నీడలు తెగిపోతాయి
జీవితం ఉన్నట్టుండి ఒక జ్ఞాపకమై వెంటాడుతుంది
ఎంతకూ తీరని వేదన
మనస్సు పొరల నిండా నిండుకుంటుంది
కళ్లముందే చూస్తుండగా
మూడురాళ్ల పొయ్యి కూలిపోతుంది
ఎవరి దారిన వారు పాత్రలు ముగించుకొని వెళ్లిపోతారు
మిగిలిన ఒత్తుకుండా
ఏ ఒంటరి జీవితాన్ని ఈదుతుందో
ఎవ్వరికీ పట్టదు
ఎన్ని ముచ్చట్లను కుప్పలు పోసి చలికాచుకున్నారో
సూర్యోదయాలు, సూర్యస్తమయాలకు
జీవిత రంగుల్ని పులిమిన ఘడియలు ఏమయ్యాయి
ఎవరికి ఎవరు ఎట్లా దొరికారు
సంధ్యా సమయ తీరాన
నాలుగు ముచ్చట్లే కదా ఓదార్పు
కూర్చున్న చెట్టు నీడ కాదు
చెట్టే మాయమవుతుంది
గుర్తులు మాయమవుతాయి
వెనక్కి తిరిగి చూసుకుంటే
అలుముకున్న శూన్యమే కనిపిస్తుంది
కాలం వెనక్కి తిరిగిరాదు
జీవితాలు మళ్లీ రావు
మాటల్లో దొర్లాడిన కష్టం సుఖం ముఖం చూపించదు
అంతా చరిత్రలోకి చేరిపోతుంది
రేపు పుట్టబోయే వాడికి ఏ గతమూ తెలియదు
ఒకనాడిట్లా ఉండేదని చెప్పేవాడేవడు?
ఈ బతుకును ప్రేమించేవాడెవడు?
అంతా ఏకాకి వలపోత
(కరోనా ఐసోలేషన్ లో)
*
…మూడు రాళ్ల పొయ్యి కుప్ప కూలుతుంది.
.. nice anna
Thank you చందు
వెనక్కి తిరిగి చూసుకుంటే
అలుముకున్న శూన్యమే కనిపిస్తుంది ….
అంతా ఏకాకి వలపోత …
జీవిత తాత్వికతను తెలిపారు అన్న ….
థాంక్స్ రామ్
“ఒకనాడిట్ల ఉండేదని చెప్పేవాడేవాడు ?
ఈ బతుకును ప్రేమించే వాడేవడు
అంతా ఏకాకి వలపోత”
బాగుంది 👌
అన్నా థాంక్యూ 🙏❤️
కరోనా చాలా మందిని ఏకాకులను చేసింది
ఇది అందరి వలపోత.
మీరన్నట్టు ఎవరికైనా నాలుగు ముచ్చట్లే కదా ఓదార్పు..
చాలా బాగుంది అన్న..
థాంక్యూ డియర్ ❤️
“రేపు పుట్టబోయే వాడికి ఏ గతమూ తెలియదు
ఒకనాడిట్లా ఉండేదని చెప్పేవాడేవడు?”
– ఈ కవితనే కదా రేపటి వాళ్ళకి తెలియజేసేది . ఇంకా ఇలాంటి సాహిత్యం రావాలి రేపటి తరాలకి తెలియచేయడానికి .
అన్నా ధన్యవాదాలు 🙏
కళ్లముందే చూస్తుండగా
మూడురాళ్ల పొయ్యి కూలిపోతుంది
ఎవరి దారిన వారు పాత్రలు ముగించుకొని వెళ్లిపోతారు
మిగిలిన ఒత్తుకుండా
ఏ ఒంటరి జీవితాన్ని ఈదుతుందో
ఎవ్వరికీ పట్టదు.
నిజమే… అన్నా
మనిషి పాత్ర ఎంత సాదించిన ఎమి మిగలదు చివరికి కాలి పాత్రయే… తప్ప!🙏
మల్లి ఎవడో ఓకడు ఆపాత్రలో ఇమడాల్సిందే… కోనసాగాల్సిందే….
ఎక్సలెంట్ పోయెమ్ సర్
Thank you very much
kaalam venakki thirigi radu…
jeevitam thirigi radu.. kasta sukhala madhya ontaritanam vedana baga cheppavu Ravinder ..Abhinandanalu
అన్న ధన్యవాదాలు
..మూడు రాళ్ల పొయ్యి కుప్ప కూలుతుంది.
“ఒకనాడిట్ల ఉండేదని చెప్పేవాడేవాడు ?
ఈ బతుకును ప్రేమించే వాడేవడు
అంతా ఏకాకి వలపోత”..…
చాలా బావుంది అన్నా…వర్తమాన వాస్తవం…
ఏకాకి వలపోత – కరోనా ఇసోలేషన్ ఏకాంత స్పందన 🙏🌹