తెల్సా కథ, నాటక రచనల పోటీ

, అభివృద్థినే ప్రజలవద్దకు పరువెత్తించాలన్నది తెల్సా సిద్ధాంతం.

తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా ( తెల్సా)
https://www.telsaworld.org

21 వ వార్షిక సందర్భంగా కథ, నాటక రచనల పోటీ

బహుమతులు

కథలు: మొదటి బహుమతి రూ.30,000,

రెండవ బహుమతి రూ.20,000,

మూడవ బహుమతి రూ. 15,000

నాటికలు: మొదటి బహుమతి రూ.40,000

రెండవ బహుమతి రూ. 25,000

రచనలు మాకు అంద వలసిన ఆఖరు తేది జూలై 31, 2019

చిరునామా: telsa.competitions@gmail.com

 

నిబంధనలు:

 • అచ్చులో కథ 5/6 పుటలు (8.5”x11”) మించరాదు
 • ఇంతకు ముందు ఏ అచ్చు పత్రికలోనూ, ఎలక్ట్రానిక్ పత్రికలోనూ, బ్లాగులోనూ,ఫేస్ బుక్ లాంటి సాంఘిక మాధ్యమాల్లోనూ ప్రచురించినవి కారాదు. స్వంత రచనలుమాత్రమే పరిశీలించ బడతాయి. అనువాదాలు అనర్హం. ఈ విధమైన హామీ జతపరచాలి.
 • ఇతివృత్తం వర్తమాన, సమీపగత, తెలుగు జీవనగతిని, మానవస్థితిని (human condition), తెలుగుజీవితాన్ని ప్రతిబింబించేదిగా వుండాలి.
 • నాటికలు 45-60 నిమిషాల ప్రదర్శనకు అనుకూలంగా వుండాలి. 6/7 పాత్రల కన్నా మించకుండా వుంటే మంచిది.
 • రచనలు డిజిటల్ రూపేణా మాత్రమే, వర్డ్ ఫార్మాట్ లోనూ, ఎటువంటి అచ్చుతప్పులు లేకుండా ప్రచురణసిద్ధంగా competitions@gmail.com కు పంపించాలి.
 • మా దృష్టిలో బహుమతియోగ్యమైన రచనలుఅందకపోతే, బహుమతికి ఏ రచనా ఎన్నుకోకుండా వుండే హక్కు మాకు వుంటుంది. ఈ విషయంలో నిర్ణేతలదే ఆఖరిమాట. ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు. రచనలతో పాటు ఈ నిబంధనను ఆమోదిస్తున్నట్టు, తమసంతకంతో కూడిన హామీ పత్రాన్ని రచయితలు జతపరచాలి.
 • ఆమోదించ బడిన రచనలు, మా వార్షిక జ్ఞాపికసంచికలో ప్రచురించిన తర్వాత మాత్రమే, ఇతర ప్రచురణలకు పంపించుకోవచ్చు.

 

తెల్సా వార్షిక సభలు సెప్టెంబర్ 21, 2019 జరుగనున్నాయి.

గత 21సంవత్సరాలుగా తెల్సా సాహితీ-సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే, ప్రణాళికాబద్ధగ్రామాభివృద్ధి అనేప్రాతిపదిక (Micro-planning Approach To Rural Change – MARCh) లక్ష్యంగా దక్షిణకాలిఫోర్నియాలో అనేకానేక పాదయాత్రలు చెయ్యడం జరిగింది.

తెలుగు జిల్లాలగ్రామాలలోని ఉన్నత పాఠశాలల్లో   వేలాదివిద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళు ఇవ్వడమూ, కొన్ని పాఠశాలల్లోనీటి శుద్ధి, పారిశుధ్యకార్యక్రమాలు, బడి పిల్లలకు ఉపకారవేతనాలు, ఇతరంగా ద్రవ్యసహాయం ఏర్పాటు చేశాము. గత సంవత్సరం గుంటూరు జిల్లాలో ఒకపాఠశాలను దత్తత తీసుకుని, అక్కడ సోలర్ ప్లాంటు, మంచినీటి ప్లాంటు, తరగతులలో సౌకర్యాలు, గ్రంథాలయం, పాఠశాలభవనం బాగులు, విద్యార్థులకు అదనపు యూనిఫారాలు మొదలైన పనులు పూర్తి చేశాము.

ప్రభుత్వవిధానాలు అభివృద్ధినంతా నగరాలలో కేంద్రీకృతం చేసి ప్రజలనక్కడకు తరలించడం కాదు, వికేంద్రీకృతంగా, అభివృద్థినే ప్రజలవద్దకు పరువెత్తించాలన్నది తెల్సా సిద్ధాంతం.

తెల్సా వెబ్ సైటు: https://www.telsaworld.org/

పద్మ ఇంద్రగంటి

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాల వివరాలు చదివిన తరువాత వాళ్ల కృషికి జేజేలు కొట్టాలనిపించింది. కథలకే గాక నాటకాలకు కూడా పోటీలు పెట్టి బహుమతు లివ్వడం హర్షదాయకం. అయితే, ఈ ప్రకటన చూడగానే మూడు విషయాలు మదిలో కొచ్చాయి.
  1. ముఫ్ఫై అయిదు ఏళ్లకి పైగా ఈ దేశంలో ఉన్నా, తెలుగు సాంస్కృతిక సంస్థలతో కొద్దో గొప్పో పరిచయం ఉన్నా గానీ ఈ సంస్థ గూర్చి వినడం మొదటిసారి. సంస్థ వివరాలు వెబ్ సైట్లో చూస్తే సామాజిక కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నట్టు తెలిసింది గానీ, సాహిత్యానికి పెద్దగా సంబంధం ఉన్నట్లు కనిపించలేదు. (ఆ లంకె ఉండాలని నియమమేమీ లేదు!) ఇప్పుడు ఈ ప్రకటన ఆసక్తిదాయకం.
  2. పోటీలో గెలిచిన రచనలని ఎక్కడయినా ప్రచురిస్తారో లేదో తెలియజేస్తే కొంత మబ్బుని తొలగించ గలుగుతారు.
  3. ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాల గూర్చి చదివిన తరువాత, బహుమతులకు కేటాయిస్తున్న ఈ డబ్బుని ఇప్పటిదాకా నిర్వహిస్తున్న కార్యక్రమాలకే ఉపయోగించవచ్చు కదా అన్న ఆలోచన కూడా వచ్చింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు