అసంపూర్ణ హస్తప్రయోగం లాంటి ఒక రాత్రి
పిడుగు పడినా మనిషి లేవడు- అనుకుంటుంది ఆమె
కాస్త తెరిపిగా మరి కాస్త వేదనగా.
అయినా
శరీరంలో ఉన్నవాటికి మందులు
మనసు నిద్రపోవడానికి మందు వేసి
పకడ్బందీ గా నిద్ర శిక్ష వేసుకున్న ఒక శరీరం
శవంలా తెల్లవారటానికి ఎదురు చూస్తుంది.
కాబట్టి అందుకే
సంవత్సరాల తరబడి కళ్ళలోకి చూసుకోని వాళ్ళే
భార్య భర్త లవుతారు
ఈ జీవితపు గేటెడ్ కమ్యూనిటీ లో
అప్పుడప్పుడు..
సాయంకాలపు పిచ్చుక వరండా పాడు చేసినప్పుడో
పరుగు పందెంలో ఒగురుస్తూ పిల్లలు ఫోన్ చేసినప్పుడో
దశాబ్దాలుగా చేస్తున్న వంట గొప్పగా కుదిరినప్పుడో
కనాకష్టంగా బతుకుతున్న స్నేహితుల కథ తెలిసినప్పుడో
ఆమెకి……
వైఫల్యాల అంచున, వొంచుకొనే వొడి ఉన్నప్పుడో
రంగులు, వొంపులు.. వెలసి, వొంగి చిరాకు వేసినప్పుడో
తెలియని కౌగిళ్ళ కన్నా, తెలిసిన మాటలు హాయిగా ఉన్నప్పుడో
అనారోగ్యంలో, వన్నాట్ ఎయిట్ లాంటి మనిషి పక్కనున్నపుడో
అతనికి….
సగం ప్రయాణం గడిపేసామనే స్పృహ మొలుస్తుంది
రెండు అరసున్నాలు, పూర్ణం కాలేవని అర్థమవుతుంది
మళ్లీ వాళ్ళిద్దరూ “మేడ్ ఫర్ ఈచ్ అదర్” గా మిగల టానికి
దీర్ఘ రాత్రులూ, హ్రస్వ దినాలూ ముస్తాబు మొదలెడతాయి.
*
వైఫల్యాల అంచున వొంచుకునే ఒడి వున్నప్పుడు
Thank you
ఒక్కసారి అనిపిస్తుంది ,ఇంత నిజాయితీగా ఆలోచించే మనసు ఒక శాపం అని .శీర్షిక కూడా చాలా బాగుంది పద్మా .ఎప్పటిలాగే పదునైన మాటలు ,భావాలు.
అక్షర సత్యం.. నేనుకూడా చాలా సార్లు ఇదే అనుకుంటాను. నిజాయితీ గా ఆలోచించే మనసు పెద్ద శాపమే.
Heart touching poem. ఇప్పటికి ఎన్నిసార్లు చడావానో…… సమాజం లో అత్యధిక కుటుంబాలు ఇలాగే ఉన్నాయేమో అనిపిస్తుంది.