నాకొక భుజం కావాలిప్పుడు…!

నసును దహించి వేస్తున్న చోట
గుండె లావల బద్దలైన వేళా
నా తల వాల్చడానికి
నాకొక భుజం కావాలిప్పుడు..!

ఎప్పడు నవ్వుతూ పలకరించే ముఖం
ఈనాడు చిరునవ్వును చిదిమిన
ఆ కాలం ఎంత కఠినమైనదో గానీ
కంట కన్నీరు జారకుండా
కణకణాలను కదిలించిన
ఆ విషాద దృశ్యంలో అలసిన
నా శరీరం సొమ్మసిల్లకుండా ఉండడానికి
నాకొక భుజం కావాలిప్పుడు..!

గంటల కొద్ది నడిచి నడిచి
నిలబడి మాట్లాడే చోట
రెండు కాళ్లకు సత్తువ లేక
కూలబడుతున్న కాడా
ఆ చేతులు చాచి అడుగుతున్న
నిస్సహాయతతో
నాకొక భుజం కావాలిప్పుడు..!

ఇంత ఉక్కపోతలో ఊపిరి
తీయనీయకుండా చేసిన
ఆ ఆలోచనల దాటికి
స్థిరత్వం శిథిలమై పోతే
మనిషిగా ఎట్లా ఉండగలము
అందుకే నాకొక భుజం కావాలిప్పుడు..!

ఇది ఎన్ని ఆశలతో నిండినా లోకమో
నిత్యమూ ఒడిదుడుకులతో సాగుతూ
కాల చక్రంలో బంధిస్తున్న జీవితాలకు
చలన వ్యవస్థే సమాధానమై వస్తున్న చోట
నాకొక భుజం కావాలిప్పుడు!

*

వంగల సంతోష్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.