వర్షానికి నిండిన కొత్త గోదారిలా
నా గుండె తీరం మీద పరవళ్ళు తీస్తుందా?
ఎలా మాట్లాడుతుందో-
మాట్లాడకపోతే అలిగి కూర్చున్నప్పుడు
వంకర తిరిగిన ఆమె ముక్కును ముద్దు పెట్టుకోవాలని ఉంది.
కోపంలో కళ్ళు ఏర్రబడిపోతాయా..?
ఎరుపు అంటే గుర్తుకొచ్చింది
మార్క్స్ రాసిన ప్రతి అక్షరాన్ని భద్రపరిచి
ముద్రించిన జెన్నీ లా ఉంటుందా?
ఐనా నేను మార్క్స్ కాదుగా ప్చ్..
మరి తనేంటి..?
తాగుబోతు ప్రాధేయపడితే
మందుగ్లాస్ నుండి చివరిగా జారిపడ్డ
లక్కీ డ్రాప్ లా ఉంటుంది కావచ్చు.
నువు మందు తాగవు కదా..
ఎందుకీ ఉపమానం? ఇంకేదైనా..
అదోరు బాగన్ లో పొన్న లా
నన్నే అంటిపెట్టుకుని ఉంటుందా?!
తనకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం
భర్త లోపమే అని తెలిసినా
కాళిని చంటిబిడ్డలా ప్రేమించిన పొన్నలా ఉంటుందా..?
నిండు లక్షణాలున్న పద్యాన్ని కాకపోయినా
ఆమెని పొగిడే
ఒక కవితా పాదాన్నై ఆమె పాదాలవద్దనే ఉండిపోనా?!
*
ఒక కవితా పాదాన్నై ఆమె పాదాలవద్దే ఉండిపోనా…
అద్భుతమైన వ్యక్తీకరణ..కవి
Kalimulla
నిశ్శబ్ద కవిత