అనంతం ‘బందీ’

దేశం నడిబొడ్డున,
నిశ్శబ్దపు చీకటి పడగనీడలో
అతన్ని బంధించి,
చుట్టూ  మృత్యువు కోరల
ఊచలు నాటారు.

కన్నుపొడిచినా వినబడని
నల్లని వెలుతురు పొగల మధ్య,
అతని చిరునవ్వుని
అదృశ్యం చేయాలని కుట్ర.

చావుపొగ దట్టంగా వ్యాపించిన
కాషాయ రాజ్యపు కర్కశ కోటల్లో,
అతని శరీరాన్ని
శిథిలం చేయాలనే కక్ష.

సమూహం నుండి అదృశ్యం చేసి,
సంభాషణలని గొంతునులిమి
రాతలనీ అక్షరాలనీ చెరిపేసి
అతన్నుండి‌ భాషను
దొంగిలించాలని కౌటిల్యం.

వేనవేల ప్రశ్నలుగా మొలకెత్తి,
అనేకానేక ఆకారాలుగా
విడిపోతూ కలుస్తున్న సామూహిక ధిక్కారం
అతడు.
అనంతాన్ని ‘బంధించిన’
ఇరుకైన ఊచల మధ్య
పిడికెడు ఆకాశాన్ని,
దోసిలినిండా సముద్రాన్ని నింపాడు.
శిథిల  గోడలకు మేఘాల్ని
అలంకరించాడు.

జైలు ఇరుకైన మూలల్లో నిలబడి
ప్రపంచానికి విశాలమైన తీరాల్నిచ్చాడు.
సామూహిక ఖననాలతో కిక్కిరిసిన
దేశం శ్మశానానికి
పూలతోటలనిచ్చాడు.

సుదీర్ఘ ప్రయాణం లో నెత్తురోడుతున్న
పాదముద్రలతో నిండిన
రహదార్లు
అతని నుదిటిపై రేఖలు.

ఛిద్రమౌతున్న లేత చిగుళ్లను,
తెగిపోతున్న పూలరేకులని,
రాలి  చెల్లా చెదురౌతున్న పక్షిగూళ్ళనూ
అతిమృదువుగా అక్కున చేర్చుకున్న
నులివెచ్చటి సెలయేరు
అతడు.

దాహం తో యెండిపోయిన దేశం గొంతులోకి
అంతులేని కావ్యమై ప్రవహించే
నిత్యయవ్వన కవి.

*

నారాయణ స్వామి వెంకట యోగి

15 comments

Leave a Reply to Giriprasad Chelamallu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిత్య యవ్వన కవి
    నిండు ఆయుస్సు తో బైటపడాలని
    కాషాయ రాజ్య కర్కశపు కోటలో

    • కాషాయ కర్కశ కోట ఖైదు నుండి నిత్యయవ్వనంగా బయటకి రావాలని గాఢమైన ఆకాంక్ష తో నెనర్లు

    • కాషాయ కర్కశ కోట ఖైదు నుండి నిత్యయవ్వనంగా అంతులేని కావ్యమై ప్రవహించాలనే గాఢమైన ఆకాంక్ష తో నెనర్లు

  • దాహం తో యెండిపోయిన దేశం గొంతులోకి
    అంతులేని కావ్యమై ప్రవహించే
    నిత్యయవ్వన కవి….

    చాలా బాగుంది స్వామి నీ కవితా….నిత్య యవ్వన కవి వి.వి…..

    • నెనర్లు శ్రీనూ – కాషాయ కర్కశ కోట ఖైదు నుండి నిత్యయవ్వనంగా అంతులేని కావ్యమై ప్రవహించాలనే గాఢమైన ఆకాంక్ష తో

  • శిధిలం చేయాలనే కక్ష తో కూడిన నీచత్వం

  • చాలా బాగా రాసావు మిత్రమా. “దాహం తో యెండిపోయిన దేశం గొంతులోకి
    అంతులేని కావ్యమై ప్రవహించే
    నిత్యయవ్వన కవి.” నిజంగా నిత్యయవ్వన కవి

  • సుదీర్ఘ ప్రయాణం లో నెత్తురోడుతున్న
    పాదముద్రలతో నిండిన
    రహదార్లు
    అతని నుదిటిపై రేఖలు…

    బలమైన కవిత స్వామీ!

    సముద్రం కవి, సముద్రం లాంటి కవి కోసం..

    Tomorrow we’ll swim again
    Tomorrow we’ll travel more
    Tomorrow the dawn will ask for our endurance
    And we’ll respond to the sea
    – Yannis Ritsos

    • కిరణ్ – సార్ మళ్ళీ బయటకి రావాలని ఆయన స్వరం వినాలని, ఆయన చిరునవ్వు వెలగాలని ప్రగాఢమైన కోర్కె

  • దాహపు దేశం గొంతులో… కావ్య ప్రవాహం.. వి.వి…
    అవును…ఆర్చుకు పోతున్న గుండెల్లో… అతని కవిత…మాట…తడిని నింపుతాయి…
    బాగుంది స్వామి గారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు