బహుజన సాహిత్య జాతర

హుజన, బహుజన మద్ధతుదారులైన మిత్రులారా..!
ఈ ఆదివారం మీ విలువైన సమయాన్ని రాజ్యాంగ పరిరక్షణ కోసం కేటాయించండి.

కాళ్ల కింది నేలను కబలించేవేళ కవులు రచయితలు తమ బాధ్యతను నెరవేర్చాలి.
వేరు నుండి చెట్టును వేరుచేసే కుట్రలు పార్లమెంటు సాక్షిగానే సాగుతున్నాయి.  అప్రకటిత ఎమర్జెన్సీ వచ్చింది. రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాస్తూ రాజ్యాంగాన్ని అభాసుపాలు చేస్తున్నారు.
కోట్లాది మంది ప్రజలను కోర్టు బోనులో నిలబెట్టే కుట్ర చేస్తున్నారు.
ఒక్కోసారి ఎన్నికల్లో గెలవడానికి రాముణ్ణి, అయోధ్యను వాడుకున్న
ఈ మతతత్వ పాలకులు, ఈసారి ఏకంగా రాజ్యాంగంలో ఒక్కో పేజీని చించేస్తూ, రాజ్యాంగం ఊపిరిని తీసేసి మనుస్మ్రుతికి పట్టం కడుతున్నారు. మళ్లీ దళితుల మూతికి ముంత, నడుముకు తాటాకు కట్టి వారి సకల హక్కులను నిర్వీర్యం చేసేందుకు పావులు కదుపుతున్నారు.

ఇవ్వాళ బ్రాహ్మణీయ, మనువాద, ఆధిపత్య భావజాలాలవాండ్లు దేశాన్ని కాషాయీకరిస్తున్నరు. అందులో భాగంగానే బహుజనుల వోట్లకు ఎసరు తీసుకొచ్చే ఉద్దేశంతో పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చిండ్రు.

సి ఎ ఎ పేరిట హిందూత్వ వ్యతిరేకుల్ని సందేహాస్పద పౌరులుగా గుర్తించనున్నారు. వీరికి ఓటు హక్కుండదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలేవి వర్తించవు. అంతెందుకు బ్యాంక్ అకౌంట్ని సీజ్ జేస్తరు.

అలాంటివారు పౌరసత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వొస్తది. సహజంగా దక్కాల్సిన దానికి కొట్లాడాల్సిన దుస్థితి. కోట్లాదిమందికి తమకు సంబంధించిన పూర్తి సమాచారమే వారి దగ్గర లేదు. ఉన్నా కరెక్ట్ గా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వారి తల్లిదండ్రుల డేటాఫ్ బర్త్ వివరాలు ఇవ్వాలంటే సాధ్యమయ్యే పనేనా? తాతముత్తాతల ఆస్తిపత్రాలు, డాక్యుమెంటేషన్ ఆధారాలు తీసుకురమ్మంటే బహుజనులు ఎక్కడి నుండి తెచ్చిస్తారు ?

అక్షరాలా 21 సర్టిఫికెట్లలో ఏ ఒక్కటి లేకున్నా జైళ్లకు పోవాలట. ఇదెక్కడి దుర్మార్గం. అసలు ఈ పౌరసత్వం లొల్లి ఎందుకు అంటే అక్రమంగా వలసొచ్చిన వారిని పట్టుకునేందుకట. కొండను తవ్వి ఎలుకను పట్టడం అంటే ఇదే.
ఇంతకు ముందు కూడా ఇలాగే నల్లధనం పట్టిస్తానని ఘనత వహించిన మోడీగారు రాత్రికి రాత్రే నోట్లు రద్దు చేస్తే కోట్లాది మంది పేద బీద జనాలు రోడ్ల మీద పడి తమ డబ్బులు తాము తీసుకునేందుకు తంటాలు పడ్డారు. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం పేరుతో చేస్తున్న సీఏఏ, ఎన్సారీ మనల బహుజనుల బతుకును డిటెన్షన్ క్యాంపుల పాలు చేయజూస్తున్నరు.

అసలు మనువాదుల ఉద్దేశం డిటెన్షన్ క్యాంప్లో బహుజనులను ఎంగేజ్ చేసినట్లయితే, ప్రశ్నించేవారిని కట్టడి చేయడం. ఇదే వారి పన్నాగం. అందుకే ఎన్నార్సీ, పౌరసత్వ హరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సందర్భమిది. బహుజనులంతా మొద్దు నిద్ర పోతూ ఇదేదో ముస్లిములకు సంబంధించిది అని అనుకుంటే… చూస్తుండగానే పరిస్థితి చేజారి పోతుంది.

అందుకే గొంతువిప్పుదాం. దేశ వ్యాప్తంగా జరిగే శాంతియుత, రాజ్యాంగ బద్ధ ఉద్యమంలో భాగస్వాములం అవుదాం. ఇందులో భాగంగా బహుజన కవులు, రచయితలుగా మేం బహుజన సాహిత్య జాతరను నిర్వహిస్తున్నాం. కరపత్రంలో పేర్లున్నవారే కాదు, సమయం ఉంటే, ప్రతీ ఒక్క బహుజనులు తమ రచనను, ఆలోచనను పంచుకోవడానికి బహుజన జాతర కార్యక్రమానికి తరలిరండి.  గొంతు కలపండి. ఈ చారిత్రాత్మకమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ ఆదివారం ఉస్మానియాలో సహజ పౌరసత్వ వ్యతిరేక చట్టాలకు నినదిద్దాం రండి..

-డా.పసునూరి రవీందర్, సంగిశెట్టి శ్రీనివాస్

పసునూరి రవీందర్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇప్పుడు మౌనం కూడా నేరమే.
    చరిత్ర క్షమించని నేరం.
    ముఖ్యంగా సాహితివేత్తలకు మరింత బాధ్యత ఉంది.
    మరణం లాంటి మౌనాన్ని వీడి
    సజీవులుగా మాట్లాడండి.
    మాట్లాడుతూనే ఉండండి.

  • manchiga rasinaru jai bahujana sahityam jai jai bahujana poralu ennikalallo nilabadataniki e sahityanni rasevaru mundukosthe bagutadani na abiprayam ennikalappudu sailent ga undi ennikalaipoyaka bahujana vadam meda rasudu modalu vedtharu…konchem alochinchandi annadammullara akka chellellara rathalathone marpuradu chethalatho ekkuva marpu thevacchu manm yoddham chesedi rajyam meda rajyangam meda a rajjangamunu nadipinche nayakatwam poltical power is the astar kye sadhinchadaniki andaram ekamainnadu anni sadinchukogalam manyasri kanshiraji acharanalo rujuvu chesi chupinchadu dr,b,ambedkarisum tho patu kanshiram isum vacchinnadu mana bathukulu bagupaduthai lekunte enni bahujana sahitya sadassulu pettina mana bathukulu maravu enka andakaram loki bahujanulam potham jai bheem jai kanshiram ji

  • CAA గురించి భారతీయ ముస్లింలను అజ్ఞానంలోవుంచి భయభ్రాంతులని చేయడానికి ప్రయత్నం జరుగుతోందిన ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఈ వీడియోలో చక్కగా వివరించారు. (ఈ విషయం చెప్పబోతుంటేనే ఇర్ఫాన్ హబీబ్ కేరళలో నెట్టివేసాడు).

    ఆప్ కీ అదాలత్, ఆరిఫ్ మహ్మద్ ఖాన్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు