ఒక రాత్రి అమృతం కురిస్తే మరొక రాత్రి బూట్ల చప్పుడు!

అమృతం కురిసిన రాత్రిలో సౌందర్యమూ, సైనికుడి ఉత్తరంలో విషాదమూ!

దేవరకొండ బాల గంగాధర్ తిలక్… మన  తెలుగు రవీంద్రుడే అనిపిస్తుంది నాకుకవిత్వంలో గాఢతఎంత చదివినా ప్రతిసారీ కొత్తదనం

అమృతం కురిసిన రాత్రిసైనికుడి ఉత్తరం ఇప్పుడు చదివిన రెండు కవితలు

ఒక రాత్రి అమృతం కురిస్తే మరొక రాత్రి బూట్ల చప్పుడు పెట్టే కలవరం అనుభూతిచెందుతాం.  మనసు చెప్పే మాటలు వినడానికి ఏకాంత రాత్రుళ్లే అనువైన సమయాలు.  

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు” 

“ నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అంటారాయన రెండులక్షణాలు  రెండు కవితలలో మనకు కనిపిస్తాయిఅమృతం కురిసిన రాత్రిలో సౌందర్యమూసైనికుడి ఉత్తరంలో విషాదమూ

కలల పట్టు కుచ్చులున్న కిరీటం ధరించి మనల్ని అనుభూతుల ఓలలాడిస్తాడుగుండెలమీద  క్షణమైనా దిగడానికి సిద్దంగా వున్న కత్తితో  వేలమైళ్ల కావలనున్న సహచరి దేహపు వెచ్చదనంతో nostalgia లోకి జారిపోయే సైనికుడి బాధను మన గొంతులోకివొంపుతాడు

ఎక్కువశాతం పద్య శైలిలో వుండే ఆయన కవితలు సాహితీ ప్రేమికులకు అక్షరామృతాలువినండి మరి

ఝాన్సీ పాపుదేశి

5 comments

Leave a Reply to దొర్సామి నాయుడు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు