Killing for Fun!

నుషులు వింత. ఇప్పటి మనుషులు ఇంకా వింత.వింత మనిషికి వింతలు ఉండటం వింతకాదు అంటే కూడా అదేమి పెద్ద వింతకాదేమో?

ఒక్కోసారి సమాజాన్ని దాని సైకాలజిని గమనించినప్పుడు ఇది తేటతెల్లంగా కనిపిస్తుంది.మనుషులకు Fandamental గా ఆనందం కావాలి.ఆ ఆనందానికి sustainblity ఉందా? ఉంటుందా ?అనేదే irrational.చాలా సార్లు మనుషులు ఆనందాన్ని ఆశిస్తారు. కోరుకుంటారు. దానికోసం ఎంతదూరమైనా ఎంత risk చేయడానికైనా వెనుకాడరు.మనిషి అంతిమ ద్యేయం ఆనందం,సుఖం.ప్రతిమనిషి ఆనందాన్ని సుఖాన్ని కోరుకోవడం తప్పుకాదు.కానీ ఆనందాన్ని పొందడానికి దుఃఖాన్ని ఎవరికైనా ఇస్తున్నామా అనేది ప్రధానం.చాలా చోట్లా చాలా మంది చాలాసార్లు ఇతరుల్ని బాధించి ఆనందాన్ని పొందుతారు.నువ్వు మాత్రమే ఆనందంగా ఉండటం ప్రధానం కాదు.నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ ఆనందాన్ని ఇతరులు పాడు చేయకూడదని నువ్వుఎలా కొరుకుంటావో ఇతరుల ఆనందాన్ని నువ్వు పాడుచేయకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం.కావాల్సిందాని కోసం ఇతరుల్ని గాయపర్చటం బాధపెట్టడం ఒక్కోసారి హింసించడం మన చుట్టురా జరుగుతూనే ఉంటుంది.ఆడపిల్లల్ని హత్యాచారం చేసేవాళ్ళు కూడా ఈకోవకి చెందిన వారే.ఆనందం కోసమే ఆడపిల్లల్ని ఇంట్లో నుండి పట్టుకెల్లో, మాయమాటలు చెప్పో, ట్రాప్ చేసో ఆనందాన్ని పొందుతారు.

హింస ద్వారా రక్తపాతం ద్వారా దాడుల ద్వారా యుద్దాలు ద్వారా మనిషి ఆనందాన్ని పొందుతూనే ఉన్నాడు.ఒకడి ఆనందం మరొకడి బాధలోంచి పుడుతుంది.మరొకడి భాదకి ఇంకొకడు మందుగా మారటం అరుదుగా జరుగుతుంది.ఆధునిక జీవితం మరింత సంక్లిష్ట మవ్వడానికి ఒకరిపట్ల మరొకరు కర్కశంగా మారడానికి హింసా జీవితo హెచ్చు కావడానికి ప్రధానంగా మనిషి మరో మనిషిపట్ల కలిగుండాల్చిన చూపించాల్చిన ఆచరించాల్చిన విలువలు తక్కువ కావడమే.

ఒక నేరస్థుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి చాలారోజులు అవుతుంది.తను ఎవరినో హత్య చేసాడు అనే కారణం చేత అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.ఎంత inteorrogate చేసినా హంతకుడు నిజాన్ని ఒప్పుకుంటున్నాడేగాని తను ఎందుకు అతడ్ని హత్య చేసాడో కారణం చెప్పటం లేదు.కోర్టులో కూడా నోరు విప్పలేదు ఆ హంతకుడు.కోర్టు అతనికి ఉరి శిక్ష వేసింది.

జైలుకి పంపారు అతడ్ని పోలీసులు.అక్కడ కూడా తను నేరం చేశానని ఒక ప్రాణాన్ని హత్యచేసి జైలుకి వచ్చానని ఎటువంటి పచ్ఛాతాపం కూడలేదు.అతను ఆ జైల్ జీవితాన్ని అత్యంత ఆనందంగాగడుపుతున్నాడు.భయంగానీ,తప్పుచేసాను అనే introspection గాని ఏమిలేని అతని సైకాలజీ అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.ఐతే సహజంగా ప్రతి హత్య వెనక ఏదో కారణం కచ్చితంగా ఉంటుంది అనేది అందరి ఊహకు తెలిసేదే.అడగ్గా అడగ్గా నేరస్థుడు చెప్పిన ఆన్సర్ విని జైలు గదంతా నిశబ్దం ఆవరించింది. i killed him for fun…అన్నాడు.ఇప్పటిదాకా మనిషి ఫన్ కోసం మోసమో,అబద్ధమో,
అన్యాయమో చేసుండొచ్చు.మనిషికి అల్టిమేటే గా కావలిసిన ఆనందంకోసం ఎన్నింటినోకనుగొన్నాడు.

ఉన్నదానితో సంతృప్తి పడక,సాదించినదానితో ఆగిపోకుండా అడుగుని ఆశవైపు,చూపుని అన్వేషణ వైపు,అన్వేషన్ని అనంతం వైపు అనర్గళంగా అక్కున చేర్చుకున్న మనిషి చరిత్రకు పరిణామానికి మరో దారిన వొస్తున్న సంగతిది.తన జీవరాశితో మమేకమవటాన్ని స్వేచ్ఛకి
ఆటంకం అనుకొని వాటికి దూరంగా జరిగిన మానవుడు,ఎవరితో కలవటాన్ని మాట్లాడటాన్ని అంతగా ప్రాధాన్యత లేని అంశంగా కొట్టిపారేసి బంధాలకు వీడ్కోలు చెప్పిన మానవుడు.డబ్బు ఆస్తి హోదా కీర్తి అధికారం అహంకారం నెత్తికి ఎక్కించుకున్న మానవుడు.ఎక్కుతున్న ప్రతిమెట్టు దగ్గర జారి పాతాళంలో పడి పోతున్నాడు.ఇప్పుడు చంపడానికి ఏమి దొరక్క తనని తాను చంపుకొని ఫన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.oneway or other మనుషులు అనబడువారు హింసని ఎంజాయ్ చేస్తారు.fun gatherings,fun trips,fun chats,fun talks,అలాగే ఏమాత్రం తేడా లేకుండా fun murders.or fun murdrers.nodoubt 21st century produced or producing Fm’s.కాబట్టి ఒక మర్డర్ ఎప్పుడైనా జరగొచ్చు,దానిలో నువ్వో నేనో,నీ చెల్లో నాచెల్లో,నీ స్నేహితుడో నాస్నేహితుడో ఉండొచ్చు.ఎందుకు చంపావురా అని అడిగితే వాడు fun  కోసమని సమాధానం చెప్పొచ్చు.ఆదివిన్నాక కూలిపోకుండా నిలబడటానికి ఏంచేయాలో ఆలోచించు.

అలాజరిగాకా నువ్వు murderer అవకుండా నిన్ను నువ్వు నియంత్రించుకునేందుకు నువ్వు ఏంచేస్తావో ఆలోచించుకో.నేనేదో తెలియని పదాన్ని పట్టుకొని మిమ్మల్ని బయపెడుతున్నానని అనుమానించకండి.భయబ్రాంతుల్ని చేయడానికి నీనిదంతా మాట్లాడుతున్నానని నాఆలోచనల్ని తప్పుగా చూసేవాళ్లకోప్రశ్న మన ఆడపిల్లలకు రక్షనుందా?పోనీ మనకు?మన స్వేచ్చకు?స్వేచ్ఛ ద్వారా జీవిస్తున్న జీవితానికి?ఎందుకులేదు?మనమేమైన అనాగరికులమా?అడవుల్లో బతుకుతున్నామా?హాయిగా ఉందామని కట్టుకున్న అపర్ట్మెంట్లలోనే కదా బతుకుతున్నాం.ఇంతకు ముందు కంటే ఇప్పుడు సౌకర్యంగానేగా జీవిస్తున్నాం?ఎందుకింత భయం మనల్ని ఆవరించి భయపెడుతోంది.ఎం తక్కువవుతుంది?ఎం ఎక్కువవుతుoది?సమాధానాలు ఉన్నాయా మనకు?ఏదయినా జరిగితే పిసికేసుకోవటమే తప్ప?అది ఎందుకు జరిగింది?అదే ఎందుకు జరిగింది?మానవ మనస్సుఏంటి?మన హార్మోన్స్ ఏంచేస్తాయి?లేదా ఏంచేయగలవు?నెరమేంటి?దానికుండే లక్షణాలేంటి?అవి పుట్టే హృదయాలు ఎలా originate అవుతాయి?అనే సృహజ్ఞానం ఉహావిజ్ఞానం మనం కల్పించుకుంటున్నామా?జ్ఞాన సమాజానికి కావలిసిన ఒక్క అడుగునన్న ఎప్పుడైనా పొరపాటునన్నా వేసామా?నష్టపోకుండా ఉండేందుకు వందలవేల ప్రణాళికలు రూపుదిద్దుతాం.ఒక్క కార్యాచరనన్న సమాజంకోసం వేయకుండా చూస్తూ నిలబడితే ఇంకా వొస్తూనే ఉంటాయి వార్తలు మరణాలు అక్షరాల్ని చేసుకొని.

ఎప్పుడోఒకప్పుడు ఎవడో ఒకడు ఎదో విధంగా చేస్తూనే ఉంటాడు fun murder,ఎవరో ఒకరు ఏదోవిధంగా అవుతూనే ఉంటాడు.fun murderer.

*

Avatar

పెద్దన్న

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు