సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
15 డిసెంబర్ 2018కొత్త పుస్తకం కబుర్లు

అవును, ఆమె అస్తమించలేదు!

అరణ్య కృష్ణ
సావిత్రి ఎన్ని కవితలు రాశారని కాదు, ఆమె వొక్క కవితే చాలు. పది కాలాల కీర్తి తురాయి! సావిత్రి ఇప్పుడు మన మధ్య లేకపోయినా, ఆమె వాక్యాలు వుంటాయి. ఆ వాక్యాలను వెతికి పట్టుకొని ఈ  డిసెంబర్ ఇరవైన  మళ్ళీ మన ముందుకు తెస్తున్న అరణ్య కృష్ణతో సావిత్రి పుస్తకం “ఆమె అస్తమించలేదని…” గురించి నాలుగు మాటలు:
1. మీకు సావిత్రి గారు ఎలా పరిచయం? ఎంత పరిచయం?
నాకు సావిత్రిగారు ఆమె చివరి దశలో మాత్రమే పరిచయం.  నేను హైదరాబాద్ నుండి విశాఖకి బదిలీ మీద వెళ్ళినప్పుడు అన్నె అరుణ, కత్తి పద్మ, వశీరా వంటి మిత్రులు చెప్పారు ఆమె గురించి.  ఎవరో మిత్రుడితో కలిసి ఆమెని చూడటానికి వెళ్ళాను.  అప్పుడామె రామా టాకీస్ దగ్గర ఉమా నర్సింగ్ హోంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.  ఆమెని చూసిన క్షణమే ఖిన్నుడనయ్యాను. సన్నగా, పుల్లలా వున్నారామె.  (అప్పుడామె బరువు 24 కిలోలే).  ఒక చేతిని మరో చేతితో పట్టుకొని ఆమె ఒక పుస్తక సమీక్ష చేస్తున్నారు.  కళ్ళు సరిగ్గ కనబడవు.  చెవులు వినబడవు.  మాట నీరసంగా వున్నా ఆవిడ నవ్వు దేదీప్యమానంగా వుంది.
  నా కవితలు కొన్ని చదివారట.  “మీ కవితలు బాగుంటాయి.  కానీ మీ సహచరితో మీరెలా వుంటారో నేను చూస్తే కానీ మీరు కూడా అంత మంచి మనిషని నేననుకోలేను” అన్నారు ఆవిడ.  అప్పుడు నేను నా జీవితంలోకి ఇంకా ఒక సహచరి రాలేదని చెప్పాను.  నవ్వారు.  ఆ తరువాత ఆవిడని అతి కొద్ది సార్లే కలిసాను.  నాకావిడతో సాన్నిహిత్యం చాలా తక్కువ.  ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళ పెద్దమ్మాయి ఈవిడ సరిగ్గా మందులేసుకోవటం లేదని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది.  రెండో అమ్మాయి అలా నిస్సహాయంగా నేల చూపులు చూస్తున్నది.   ఆవిడ మాత్రం ఏం ఎరగనట్లు ఏదో పుస్తకం చదువుకుంటూ వుండిపోయారు.  ఆమెతో సాన్నిహిత్యం లేకపోయినా ఆమె మరణానంతరం సోమయాజులు, కృష్ణాబాయిగారు వంటి మిత్రులు, ఆమె పిల్లల ప్రోద్భలంతోనే “సావిత్రి” పుస్తకానికి సంపాదకత్వం వహించటానికి పూనుకున్నాను. నా పేరు వేసుకోలేదు కానీ అప్పటికే ప్రజా రచయితల సమాఖ్య తరపున బాల కార్మిక వ్యవస్థ మీద “మొగ్గ మిరుగులు”, దక్షిణాఫ్రికా  పోరాటానికి మద్దతుగా “జాతి మొత్తం బందీ అయినప్పుడు” వంటి పుస్తకాలు రావటంలో నా పూర్తి పాత్ర లేదా భాగస్వామ్యం వున్న అనుభవం వున్న కారణంగా కూడా సరేనన్నాను. 
2. “సావిత్రి” పుస్తకం కోసం మీరు చేసిన కృషి ఏమిటి?  అందులోని ఆమె సాహిత్యం అంతా అంతకు ముందే ముద్రితమా?  ఆమె రచనలు ఎలా సంపాదించారు?
ముందు కేవలం మిత్రుల రచనలతో ఒక యాభై పేజీలతో స్మృతి సంచిక మాత్రమే తేవాలనుకున్నాం.  కానీ తరువాత నా ఆలోచన మారింది.  సావిత్రిగారి రచనలు కూడా వేస్తే బాగుంటుందనుకున్నాను.  అయితే, ఆమె రచనలు ఏవీ అందుబాటులో లేవు ఒక్క “బందిపోట్లు” కవిత తప్ప.  కానీ ఆవిడ ఏదో ఒకటి రాస్తుండేవారని అందరూ అన్నారు.  ఎక్కడున్నాయి అవి మరి? అని ఆలోచించాను.  ఆమె ఖచ్చితంగా శక్తిమంతంగా రాసుంటారని అనిపించింది.  ఆమె వ్యక్తిత్వమే కాదు, ఆమె సాహిత్యాన్ని కూడా భావి తరాలకు అందించాలనిపించింది.  అందుకే పుస్తకంలో ఆమె సృజన, స్మృతి రెండూ వుండాలనుకున్నాను .
సావిత్రి గారి రచనల కోసం చాలామందిని సంప్రదించాను.  ఆమె తన రచనలను ఏ మాత్రం జాగ్రత్త చేయలేదు.  పి.రామకృష్ణా రెడ్డీ వంటి పత్రికల్లో పని చేసే మిత్రుల మీద ప్రధానంగా ఆధారపడ్డాను.  ఆమెకి ‘రేడియో సావిత్రీ అనే పేరు కూడా వున్నందున రేడియోలో పనిచేసే మధువంటి మిత్రుల్ని కూడా ఆశ్రయించాను.  సాహిత్య పేజీల్లో ప్రకటనలిచ్చాను.  ఆమె ముద్రితాల కంటే అముద్రితాల కోసమే ఎక్కువ వెతకాల్సి వచ్చింది.  పత్రికలకి పంపనివి ఆమె ఎంతో కొంత రాసుంటారు అని బలంగా అనుకున్నాను.  ఆ ఊహ నిజమైంది.  చివరికి ఒక ట్రంకు పెట్టెలో కొన్ని పుస్తకాల మధ్యలో ఆమె రచనలు కొన్ని దొరికాయని ఆమె పిల్లలు ఇచ్చారు.  కొన్ని ముద్రితాల్ని కృష్ణాబాయి గారు, రాజమండ్రి మిత్రులు ఇచ్చారు.  గౌతమి లైబ్రరీలో పనిచేసే సన్నిధానం నరసింహ శర్మగారు కూడా సహకరించారు.  ఇంక ఆమె స్మృతిలో మిత్రులు రాసినవి తీసుకున్నాను.  కేవలం ఆవిడ స్మృతి సంచిక తేవాలని మొదలెట్టి, ఆ తరువాత ఆవిడ రచనలు ఒక్కొక్కటిగా దొరుకుతున్నాక ఆవిడ రచనలే ప్రధానంగా వేయాలని అనుకున్నాం.  ఆ పుస్తకంలో మంచి చెడు అంతటికీ నాదే బాధ్యత.  ఎవరూ వేలెట్టలేదు.  సావిత్రి గారి కుటుంబానికి ఆత్మీయ మిత్రుడు, ఈ పుస్తకం రావాలని ప్రధానంగా సంకల్పించిన సోమయాజులు మాత్రం వాకబు చేస్తుండేవాడు. చివరికి ఇంతకంటే ఆమె రచనలు ఇంక దొరకవు అని నిర్ధారణకొచ్చాక, ఒక పది నెలల తరువాత ప్రింటింగ్ కి వెళ్ళాం.
  ఈ పుస్తకాన్ని ఆమెకెంతో ఇష్టమైన రాజమండ్రి సాహితీవేదిక ముఖ్య మిత్రుల సమక్షంలో ఆవిష్కరణ జరిగింది.  చేకూరి రామారావుగారు హైదరాబాద్ నుండి వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించారు.  కృష్ణాబాయి, అద్దేపల్లి రామ్మోహనరావు, సతీష్ చందర్, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ వంటి సాహితీవేత్తలు మాట్లాడారు.  చేకూరి రామారావుగారు తన ‘చేరాతలు”లో ఈ పుస్తకాన్ని సమీక్ష చేశారు.  అది చాలా గొప్ప సమీక్ష.  ఆమె సాహిత్యం లోతుల్లోకి కాదు, ఆమె హృదయ లోతుల్లోకి వెళ్లి చేసిన సమీక్ష.  దాన్నే ఇప్పటి పుస్తకానికి పీఠికగా తీసుకున్నాం.
3. సావిత్రిగారి పుస్తకాన్ని ఇప్పుడు మళ్ళీ ముద్రిస్తున్నారు కదా! మారుతున్న సమాజం నేపధ్యంలో సావిత్రి గారి రిలవెన్స్ ఇప్పుడెలా వుంటుందనుకుంటున్నారు? 
చేకూరి రామారావు గారు తన సమీక్షలో “స్త్రీ విముక్తి ధోరణి కవయిత్రుల్లో ప్రథమ గణ్యగా సాహిత్య పరిశీలకులు పరిగణిస్తున్న సావిత్రిని ఎవరూ అని ఇవాళ ఎవరు అడగరు.” అని 1992లో   అన్నారు.  కానీ ఒక పావు శతాబ్దం తరువాత పరిస్థితి చూస్తే సావిత్రిగారు ఈ తరం లోని చాలామందికి తెలియదన్న విషయం అర్ధమైంది.  చేరాగారే మరో మాట అన్నారు.  “కృష్ణశాస్త్రి గారు భారతి రజతోత్సవ సంచికలో ‘పాతికేళ్ళ తెలుగు కవిత్వం’ అనే వ్యాసం రాస్తూ గురజాడ అప్పారావుగారు మరణించిన తర్వాతనే జీవించడం ప్రారంభించారన్నారు. ఈ మాట సావిత్రికి కూడా అన్వయిస్తుంది. స్త్రీ విముక్తి ధోరణి సాహిత్యంలో సావిత్రి స్థానం ఆధునికాంధ్ర సాహిత్యంలో గురజాడ అప్పారావు గారి స్థానంతో పోల్చదగింది కావడం కూడా ఈ సందర్భంలో గుర్తురాక మానదు.” ఈ మాటలు కూడా నాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి.
మరి గురజాడ తరువాత స్థానంలో సావిత్రి గారున్నారని  చేరా అంతటి వాడన్నాక ఈ తరానికి, ముందు తరానికి సావిత్రిగారిని అందివ్వాల్సిన బాధ్యత మన మీదనే వున్నది.  లేకుంటే కెరీరిజం, కీర్తి కండూతి వున్న వారే సాహిత్యంలో జాతి ప్రతినిధులు కాగలరు.  సరే, కాసేపు సావిత్రి గారి గొప్పదనాన్ని పక్కన పెట్టి ఆలోచిద్దాం.  ఇవాళ ప్రపంచం సాంకేతికంగా చాలా మారింది.  కానీ మన సమాజంలో మనిషి మారలేదు. మానవ సంబంధాలు, ముఖ్యంగా  స్త్రీ పురుష సంబంధాల్లోని పవర్ రిలేషన్స్ ఏమీ మారలేదు.  అయితే స్త్రీల ప్రతిఘటన చైతన్యం పెరుగుతున్నది.  వారిలో స్వేచ్ఛ కాంక్ష బలీయమౌతున్నది.  ఈ సందర్భంలో సావిత్రిగారి జీవితం, సాహిత్యం స్ఫూర్త్తిదాయకంగా  పనిచేస్తుందనుకుంటున్నాను.   అందుకే ఈ పుస్తకానికి టైటిల్ కూడా “ఆమె అస్తమించలేదని…” అని పెట్టాను.  ఈ సందర్బంగా నేను ఈ పుస్తక ప్రచురణ గురించి ఆలోచన పంచుకోగానే ఒక ఐదుగురు మిత్రులు భారం పంచుకోటానికి ముందుకొచ్చారు.   వారి బేషరతు సహకారానికి నా కృతజ్ఞతలు.
*

 

అరణ్య కృష్ణ

View all posts
ఒక సంచారి కవిత్వ డైరీ!
వాన చినుకుల వెంట కొన్ని కథలు!

4 comments

Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Suseela says:
    December 19, 2018 at 7:11 am

    అరణ్యకృష్ణగారు! సావిత్రిగారు అన్న స్త్రీ శక్తిని చాలా బాగా ఆవిష్కరించారు. ఆమె రచనల పుస్తకం తీసుకురావటానికి మీరు తీసుకొన్న ఉత్సాహం శ్లాఘనీయం! పుస్తకం చదవాలి ! ఎలా తెలుపండి దయచేసి. అభినందనలు!

    Reply
    • aranya krishna says:
      December 19, 2018 at 8:49 am

      It will be released tomorrow andi. Please contact me in box of facebook.

      Reply
  • rani siva sankara sarma says:
    December 22, 2018 at 7:12 am

    సావిత్రి గారి గురించి మరోసారి పుస్తకం తేవడం ముదావహం

    Reply
    • aranya krishna says:
      December 24, 2018 at 12:06 am

      Thanks sir! Your article is there in the book.

      Reply

You may also like

థాంక్యూ…తాతా…

పెద్దన్న

నేను చేసే తప్పులు

అరిపిరాల సత్యప్రసాద్

రావడానికి మనిషీ, వెళ్లడానికి ఊరూ

కె. శ్రీనివాస్

సామాజిక చలనాలు తెలిసిన బుద్ధిజీవి

అరసవిల్లి కృష్ణ

నౌకారంగ ప్రవేశం

ఉణుదుర్తి సుధాకర్

ఆమెది ముమ్మాటికీ బరిని తెగదెంచిన పద్యమే

శ్రీరామ్ పుప్పాల

నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరి

కృష్ణుడు
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు

  • Jilukara Srinivas on రావడానికి మనిషీ, వెళ్లడానికి ఊరూLoved it. But village is a prison house for...
  • Chandrasekhar on నేను చేసే తప్పులుచక్కగా వివరిస్తున్నారు. తరువాతి భాగాలకోసం ఎదురు చూస్తున్నా.
  • Jeevan Kumar on రావడానికి మనిషీ, వెళ్లడానికి ఊరూమీ బాల్య అనుభవాలు అందర్నీ మన చిన్న తనం లోకి తీసుకెళ్లుతాయి....
  • రహీమొద్దీన్ on తగుళ్ళ గోపాల్ కవితలు రెండుకవితలు చాలా బాగున్నాయి. అభినందనలు గోపాల్
  • స్కై on చదువు అంటే ఇరుకు గది కాదుThank You Brain Dead! & Afsar ji🌿 అడిగిన వాళ్లకు...
  • Sanjay Khan on రావడానికి మనిషీ, వెళ్లడానికి ఊరూచాలా మంచి వ్యాసం సార్ . నోస్టాల్జియా అంటారే అలాంటిదొక సన్నని...
  • Krishnudu on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరిధన్యవాదాలు సార్! ఏల్చూరి వారు ఒక విజ్ఞానసర్వస్వం!
  • Krishnudu on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరిధన్యోస్మి సార్! మీ ప్రోత్సాహం నాలో పండితుల రచనల అధ్యయనానికి మరింత...
  • chelamallu giriprasad on రావడానికి మనిషీ, వెళ్లడానికి ఊరూ1975 వరకు పుట్టిన వారి జ్ఞాపకాలు ఇవి 1990 తరువాత పుట్టిన...
  • శీలా సుభద్రాదేవి on శీలావీ చెక్కిన శిలాక్షరాలుశీలాక్షరాలు సంకలనం గురించి సవివరంగా చక్కటి సమీక్ష చేసిన ఎమ్వీరామిరెడ్డిగారికీ, ప్రచురించిన...
  • sangishetty srinivas on విస్మృత అవధూత అన్నయసార్ ఈయన శిష్యులు కడప జిల్లాకు చెందిన హుసేన్ దాసు కూడా...
  • కవితా ప్రసాద్ on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరిఏల్చూరి వారి పాండితీ ప్రకర్ష అనుపమానమైనది. ఈ కృతి అనేక PhD...
  • రాజారామ్ తూముచర్ల on విస్మృత అవధూత అన్నయమంచి పరిశోధనాత్మక వ్యాసం. అన్నావధూత గారి గురించిన వివరాలు, ఆ అవధూత...
  • పెమ్మరాజువిజయ రామచంద్ర on తగుళ్ళ గోపాల్ కవితలు రెండుఅద్భుతమైన కవితలు. రెండు కవితలు రెండు కళ్ళలోకి తడిని చేర్చాయి. తడిమి...
  • Padmanabha Rao Revuru on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరిExcellent review by a great scholar Krishna Rao Muralidhar...
  • Shaik Mahaboob on అమ్మి జాన్ కి దువాHi Sanjay sir , It's Morbulas – Ammi Jaan...
  • దాసరాజు రామారావు on తగుళ్ళ గోపాల్ కవితలు రెండుమొదటి కవిత చాలా బాగుంది. ధ్వనిగర్భతంగా వుంది. నిర్మాణ కౌశలం ఆకట్టుకుంది....
  • కృష్ణుడు on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరిధన్యవాదాలు సుశీలమ్మ గారూ!
  • Anil అట్లూరి on నౌకారంగ ప్రవేశం... అది కాదు కాని ఆ వయసులో కొత్త ప్రదేశాలలో, కొత్త...
  • Suseelamma on నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరిఆనాటి సభా విశేషాలు, నయాగరా కవులు, శ్రీ మురళీధరరావు గారి పాండిత్య...
  • Shaik. Afroz on అమ్మి జాన్ కి దువాహలో నా చెడ్డీ దోస్తు.. సంజయ్ ఖాన్.. అమీ జాన్ కి...
  • Undurty Prasad on నౌకారంగ ప్రవేశంమన నిజ జీవితంలో జరిగే అనేక అనుభవాలు, అంశాలు గుర్తు చేసుకుంటూ...
  • Sujatha on Translating Endapalli BharathiWow, amazing.
  • netaji nagesh on నౌకారంగ ప్రవేశంచాలా బాగుంది సార్
  • chelamallu giriprasad on అడివి కంటి ఎర్ర జీరకాళ్ళ కింద పచ్చిగా పారుతున్న మీ నెత్తురు
  • chelamallu giriprasad on నౌకారంగ ప్రవేశంగత జ్ఞాపకాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం
  • m.v.kameswrrao raju on కరాచీ తీరంలో సంక్షోభంచాలా ఆసక్తికరంగా వుంది సార్..
  • Prasad suri on నౌకారంగ ప్రవేశంఅద్భుతం. నాలాంటి వాళ్లకి విందు భోజనం
  • పోరాల శారద on అమ్మి జాన్ కి దువానమస్తే సంజయ్ గారూ.... ఇది కథ కాదు కాబట్టి అక్కడి వేడి...
  • VANDANAM MADDU on  ఆఖరి అన్యుడి చావుమనం మరచిన పదాలు భలే వడ్డించాడు (రూ) మనోడు అయినా అన్యుడు......
  • D Susanna Kumar on  ఆఖరి అన్యుడి చావుమీ మాటలు హృదయాన్ని తాకాయి. మీరు పంపిన కవితాత్మక వాక్యాలు ఎంతో...
  • Devarakonda Subrahmanyam on స్వేచ్ఛను మళ్ళీ చంపేశారు!"క్షమించు స్వేచ్ఛ! నీ దుఃఖాన్ని ఇంత మందికి ఇలా పంచే బదులు...
  • సురేష్ రావి on బివివి ప్రసాద్ కవితలు రెండు"కనులు తెరిచినప్పుడు ఇవాళైనా ప్రేమలోకి తెరుచుకుంటానా..." ఎంత బావుందో ఈ ఆలోచన......
  • సురేష్ రావి on గోడల్లేని గ్లోబల్ విలేజ్ కావాలిమీరొక సాహితీ విమర్శకులు కూడా. ప్రస్తుత కాలంలో విమర్శని ఒక పాజిటివ్...
  • కోవెల సంతోష్ కుమార్ on తెలంగాణ గీతంలో భాష ఎవరిది? భావం ఎవరిది??ఒక సామాజిక వర్గాన్ని అదే పనిగా నిందించడం, దేశంలోని అన్ని భాషలను...
  • కంబాలపల్లి on కలల నిర్మాణ కార్మికుడు రహీముద్దీన్ఓ మంచి మానవతా ధృక్పథం ఉన్న కవితా సంపుటి అన్న శుభాకాంక్షలు...
  • THIRUPALU P on  ఆఖరి అన్యుడి చావువాస్తవ జీవిత చిత్రీకరణ, దళిత వాతావరణం.. చాలా బాగుంది.
  • Anil అట్లూరి on కరాచీ తీరంలో సంక్షోభంఇలాంటి నిజ జీవిత అనుభవాలు, కథనాలే చరిత్రకి మరింత సార్థకతను, సజీవత్వాన్ని...
  • hari venkata ramana on గోడల్లేని గ్లోబల్ విలేజ్ కావాలిఇంటర్వ్యూ ఫిలసాఫికల్ గా చక్కని భావుకతతో వుంది. నాదొక ప్రశ్న. అవును...
  • Amar Veluri on Glimpses of My Village.. Echoes of TraditionThanks Arun
  • Amar Veluri on Glimpses of My Village.. Echoes of TraditionThanks Sridhar!
  • Amar Veluri on Glimpses of My Village.. Echoes of TraditionThanks buddy!
  • మంచికంటి on బివివి ప్రసాద్ కవితలు రెండుకవితలు బావున్నాయి చాలా సరళంగా
  • మంచికంటి on  ఆఖరి అన్యుడి చావునవలగా రాయాల్సినంత సబ్జెక్ట్ కథగా మలిచారు కథ చాలా తాత్వికంగా ఉంది...
  • BVV Prasad on కరాచీ తీరంలో సంక్షోభంఆద్యంతం ఆసక్తిదాయకంగా రాసారు. బావుంది.
  • Bollina Veera Venkata Prasad on బివివి ప్రసాద్ కవితలు రెండుధన్యవాదాలు 🙏
  • Tamraparni Harikrishna on  ఆఖరి అన్యుడి చావుకథ ఆసాంతం ఆసక్తిదాయకంగా ఉంది పాత్రల చిత్రణ రచయిత దృక్కోణంలోంచి కనబడింది...
  • హుమాయున్ సంఘీర్ on  ఆఖరి అన్యుడి చావుకథ చాలా బాగుంది. వాస్తవాలు కళ్లకు కట్టేలా రాశారు. మతాలు కాదు...
  • attada appalanaidu on  ఆఖరి అన్యుడి చావుచాలా బాగుంది కథ.మత విశ్వాసాల కంటే,చదువు ఇచ్చే విగ్యానమ్ జీవితాలను సఫలం...
  • Jeevan on  ఆఖరి అన్యుడి చావుఇక్కడ మీరు ఏ మతాన్ని సమర్దించలేదు, కానీ క్రైస్తవం కి అన్యుడు...

సారంగ సారథులు

అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు.

Subscribe with Email

రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

How to submit English articles

How to Submit

ఆడియో/ వీడియోలకు స్వాగతం!

సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

Indian Literature in Translation

Indian Literature in Translation

Copyright © Saaranga Books.

  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు