మారేడ్పల్లి బుద్ధ

అతని పేరు శైలేందర్.మూడు వేల కుటుంబాలకి కడుపులు నింపిన సేవేందర్.

దారస్వభావం,సాయంచేసే గుణం,సేవాభావం, మానవత్వం,ఇవి అంతరించిపోతున్న పదాలని బాషాశాస్త్రవేత్తలు చెప్తున్న మాట.నిజమేనేమో?కాదేమో?అవునేమో?దీనికి కాలమే జడ్జ్.ఆకలో తత్వశాస్త్రం.కడుపొక కావ్యం.కన్నీళ్ళు ఇతిహాసాలు.

ఆకలికి వయస్సు, దుఃఖానికి కొలత, బాధకి జాగ్రఫీ ఉంటుందా?”పుడుతున్నారు,పెరుగుతున్నారు, చదువుతున్నారు,ఉద్యోగిస్తున్నారు,పెళ్లిచేసుకుంటున్నారు, వాళ్ళకీ పిల్లలు పుడుతున్నారు, పెరుగుతున్నారు,

చదువుతున్నారు,ఉద్యోగిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు,వాళ్ళకీ పిల్లలు….ఓహ్ ఏం పునరుక్తి వైభవం”!ఇదీ మన మీద కవి త్రిపురనేని శ్రీనివాస్ గారి కామెంట్.ఇంతేనా?ఇంకేమీ లేదా?మరేమీ ఉండదా?పుట్టింది చచ్చేందుకేనా?ఏమో?కొందరికి ఇది వర్తించదేమో?ఇతరుడి కోసం బతికే కొందరికి ఈసూత్రం నప్పదేమో?ఇది చదివి మీరే చెప్పండి.

మీరెప్పుడోకప్పుడు ఏదోపనిమీద సరదాకోసమో  చదువుకోసమో మరేదో పనిమీదనో  హైద్రాబాద్ వొచ్చేవుంటారు.లేదా రావాలని అనుకుంటూ వుంటారు.మహానగరంలో మిమ్మల్ని మరిపించే మెప్పించే అందాలెన్నో ఆకర్షణలెన్నో ఉంటాయి.

చార్మినార్ చూస్తారు మీరక్కడ.లుంబిని పార్కులోకి పోయి బోటు ఎక్కుతారు.హుస్సేన్ సాగర్లో బుద్దుడ్ని  తెలుసుకోజూస్తారు.బిర్యానీ తింటారు.తందూరి చికెన్ తిని కిళ్లీ కూడా నములుతారు.జూపార్కుకో బిర్లామందిర్కో పోతారు.ప్రవహిస్తున్న జనాన్ని చూస్తారు జిగేలుమనే కాంతుల నడుమ నడుస్తారు.ఎవడికి ఎవడితోనూ సంబంధం లేకుండా దూసుకుపోయే మనుషులు మీకు తగుల్తారు.ఇంకా ఏవేవో ఏమేమిటో చేస్తారు.చేయాలనుకుంటారు.చూస్తారు.చూడాలనుకుంటారు.భౌతికమైన అందాల్ని చూసి సంతోషిస్తారు.

సెల్ఫీలు దిగితారు.వాటిని మీ మిత్రబృందానికి షేర్ చేస్తారు. స్టేటస్ గా అప్డేట్ చేస్తారు.ఇంకా మీమీ ఫేస్బుక్ వాల్స్ మీద ప్రొఫైల్ ఫిక్స్ తో హల్చల్ చేస్తారు.సరే,బానే ఉంది.ఈసారి మీరు హైద్రాబాద్ వొచ్చినప్పుడు మాత్రం వెస్టుమారేడ్పల్లికి రండి.అక్కడేముంది అనేగా మీ సందేహం.అక్కడ కూడా ఒక బుద్ధుడు ఉన్నాడు.కానీ లుంబిని పార్కుహే లేదు.ఒక మానవుడు ఉన్నాడు అక్కడ.నడుములు ఒంగి కఱ్ఱచేతబట్టుకొని నడవడానికి కూడా కాళ్ళురాని ముసలి దాని జీవిత అనుభవంలా,బతుకు దారిన నడిచి నడిచి దారి గుండెని చేతబట్టుకొని నిలబడ్డ కూలివాడి తువ్వాలా సువాసనలా,మట్టిని బట్టి గింజను పిండి పిడికెళ్లతో అన్నం ముద్ద పెట్టె రైతు హృదయంలా,అక్కడ ఒక మనిషున్నాడు.మానవుడున్నాడు .

అతనెలా ఉంటాడనేగా మీ డౌట్. అతను నీలా నాలానే ఉంటాడు.సాదాగా ఉంటాడు.నిబ్బరంగా ఉంటాడు.తక్కువ మాట్లాడుతూ ఎక్కువ నిశ్శబ్దంగా ఉంటాడు.సన్నగా కరెంటు స్థంభం మీద పిట్టలువాలి ఎగిరినట్టు నవ్వుతాడు.బోధివృక్షం కింద బుద్దుడు కళ్ళుమూసుకున్నట్టు అతనూ కళ్ళు మూసి మనసుని తెరుస్తాడు.మీరు అతడ్ని కలిసేలోపు అతను పక్షులకు గింజలు వేస్తూనే పిల్లలకు లెక్కలు బొదిస్తూనో ఆకాశం వంక చూస్తూ ఆలోచిస్తూనే ఉంటాడు.అతని నాడికణం జాలిని చిమ్ముతుంది.అతడి కళ్ళు కరుణని కురిపిస్తాయి.ఇంకా అతడికి పక్షుల రెక్కలున్నాయి.

పిట్టల మౌనం ఉంది.అతను లెక్కలు మాస్టారు.మైనస్లో తీసే గుణంకంటే ప్లస్లో ఇచ్చేగుణమే ఎక్కువ.ఇవ్వటం అతని నైజం.జీవిత గుణం.తక్కువ హాని ఎక్కువ మేలు చేసే మనిషి.అతడ్ని చూడాలని ఉందా?అవసరం లేదేమో?అతనంటే అతని శరీరం కాదు అతనoటే అతని ఆత్మే.అసలు ఎవరికయినా వారిదయిన ఆత్మ ఉండాలేమో.

ఎన్నాళ్ళని ఒట్టి దేహంతో తిరుగుతాం ఆత్మ లేకుండా. భూమ్మీద సంచరించే ఎవడైనా వాడంటే వాడి ఆత్మే.మిగతాది అంతా ఒట్టి countless శేషమే.ఐతే ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అనేగా మీ కోపం. కోప్పడకండి! మిత్రులారా! కొద్దిగా ఆలకించండి.

నేను ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాను.మీరు ఆర్డర్ చేస్తే అన్ని మీకు దొరకొచ్చు.సెల్ పోను తీస్తే కోరుకున్నది చూడొచ్చు వినొచ్చు చేయొచ్చు.ఒక్క మనిషితప్ప మీరేమనుకుంటే అది మీకు దొరకొచ్చు.తనగురించి తను ఆలోచించుకునే మనిషి కాకుండా ఇతరుల గురించి ఆలోచించే మనిషి గురించి నేను మాట్లాడుతున్నాను.డైనోసర్లా మనిషికూడా అంతరించి పోతున్నాడని పెన్నులు పిసుక్కునే మనకు ఎక్కడో ఒకచోట ఒకరో ఇద్దరో బ్లాక్షిప్లా అప్పుడప్పుడూ మనుషులు తగులుతారు. వాళ్ళని గుర్తించాలి.

గుర్తుంచుకోవాలి.తెలుసుకోవాలి.తెలియజెప్పాలి.బతకడం అంటే ఏంటో,నలుగురికి సాయపడుతూ జీవించటమంటే ఏంటో చూడాలి.చూపించాలి.కరోనా తెలుసుగా..అది సృష్టించిన మరణాల సునామీ గుర్తుందిగా..అదిగో అటువంటి దిగ్భ్రాంతి సమయాసమయాన దుఃఖభీతి కాలాన,ఎవరికి ఎవరు ఆసటగా అండగా నిలబడలేని స్థితి దాపురించిన సందర్భాన,ఇతను ఏంచేశాడో తెలుసా..వీధివీధికి తిరిగి ఆకలి కడుపుల్ని ఆలకించి అన్నం మెతుకుల్ని కడుపులో పెట్టాడు.బస్తీబస్తీకి తిరిగి కన్నీళ్ళని చూసి కరిగిపోయి కరుణ కళ్ళతో భరోసా చూపుని ఇచ్చాడు.నేనున్నాను అన్నాడు.నేనుంటాను అన్నాడు.రాని రాని వొస్తే రాని కష్టాల్ నష్టాల్ అని శ్రీశ్రీ అన్నాడే అట్టానే పొతేపోనీ ఐతే అవని ఇంకొంత అప్పవుతుంది అన్నాడు.నాకు రెక్కలున్నాయిగా మళ్ళీ సంపాదిస్తా అన్నాడు.లక్షలు పెట్టి ఇతను బియ్యాన్ని కొనలేదు.ఆకలిని కొన్నాడు.కడుపుల్ని నింపాడు.

ఒకరోజుకు ఒకపూటకు ఒక్కడికి ఆకలి తీర్చడం జీవిత విజయమన్నాడు. బతికుండటం అంటే బతికించడమే అన్నాడు. తినటం కంటే పెట్టడమే హాయి అన్నాడు. కడుపు నిoపుకోవడం కన్నా మనసు నిండటమే గొప్ప అన్నాడు. ఉల్లిగడ్డలు పచ్చళ్ళు ఇచ్చాడు.నూనెప్యాకెట్లు బియ్యం పంచాడు. ఆత్మీయ హస్తం అయ్యాడు.ఇంతకీ అతని పేరు ఎంటనేగా?

అతని పేరు శైలేందర్.మూడు వేల కుటుంబాకి కడుపులు నింపిన సేవేందర్. మీ బాట ఆదర్శనీయం.

మీసేవ ప్రశంసనీయం మనుషులున్నారని,సాటివారి బాధకు దుఃఖానికి కరిగే ఉదారులు ఉన్నారని మిమ్ముల్ని చూసాకే ఒక భరోస కలిగింది.ఎన్ని తుఫాన్లు ఒచ్చిచేరినా,ఎన్నెన్ని భూకంపాలు చుట్టుముట్టినా, మరెన్ని గాలివానలు ముంచితీసినా మిరిలానే ఉండాలి. ఉంటారు కదూ..?

*

Avatar

పెద్దన్న

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • Very nice sir..nijamga shylender sir lanti vallu erojulo kanipinchadam chala thakkuva..sir lanti manasu,manchitanam,manavathvam, udaraswabhavam andariki undav…..he is a unique personality….sahayam cheyyalani andariki anipistundi kani nijamga heartfulga ..elanti prathi phalam ashinchakunda sahayam chese manasi ,mahanubhavudu shylender sir matrame…ur also great sir..sir gurinchi intha closega observe chesi rasinanduku…

  • మీ పదజాలం మీభావానికి apt గా మెరుగవుతుంది…రచనా సామర్ధ్యం పెరుగుతుంది…tq.. రోజానా గారు

 • Yes,He is The legend, The Man of masses.
  Andharee kee help chayadam gopa kadu ,avasarmunu varee kee help chayadam gopaa. In these format shylender sir rank is first. Really I feel proud that Iam associated with such a great personality

 • చేయగలిగిన సామర్థ్యంతో పాటు..చేయటానికి కావాల్చిన సానుభూతి కూడా ఉండాలి..tq

 • ఇటీవల చూశాను ఓ వలస కార్మికుడికేమో రెండు అరటిపండ్లను ఐదారుగురు కలిసి అందిస్తూ నిర్లజ్జగా ఫోటోకి ఫోజిచ్చారు. ప్రకృతి మొత్తాన్ని సక్రమంగా నిర్వహిస్తున్న పంచభూతాలు ఏనాడైనా ప్రత్యేకమైన పేర్లూ, గుర్తింపులూ కోరుకొంటున్నాయా..? మనుషులు తమను కలుషితం చేస్తున్నా కూడా ఉపకార బుద్ధినే చూపుతాయవి.. అప్పు చేసి మరీ అంతమంది ఆకలి తీర్చిన శైలేందర్ గారు అటువంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగినవారు. అటువంటి వారి గురించి హృద్యంగా వివరించారు పెద్దన్న. salute to silender sir.

 • It’s always been overwhelming when we hear about you and the inspiration you are to the people around….I as an individual was always inspired by your compassion, knowledge and above all your humanity& sense of responsibility towards the society and the needy…the thing that never ceases to leave me awestruck is “how” you manage doing it all with such a grace and charisma..There are innumerable examples I can quote for your exceptional qualities you posses and your utmost simplicity when extending help, service,…. we can term it many but am sure you will just call them all your RESPONSIBILITY ..you WERE, ARE & WILL ALWAYS be an inspiration to many…. I can endlessly write more about your generosity and simplicity…. it gives an immense pleasure to say that we are associated to you… you nurtured us with values and principles of life and the happiness experienced when you give out to the needy….. We would pray that god give you more opportunities and good health so that you continue to do the best and inspire us to do so….. hearty congratulations sir…. hats off to your dedication…. Kind Regards, C R Shalini 🙏🏻🙏🏻

 • Chalani chirugali Sakshi Ga,
  Vechani suryakiranala Sakshi Ga,
  Thelani vennala Sakshi Ga,
  Meru lekunte Memu lemu.
  Ahsalu ….. Na jevithanike ardam a ledu.
  🙏 Me lanti varu dorakadam ma adurstam sir. 🙏

 • Sir first i thank you for this excellent explanation of my brother,
  Sir May god bless you and i wish that you must come accross such precious diamonds like shylender garu so that you can show them under a flash light by whole world will come to know.

 • Nenu hyd వచ్చినపుడు ఒక ఆలోచన ఉండేది పట్నం లో అందరూ కలుషితం ఉంటారని. ఇక్కడా కలుషితం అంటే ఎవరుకు వారే యమునా తీరే. అని అర్థం. అలాంటి కలుషిత మైన సమాజం లో ఒక మంచి మనిషి కనిపించాడు.అతను ఎలా ఉన్నడాంటే బురద నీటిలో తామర పుష్పం లా, ఎడారిలో ఒయాసిస్ లా,ఆకలి తో అలమటించే వారికి అన్నపూర్ణ లా కనిపించాడు. ఆయనే మన సేవేందర్ గారు. నాలంటి వారికి స్ఫూర్తి ప్రదాతగా కాలం లో నిలిచిపోతారు. ఒక మంచి పనిని అభినందిస్తూ వ్రాసిన పెద్దన్న గారికి అభినందనలు. Sylendar
  గారు సమాజం చాలా పెద్దది. దీనిలో మంచి చేదు అనుభవాలు ఉంటాయి. మీరు చేసేది మంచిపని ఎవరు ఏమనుకున్నా దాన్ని konasaginchdi. దాని ఫలితం తపకుంద ఏదో ఒకరోజు వస్తుంది. మీకు ఉన్న మంచి మనసుకోసం నేను చాలా సంతోషిస్తున్నాను. Elanti మషులు కూడా పట్నం లో ఉంటారు అని నాకు మిమల్ని మీ స్టాఫ్ ని చూసాకా అర్థం అయింది. Tq

 • Sailender garu oka nadiche Maha vruksham aa kalpavruksham kinda
  enno jeevarasulu seda teerutayi
  Aa Maha vruksham aadharamga enno pakshulu gudu kattukuntayi
  Ala naa jeevitam lo nenu vari needalo gudu kattukovadam nerchukunnanu
  naa lanti endaro aayanaku runa padi vunnam

  SAILENDER SIR KU MANASPURTHIGA NAA NAMASKARAM

 • అన్నార్థుల ఆకలి తీర్చే లెక్కల మాష్టారు “మారేడ్ పల్లి బుద్ద” శ్రీ శైలేందర్ గారి గురించి సమాజానికి బహు చక్కగా పరిచయం చేసిన రచయిత శ్రీ మారాబత్తుల పెద్దన్న గారు అభినందనీయులు!!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు