ళూ ఆళ్ళూ చేసుకునే తీర్మానాల్లో ఇట్టా కాలేజీలూ ఆస్టళ్ళూ పెట్టటం ఒక భాగం. అవితే ఇయ్యన్నీ కిరస్తానం ఆచారాలతో నిండి వుంటయ్యి కామట్టీ, కోస్తా ఆంధ్రాలో చానామటికి మాలా మాదిగ కులాల జనాలు ప్రెభువును నమ్ముకున్నారు కామిట్టీ ఈ కాలేజీలని అట్టా క్రిస్టియన్ కాలేజీలు అనేవోళ్ళుగానీ, నిజానికి ఇసుమంటి కాలేజీల్లో చానా లాభం పడింది మటికీ ఆసావులూ, బ్యాంబర్ల సదవర్లే. ఆమాటకొస్తే అసలు ఇండియా దేశంలో తెల్ల మతంలోకి మారిన మొదటి మనుషులు కేరళా నంబూద్రీ బ్యాంబర్లే. అందుకే అక్కడ కిరస్తానం మిగతా మతాలకు మల్లే గౌరవంగానూ, క్రిష్టియన్లు  అంటదగిన జనాలుగానూ చలామణీ అవుతున్నారు. అక్కడి నుండి వొచ్చిన స్వాములోర్లూ, సిస్టర్లూ దేశం మొత్తం మీదా పూజలు అందుకుంటన్నారు.  మా ఏసీ కాలీజీ మొత్తంలో సగానికి పైగా ఆసావులూ, బ్యాంబర్ల పిల్లలే సదూకునేవోళ్ళు. ముప్పాతిక భాగం లెచ్చిలేర్లు పెద్ద కులాల వాళ్ళే.  పంచాయితీ సమితీ ప్రాధమిక పాఠశాల, హరిజన వాడ అని పేరుపెట్టబడ్డా ఎలిమెంటరీ బడుల సంగతి ఎట్టా వుండా వూళ్ళల్లో వుండే జిల్లాపరిషత్, కమిటీ హవిస్కూళ్ళ ఎడ్మేష్టర్లూ, పంతుళ్ళూ మొత్తం పైకులాల జనాలు అవ్వబట్టి ఆ బళ్ళలో మా కులాల పిల్లలకి పట్టుబట్టి సదువు చెప్పే బాజ్జత ఎవురికీ వుండేదిగాదు. పది దాకా సదువుకోటానికి సైకరం, సదివినా ప్యాసయ్యే తెలివితేటలూ మా పిలగోళ్ళకు దూరంగా వుంచేవోళ్ళు. బళ్ళో తూతూ మంత్రంగా పాఠాలు చెప్పే మేష్టార్లు చానామందిరి మాటేల పూట ప్రవేటు చెప్పేవోళ్ళు. అట్టా ప్రవేటు సదూంకోవాలంటే ఆ అయ్యోరికి నాలుగు పుట్ల వొడ్ళు ఇయ్యాలి. కళ్ళాలు వూడ్సుకునీ, పరిగ ఏరుకునీ బతికిన మా పిల్లలకు వొడ్ళు పోసి ప్రవేటు చెప్పిచ్చుకునే భాగ్యం, బంగారం వుండదయ్యే. మరి పరీక్షల రిజల్ట్ వొచ్చినప్పుడు మా పిలగోళ్ళు కాలవల్లో ఎందుకు దూకుతారో, ఇల్లొదిలిపెట్టి దచ్చాది దిక్కు బ్యార్నీలకూ, మట్టిపనికీ పోయే కూలీల టాట్టర్లు ఎందుకు ఎక్కుతారో నేను చెప్పాల్సింది కాదు ఇప్పుడు. దాన్ని బట్టు కూడా మా కాలేజీలో సీట్లు ఎక్కువలో ఎక్కువ పెద్ద కులాల జనాలకే దక్కేవి.

అట్టా మా కాలేజీలో చేరిన చానామంది పైకులాల పిల్లల్లో పిల్లలమర్రి ప్రసాద్ ఒకడు. మా క్ల్యాసుమేట్టు. ఇంటర్మీడియట్టులో సైన్సూ, ఆర్ట్సూ అని రొండు కిస్తీలుగా బడి జరిగేది. పొద్దున ఏడున్నర నుంచి పన్నెండున్నర దాకా ఆర్ట్సూ, మజ్జానం పన్నెండున్నర నుంచీ సైన్సూ. మా ఆర్ట్స్ సదవర్లం పొద్దున్నే టిఫిన్ తిని ఒంటి నోట్సు పుస్తకం తీసుకుని  కాడ్రాయ్ ప్యాంటులో వింగ్స్  టీషర్టు (దాని చేతులు చొక్కా కింద అంచు నుండి మొదలై చూట్టానికి రెకల్లా వుంటాయన్నమాట) దోపుకుని పైన వైరుతోనో, నవారుతోనో అల్లిన బెల్టును ఒక పక్కకి యాలాడేటట్టు కట్టుకుని చేతిలో స్టీలు చైను ఒకిటి తిప్పుకుంటా అచ్చం  ‘చక్కర్మే రక్కా ‘ మోహన్ బాబుకుమల్లే కాలేజీకి యెళ్ళేవోళ్ళం. మా పిల్లలమర్రి ప్రసాదు మా స్పెషల్ ఇంగ్లీషు బ్యాచ్చే. ఆడు ఎప్పుడూ ఫిల్టుల బ్యాగీ ప్యాంటు మీద ఎనకమాల పొడుగ్గా వుండే టెయిల్ సొక్కాలు ఏసుకుని చేతులు మోచేతుల మీదికి మడిచి కళ్ళద్దాలు పెట్టుకుని ఒగిటో నెంబరు సదవరి లాగా కాలేజీకి వొచ్చేవోడు. మా బ్యాచ్చీ మొత్తంలో ఇంటర్మీడియట్టులోనే ‘ఏ గ్లాసరీ ఆఫ్ లిటరరీ టరంస్ ‘ అనే ఎం ఎహ్ అబ్రాంస్ రాసిన బొక్కు పొష్టు పొష్టు కొనుక్కుంది ఆడే. ఆ పుస్తకాన్ని రోజూ బడికి తెచ్చి, మా లెక్షరర్ల ముందు యమా లెవిల్ కొట్టేవొడు. మా కాలేజీ క్యాంటీన్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ కూడా తినేవొడు కాదు. అదేవంటే ఆళ్ళ ఇంట్లో భూవి కింద పెరిగే ఏదీ తినరంటా. బంగాళా దుంప భూవి కింద కాసుద్దని ఆడు చెప్పేదాకా నాకు తెలీదు. మా వూరి ఆసావుల పొలాల్లో పత్తీ పుగాకూ వరి అసుంటి పంటలేగానీ బంగళదుంపా, సగ్గుబియ్యం పండేయి కాదు. మా క్యాంటీను పూరీ, దాన్లోకి చేసే వుల్లిపాయా బంగాళాదుంప కూర సుట్టుముట్టు పది కాలేజీల్లో రోజూ మాట్టాడుకునే టాపిక్కు. దాని గురిచ్చి వుంకో కథలో మాట్టాడుకుందారి. అట్టాంటిది, మా ప్రసాదుగోడు మటికి మాతో పాటు క్యాంటీనుకు వొచ్చినా టీ ఒక్కిటే తాగేవోడు. మేం తింటన్నంతసేపూ దూరంగా పోయి నిలబడేవోడు. మాతో సావాసంగానే వుండేవోడుగానీ యాడనో గుల్లింత తేడా కొడతా వుండేవోడు.

అప్పుట్లో మా నాయన నల్లపాడు పేరిష్ లో పనిచేత్తా వుండేవోడు కామట్టి మా ఇల్లు నల్లపాడులోనే వుండేది. నేను కాలేజీ లేనప్పుడో, ఆదివారాలు అన్నాలు తిన్నాకో బయలెల్లి నల్లబాడు పోయేవోడ్ని. ఒకరోజు మా కాలేజీలో  వోట్లెలక్షనుకు ముందురోజు ఓపెన్ అసెంబ్లీ స్పీచ్ లు అయిపోగానే ఇళ్ళకెల్లిపొమ్మని చెప్పేరు. తెల్లారి ఎనిమిదింటికి వొచ్చి వోటేస్తే సరిపోద్ది. సరేలెమ్మని నేను నల్లబాడు పోటానికి బయలెళ్ళతంటే మా ప్రసాదుగాడు గూడా వస్తానని అన్నాడు. సర్లే పోదాం పా అని  నేను సీటు మీదా , ఆడు ఎనకమాల క్యారేజీ మీద కూకోనీ కాలేస్తంటే ఇద్దరం సైకిలు తొక్కుకుంటా నల్లబాడు పోయాం. మా ఇంట్లో ఎప్పుడూ ఎవురో ఒక సుట్టవో, సంఘస్థులో దిగబడే వుంటారు కాబట్టి ఆళ్ళకి తినిపిచ్చటానికైనా అవిసిరిమై మా ఇంట్లో కోళ్ళు పెంచేవోళ్ళం. అదీ కాకుండగా, మా ఇంట్లో జనాలు నీసు లేనిదే ముద్ద దిగే మడుసులు కాకపోతిరి. ఆరోజు మేం ఇంటికి పోయే తలికే మాంచి మాచర్ల బెరస పుంజు ఒకిటి మా పంచలో తిరగతా వుంది. మెడమీదా, నడుం మీదా ఈకలు ల్యాకోకుండా ఎర్రటి తోలుతో గమత్తుగా వుండే ఆ కోడిని చూసి మా ప్రసదుగాడు భలే కుశాల పడ్డాడు. ‘ఒరే.. ఈ కోడి భలే బ్యూటిఫుల్ గా వుంది. ఇది ఎంతకాలం బతుకుద్దీ’ అని ఆరా తీశాడు. ‘ఎంతకాలం ఏం లేదు…. ఇది రేపు క్రిష్టమస్ కి కోసుకోటానికి పెంచుకుంటన్నాం ‘ అని నేను నిజ్జిం చెప్పేశా. ఆడెందుకో మొకం మనేదిగా పెట్టుకుని ‘అరే .. చేత్తో పెంచుకున్నా పక్షిని చేతులారా కోసుకుంటారా? మీకు కనీసం కనికరం అనిపించదా”? అని నన్ను నిలేసేడు. నాకు ఆడు మాట్టాడతంది ఏందో అర్ధం కాలేదు. మా ఇళ్ళల్లో ఎండాకాలం అయిపోయినాక కోళ్ళను పొదగేసి, పిల్లల్ని చేపిచ్చి అందులోనుంచి బాగా వుటాగా వుండా పుంజుల్ని అమ్మకుండా క్రిష్టమస్ కోసం పెంచుకుంటాం. గతి లేనోళ్ళకుమల్లే పండగ రోజు వూర్లెంబటి పడి కోళ్ళకోసం ఎతుక్కునే గైరు పని మాకు వుండకూడదని మా నాయన చెప్పేవోడు. అదీ కాకుండా ఒక్కోసారి చెర్చీలో మొక్కుబడి వుండావోళ్ళు కూడా కోడిపిల్లల్ని తెచ్చి మా నాయనకు ఇయ్యటం వుండేది. అదీ ఇదీ కలిపి మా ఇంట్లో ఎంత రేత్రప్పుడు ఎసుమంటి సుట్టం వచ్చినా కొయ్యటానికి నాలుగు కోళ్ళు రడీగా వుండేయి. మాకు తెలిసినంతలో మాకన్నా అట్టా డాబుసరిగా బతికిన మాలా మాదిగలు చానా తక్కువ. దేవుడి పేరుతో జరిగే అన్ని పనుల్లో బీదా బిక్కీ జనాల కస్టాన్ని జమ చేసుకునే ఉజ్జోగం ఒకిటి వుంటదనీ, ఇండియా దేశంలో మా అంటరాని జనాలకు దొరికిన తెల్ల మతంలో కూడా అట్టాంటి ఉజోగంలో బాగుపడే జనాల లిస్టులో మా నాయన కూడా తెలిసో తెలియకో భాగం అయిపోయేడనీ నాకు అప్పుట్లో తెలీదు. అయితే మాన్యాలూ, మడులూ లేని మా కులాల్లో కోళ్ళ గంపలే ధాన్యలక్ష్మి గాదెలు. అదీగూడా కాకుండా రోజూ కారం మెతుకులు తినే మా మాలిపిల్లి జనాలు పండగరోజన్నా చియ్యలు తినకపోతే నిత్యం మెలితిరిగే కండల్లో బువ్వ మెతుకులు సంపాధిచ్చే సత్తువ ఎక్కడు నుంచి వచ్చేనో నాకైతే బుర్రకెక్కలేదు.  కానీ మా ప్రసాదుగాడు చెప్పిన ఆ కనికరం మటికి నాకు పదో తరగతిలో నాలిక తిరగని పైతాగరస్ సిద్దాంతం లెక్కన ఇప్పుటిమటికి అర్ధం కాలేదు.

ఆరోజంతా మా ఇంట్లో వుండి, మాటేల మా ప్రసాదుగోడ్ని ఆళ్ళ ఇంటికాడ దించేసి నేను ఆస్టలుకి వొచ్చేసేను. ఆ తెల్లారి ఆడు కాలేజీకి రాలేదు. ఎలక్షన్లలో ఆడి వోటు మురిగి పోయింది.  వుంకో రొండు రోజులు చూసి ఆ మజ్జానం కాలేజీ అయిపోయాక ఆడ్ని ఎతుక్కుంటా బ్రాడీపేట నాలుగూ బై తొమిది లోని ఆళ్ళ ఇంటికి పోయాను. గట్టిగా ఎనిమిది సెంట్ల స్తళంలో నడిమజ్జన కట్టిన ఇల్లు. సుట్టూతా ప్రహరీ గొడ. గోడకు తొమ్మిదో అడ్డరోడ్డు వారగా ఒక పుచ్చిపోయిన చెక్క తలుపు. చానా సేపు కొట్టగా కొట్టగా ఎవురో ఆడ మనిషి తలుపు తీసింది. ప్రసాదు కావాలని అడిగాను. “ఒరే ప్రెసాదూ…. ప్రెసాదూ.. ఎవడో వచ్చాడు నీకోసం చూడూ” అని అక్కడి నుండే అరిచింది. ఆళ్ళ పెద్దక్క అనుకుంటా. నేను అక్కడే నిలబడిపోయా. కాసేపటికి మా ప్రసాదుగోడు సొక్కా లేకోకుండా కింద ఒక తుండు కట్టుకుని వొచ్చాడు. నన్ను చూసి అక్కడే నిలబడురా బట్టలు వేసుకుని వస్తాను అని చెప్పి మళ్ళీ లోపలికి పోయాడు. ఇంకా ఐదునిమషాలు ఆడే నిలబడ్డాక మెల్లిగా ఆడు సొక్కా ప్యాంటూ ఏసుకుని వొచ్చి ‘పద… పోదాం… నీ గురిచ్చే అనుకుంటన్నాను ‘ అని నన్ను ఎనిమిదో అడ్డరోడ్డులోని స్టీ స్టాలుకు తీసుకు పోయి అక్కడ సతికిలబడ్డాడు. పక్కనె నేనుగూడా కూకున్నా.

అప్పుడు ఆడు చెప్పటం మొదులు పెట్టాడు!

అరేయ్ .. ఒకడ్ని చంపాలిరా. మా బావ గాడిని. త్రిపురాంతకం ఇచ్చిన మా అక్క మొగుడు. ఆ నాకొడుకు మా అక్కని చిత్రహింసలు చేస్తున్నాడు. మా మేనత్త కొడుకు అని పెళ్ళి చేశాం. పెళ్ళి తరవాత ఇక్కడికి వచ్చి మా నాన్నతో కలిసి బృందావన్ గార్డెన్స్ లోని గుళ్ళో  చేదోడుగా వుండమని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అక్కడే వూళ్ళో వుంటూ వ్యవసాయం చేసుకుంటాడట. మా అక్క అక్కడ వుండనూ అని చాలా సార్లు మొండికేసింది. అయినా వాడు వినలేదు. వూరికి వస్తావా లేదా అని బెదిరిస్తునాడు. వాడ్ని చంపెయ్యాలిరా. నువ్వూ, మీవాళ్ళు ఇంకా ఒకళ్ళూ ఇద్దర్ని కలుపుకో. నేను మీకు యాభై వేలు ఇప్పిస్తాను మా నాన్నను అడిగి … అన్నాడు.

నాకు తాగే తాగే టీ నీళ్ళల్లో కోడి చేదు పగిలినట్టు అనిపిచ్చింది. మా నాయనా, అమ్మా మమ్ముల్ని ఎంతో గారాబుంగా పెంచుకున్నారు. ఆళ్లకు అయినంతలో మాకు మంచి కూడూ గుడ్డా ఇచ్చి నాలుగు ముక్కలు సదివిచ్చుకోవాలని ఆశపడేవోళ్ళు. నేను ఎప్పుడూ ఒకడ్ని చెయ్యెత్తి కొట్టిన మడిసినిగూడా కాదు. కాలేజీలో అందరికిమల్లే టక్కు చేసుకుని తిరగతా, నాకు అర్ధం అయినకాడికి మార్చో, సెప్టెంబరో పరీక్షలు రాసుకుంటా మెల్లిగా సదువు పూర్తి చేసుకోని ఏదన్నా గవుర్నమెంటు ఉజ్జోగం దొరికితే చేరి మా అమ్మా నాయనల్ని బజాజ్ కవసాకీ ఫోర్ స్ట్రోక్ మోటర్ సైకిలు మీద తిప్పాలనీ కలలు కనేవోడిని. అసుమంటిది ఆడు ఏం అనుకుని నాకు యాభై వేలు ఆశ చూపిచ్చాడో నాకు అర్ధం కాలేదు. ఆళ్ళ బావను సంపాలంటే ఆడే ఆ పని ఎందుకు చెయ్యలేదో, దానికి నేనూ, మావోళ్ళే ఎట్టా లాయకైన మడుసులమని తీర్మానం చేసుకున్నాడో నాకు ఇప్పుటిమటికీ మతికి ఎక్కలేదు. మా సావాసం ఆ తరవాత కూడా నిలబడే వుండా, అట్టా నాలో ఒక కిరాయి రౌడీని ఎట్టా చూశాడా అని ఈ రోజు మటికి యాడ్నో ఒక మూల వలపోత పోతానే వుంటా!

*

ఇండస్ మార్టిన్

31 comments

Leave a Reply to Indus Martin Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “గొంతులు కోసే కులాలతో నీకు సావాసవేంట్రా ఎధవా..”. అని ఇళ్ళల్లో తిడతారు కదా.. అది విని నిజమనుకోనుంటాడు.

  • “పండగ పూట గతి లేనోళ్లకి మల్లె వూర్లెంబడి పడి కోళ్ల కోసం తిరిగే గైరు…..”

    ముప్ఫై ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళావు మార్టిన్.

    BTW Bajaj kavasaki 😛😉 4s champion గుర్తుంది.

  • ఆ కనికరం…. నాలుక తిరగని పైథాగరస్ సిద్ధాంతం మల్లే ఉంటదని నీవే అన్నావుగదన్న… పెసాదు… కోడి తలైనా…. మనిషి తలైనా… ఒకటే అనుకుని ఉంటాడు… ఆడు… ఎంతైనా కనికరం కలిగిన మనిషాయే….

  • కనికరం లేని చోట కనికరానికి వెతికారు మీరు. వారి పని కావటానికి కావలసిన సరంజామా లేబర్ మనుషుల లో దొరుకుతుందని వారి అవగాహన. ఎందుకంటే వారి కున్న కఠినత్వం లేబర్ మనుషులకు ఉండాలని వారి కోరిక. అయితే అది తమ అదుపులో ఉండాలి.

  • కుల సృహ ఒక మామూలు ఇస్కూలు చదువుకునే కుర్రాడికి ఉంటుందని అనుకుంటున్నారా మీ ప్రసాదు కంటే చాలా కాలం తర్వాత పుట్టిన నాకు లేదు నా సహోధ్యాయులకు కూడా నేను చూడ లేదు ఇంకా క్లాసు పుస్తకాలు ఉచితం గా వస్తాయని మాకు సీనియర్ ల చిరిగిన వి మాత్రమే మాకు నాన్న కొనిస్తాడని మా దేవేంద్రుడి ( మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ దళిత్ ) తో అనే వాణ్ని ..వాడు కూడా నన్ను వాడి కొత్త పుస్తాకాలను తాకానిచ్చేవాడుకాదు

    మీ ధైర్యం ఎక్కువనో లేక ఇంకో తో అని మిమ్మల్ని prasad సహాయం కోరి ఉంటాడు

    ఈ కామెంట్లు చూస్తుంటే కంపరం గా వుంది చిన్న పిల్లవాడి మెదడులో విద్వేష బీజాలున్నాయని ఎంత గా ఊహిస్తున్నారు సిగ్గుపడండి మీ మెదళ్ళు ఇంతగా చెడిపోయాయో మీకు తెలుస్తోందా

    • The reason you have given that prasad wanted to kill his baava is silly and un justifiable …. for not coming to priestwork and wanted to continue with his cultivation .. does any boy may think like that .. prasad bava is not alchoholic not a womaniser. . Not a sadiat .. not a pervert … . also how a temple priest will arrange 50000 for you . .. that too around 30 years ago… that os huge amount at that time …. totall bull shit you are telling ..

      • పైగా కోడి మెదడున్న వాడు ఎదో అంటే అంతే అనుకుంటా అని మీ సన్నాయి నొక్కులు ఒకటి

        మతి లేని మీ రాతలు కనికరం లేని వీళ్ళ కామెంట్లు

        సారంగ అంటే నాకు కాస్త గౌరవం వుంది మీ చెత్త రాతలవల్ల అదికాస్తా పోయేటుంది

        ఏంటీ అల్లరి

        పైత్యం

      • Sudheer
        Did i confirm that he is not an alcoholic or anything else? Should i judge the character which i have not seen nor heard about much? Is it my responsibility to provide a reason behind the decision of a friend? Did i say that he ultimately got his brother in law killed?

        I just made record of what has happened. I saw my own position through the conversations.

        You are just …… I have no words. And the way you talk is defecation through mouth.

      • మీకు నచ్చని రాతలను చదవమని ఎవడూ మిమ్మల్ని బలవంతం చెయ్యడు. వాటిని ఆపాలని బలవంతం చేసే హక్కు మీకు లేదు. సారంగ వారికి ఈ రాతలు అపించమని మీరు అభ్యర్ధించండి. వాళ్ళు ఆపేస్తే ఆగిపోతాయి. దూషణలూ, చిల్లర కామెంట్లూ మానండి. మీ స్థాయికి దిగితే మళ్ళీ మీరే నొచ్చుకుంటారు.

    • సుధీర్
      మీకు అసలు సమాధానం చెప్పకుడదు అనుకున్నాను. కానీ, మీ అహంకార భాష చూశాక మరొక్క సారి మీతో మాట్లాడితే మంచిది అనుకుంటున్నా.

      నా అభిప్రాయంలో మీరు అచోసిన కులమధాంధుడు. ఇది నా అభిప్రాయం. మీకు ఉన్నదంతా కుల పిచ్చే. మరొకటి కాదు.

      నా తొమ్మిదవ తరగతిలోనే స్కూల్ లో నా పక్కన ఎవడూ కోర్చోకుండా ఒక్కడ్నే సంవత్సరం మొత్తం ఒక బెంచీలో వివక్షకు గురికాబడ్డవాడ్ని. కేవలం నేను మార్టిన్ అనే పేరు పెట్టుకున్నాను కాబట్టి నన్ను మీరు ఎలాగైతే క్రైస్తవుడు అనుకుంటున్నారో, అలానే నన్ను అంటరానివాడు అని అవహేళన చేసిన స్కూల్ మేట్స్, వాళ్ళ తల్లిదండ్రుల ప్రవర్తన ఆల్రెడీ పుస్తక రూపంలో ప్రచురించాను.

      ఒకడి అవస్థను వాడు చెప్పుకుంటుంటే కూడా అందులోకి దూరి ఇది సత్యం, ఇది అసత్యం అనే సంస్కార హీనమైన మనిషి మీరు. మీకు జరిగిన అనుభవాలను మీ కథగా రాయండి. ఒకవేళ ఎవడైనా అంటరాని కులాల వాడు మీ పట్ల అన్యాయంగ ప్రవర్తిస్తే మీరు ఆ కథనే రాయండి. మీకు హక్కు వుంది. ఇలా వేరొకరి అనుభవాల్లోకి దూరి న్యాయ నిర్ణేత పాత్రా, ధూషకుడి పాత్రా నిర్వర్తించడం నిజంగా తప్పు. మీరు సిగ్గు పడండి.

      భాష కంట్రోల్ తప్పితే ఈ సారి ఇంత సౌమ్యంగా సమాధానం చెప్పను. ముందే మీకు గౌరవంగా హెచ్చరిక ఇస్తున్నాను.

      • Martin .. if u want me not to write any comment on your post … i wil not write … if u dont like my comments … you may ask editor to remove it or u can also remove it .. .. dont expect me to write postive to u r post … i have every right to tell what i feel on this platform ..

      • Dear saranga editors … if u want me not to write comments … i dint write .. if u want to have a healty discussions … dont take the side of writer and dont remove my comments any more … you have already removed few of my comments in earlier posts…

      • Sudheer
        You have every right to express your opinion. But the way you belittle people with your cheap language is objectionable. కామెంట్లు చేసిన వారిని కోడి మెదడుగాడు అనడం, సిగ్గుపడండి అనడం, బుల్ షిట్ అని నోటి విరేచనాలు చేసుకోవడం వలన అదే రకమైన భాషలో మీకు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు చర్చ ఆరోగ్యవంతం ఎలా అవుతుంది?

        నా కథ నచ్చలేదు అని మీరు దినమంతా రాయండి. మీ హక్కును నేను సమర్ధిస్తాను. దిగజారిన భాష వాడితే తప్పకుండా నేను తీవ్రంగానే స్పంధిస్తాను.

        మీకు నచ్చిన కథలు, మీకు నచ్చిన భావజాలం, మీరు కోరుకున్న నేపధ్యంలో రాయడానికి నేను మీ పాలేర్ను కాదు. ఒకడి అస్థిత్వ పోరాటంలో ఎదురైన చేదు అనుభవాలను నిజాయితీగా రాసుకునే హక్కు ప్రతీ ఒక్కడికీ వుంటుంది. మీ అనుభవాలు రాయండి. గౌరవించి చదువుతాం. గౌరవంగనే అవసరపడితే విభేధిస్తాం. చిల్లర మాటలు మాత్రం మాట్లడం.

        ఎడిటర్స్ అన్నీ చూస్తున్న్నారు అనుకుంటున్నాను.

      • కామెంట్ రాసిన అయేషా ని రేప్ గురించి రాయటానికి మీరు రేప్ అవ్వాల్సిన అవసరం లేదు అని చీప్ లాంగ్వేజ్ వాడిన మీరు సంస్కారం గురించి ఎలా మాట్లాడుతున్నారు

        మీలో పురుషాహంకారం లేకుంటే ఒక స్త్రీ తో బలాత్కారం గురించిన భాష ఎలా వాడారు

        అయేషా అన్న మాటలు ఏఁటి మీరు హత్యా కాండ కు ప్రత్యక్ష పరోక్ష విక్టమ్ కాదుకదా అన్నందుకు

        మీరు వాడిన భాష ప్రతిస్పందించిన తీరు హేయం గా వుంది

        పైగా కుక్కను చంపాలంటే పిచ్చి దన్న ముద్ర వేయాలన్నట్టుగా మాటలాడిన ప్రతి వాడిమీదా కులాహంకారముద్ర వేస్తున్నారు

  • ఆయేషా మొత్తం కామెంట్లు చూడండి. ఏకపక్షంగా ఎన్నేసి దూషణలు చేసిందో. హత్యలకు గురికాని నన్ను స్పందించాల్సి న అవసరం లేదంటే రేప్ కు గురికానీ ఎవరూ స్పందించే అవసరం లేదు. ఇందులో జం డార్ ఎక్కడిది? ఒక వేళ నేను పురుషాధిక్య భావజాల మనిషిని అయితే నన్ను నేను సరి చేసుకోవాల్సిందే.

    అంతమాత్రాన చీప్ భాష వాడే హక్కు మీకు దక్కదు.

    • ఒక స్త్రీ కాబట్టే మీరు ఆయేషా తో రేప్ గురించి మాట్లాడారు

      తనతో మీరు చెప్పినట్టు గౌరవం గా విభేదించ వచ్చుగా

      ఆడది కాబట్టి రేప్ గురించి మాట్లాడితే నోరుమూసుకుని ఉంటుందని మీరు భావించి ఉండవచ్చు

      మీకోనీతి తనకో నీతా

      కులం కారణం గా మీరు వివక్ష ఈదుర్కొన్నారని చెప్తున్నారు

      మరి అదే రకమైన వివక్ష జండర్ కారణం గా మీరు ఇంకొకరిమీద చూపిస్తున్నప్పుడు

      మీకు అవకాశం దొరికితే ఎంత వివక్ష కైనా పాల్పడగలరని అనిపిస్తున్నపుడు మీమీద సహానుభూతి ఎలా కలుగుతుంది

      • ఆడది కాబట్టి రేప్ గురించి మాట్లాడ కూడదా? మాట్లాడితే నా మీద సహానుభూతి పుట్టదా? ఆమె కులాహంకారంతో నోరు పట్టని నిందలూ దుర్భాషలూ ఆడుతుంటే అత్రీలకే అర్ధం అయ్యే మరొక బాధను ప్రస్తావిస్తే అది వాళ్ళను అవమానించినట్టా? నిన్ను ఒకడు అంటరాని వాడా అని తిడితే నీకు ఎలా వుంటుంది అని మీరు నన్నంటే అది నన్ను అవమానించినట్టా? నాకు అర్ధమయ్యే ఒక వ్యధను ఉదహరిస్తున్నట్టు కాదా? ఎక్కడ దొరుకుతారు సార్ మీలాంటి అవకాశ వాదులు? మీ సహానుభూతినీ బూతుల్నీ ఇక్కడ కోరుకుంది ఎవడూ? అసలు సహానుభూతి పక్కన పెట్టండి, వల్లమాలిన కుల గజ్జిని వ్యక్తపరచడానికీ, ఆ కులగజ్జిని ఎక్స్పోజ్ చేస్తున్న వారి నోళ్ళు మూయించడానికీ మీరు ఇక్కడ ఇంతలేసి వాదన చేస్తున్నారు కానీ, అసలు కథ గురించీ, కథలోని సాహిత్య విలువ గురించీ ఒక్క ముక్క మాట్లాడలేదు. మీ అహంకార ఉద్దేశ్యం ఇందులోనే తెలుస్తుంది. ఎక్కువగా మీతో వాదించే సమయం లేదు. ఇప్పటికి చాలిస్తాను.

        మరో విషయం…. ఆయేషా ను అన్నదే తప్పు, కానీ మీ గురించి మాట్లాడినవన్నీ సరేనని మీరు ఒప్పుకున్నట్టేగా? మంచిది.

      • మరి ముందు పోస్ట్ లో గౌరవం గురించిన ధర్మపన్నాలు మాట్లాడారు

        మీకు మాత్రమేనా మనోభావాలు వున్నవి

        అడ్డం మాట్లాడిన ప్రతి వారికీ కులాహంకార ముద్రలు వెయ్యండం ఆపండి

        మీకు తప్ప ప్రతిఒక్కరికి కులాహంకారం ఉందా

        ఎం మాట్లాడుతున్నారో అసలు మీకు అర్థం అవుతోందా

        కథ లో శిల్పం ముఖ్యం కాదు వస్తువు మాత్రమే ప్రధానం నా మట్టుకు నాకు

        కొత్త నేపధ్యం లో కథలన్నారు మరి ఏంటా నేపధ్యం

        మీకులం గురించి నేను ఎక్కడైనా మాట్లాడానా పరకుల ద్వేషం మాత్రమే వద్దన్నాను అంత మాత్రానికే నేనేదో కుల గజ్జి తో కొట్టుకుంటున్నానని తెగ గింజుకుంటున్నారు

        ఇంత అసహనం ఎందుకండీ మీకు

        మాటి మాటికీ కులం కులం అని ఎందుకు వదురుతారు

        నాకు మీకులం గురించి ఎటువంటి వ్యతిరేకతా లేదు మీకులం ఏదయినా ఇక్కడ అది అసంగతం నాకు

        ఏదయినా వ్యతిరేకత ఉందంటే అది మీ భావజాలం మీద మాత్రమే

        మీమీద మీ భావాలమీద మీ భాష మీద వ్యతిరేకతను మీకులం మీద వ్యతిరేకతగా చూపించడానికి తెగ ప్రయత్నిస్తున్నారు

        ఒక స్త్రీ తో ఎలా మాట్లాడాలో తెలియని మీరు ఇంకా తప్పు వప్పుకోవడానికి సిద్ధంగా లేరు

        అస్తమానం కులం కులం అనకండి ఇక్కడ మీ రచనా శైలి బాగుంటే చదువుతారుకాని కులం కారణంగా ఎవరూ మీకథ చదవరు

      • వదరడం అనే మాట వాడితే, మొరగడం మాను అని చెబుతా. మీరు చదివినా చదవకపోయినా నేను ఇదే రాస్తా. మీరు చెయ్యగలిగింది చెయ్యండి. మీకు మనుషులతో మాట్లాడటమే రాదు. మీరే ఒక పెద్ద తప్పు. సరేనా?

      • సామాజిక నిచ్చెన మెట్ల మీద

        ముందు మెట్టు మీద నేను వెనక మెట్టు మీద మీరు ఉండి ఉండవచ్చు

        కానీ ఎపుడూ సామాజిక స్థాయి ఊర్ధ్వ చలనం గానే ఉంటుంది

        నా చిన్నప్పటి ఇప్పటికీ యాదవ గౌడ్ కులాలు చాలా వేగం గా మెట్లెక్కి వచ్చాయి

        అలాగే అంటరాని కులాలు కూడా ఇంకో అర శతాబ్దం లో వేగం పుంజుకొని కొన్ని కులాల్ని దాటి ముందు కెల్లి పోవచ్చు

        ఈ రకమైన సామాజిక స్థాయీ మార్పులు ప్రతి కాలంలో వున్నవే

        శుద్ర కులమైన మేము అతి శుద్ర కులమైన మీరు ఇలాగే ఎల్లకాలం ఉండిపోము

        ఇక్కడ పెనుగులాట అధికారం కోసమూ ఆస్తి కోసమూ మాత్రమే

        వాటి మార్పిడి కోసం ఆధిపత్యం కోసం ఎవరికీ దొరికిన ఆయుధాలతో వారు యుద్ధం చేస్తున్నారు

        మీరు కులాన్ని వాడుకుంటోంది అందుకే

      • అంట రాని కులాల్లో మాల మాదిగలు కాక

        డెక్కలి ఒంటరి వంటి ఇంకో అరవై కులాలు మీకన్నా వెనుకబడి వున్నాయిగా

        మీరు వాళ్లను దాటి వచ్చారు మరి వారికోసం పోరాటం చేయరేం

        వారిని నీచం గా చూసిన దాఖలాలు నాకు తెలుసు

        అంతెందుకు మాదిగలను దాటి అభివృద్ధి చెందిన మాలలు రిజర్వేషన్స్ ను విడదీయడాన్నికి ఎందుకు వప్పుకోరు

        మీరు ఎంత ఇద్దర్నీ కలిపి వ్రాసినా ఇద్దరూ వేర్వేరు కులాలేగా

      • నేను ముందే చెప్పాను. మీరు ఆఖర్న రిజర్వేషన్ల వద్దకు వచ్చి ఆగిపోతారు అని. అదే జరుగుతుంది.
        నేను నా అస్తిత్వం గురించి రాస్తున్నాను. దక్కలి, జాంబవంతుని కులాల గురించి రాసిన సోదరులు ఉన్నారు. నాకు ఆ సామాజిక నేపథ్యం లోతుగా తెలియదు. అనుభవం లేదు. అది రాయమని అడిగే పిచ్చితనం మీకెలా? స్త్రీ బాధ గురించి రాయమని మిమ్మల్ని నేను అడగను. ఎవడు ఎం రాయలేదో దాని గురించి విమర్శించడం కువిమర్శ. మీకు అక్కసు, కులగజ్జి ఇంతకు మించి మరేం లేదు అని మళ్ళీ చెబుతా.
        మాలా మాడిగల్లో ఉన్నా విభేదాల గురించి చాలానే రాశాను. ఇప్పటికీ రాసింది ఇక్కడ రెండు కథలే. మొత్తం ముప్పై రాస్తున్నాను..

  • మార్టిన్ గారూ, ఎవరూ చెప్పని చరిత్రని మీరు చెబుతుంటే నిశ్శబ్దంతో దాన్ని కప్పెట్టేస్తారేమోనని భయపడ్డాను. మనసులోని కుళ్ళునంతా బయటపెట్టుకునేలా ఒక వర్గం పాఠకుల్ని కలవరపెట్టిన మీ శక్తికి జోహార్లు.

  • A very good story depicting in the most subtle manner how the caste has sunk into the blood! Keep up the unusual and inimitable style of writing.

  • మాచర్ల బెరస అని మీ కథ లో చూడగానే నాకు బాగా ముచ్చటేసింది.ఎందుకంటే మాదీ మాచర్లే.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు