డా. ఎం.వి.రమణారెడ్డి  స్మృతిలో…..

చనలకు ఆహ్వానం..  చివరి తేది: 28 ఫిబ్రవరి 2022

డా. ఎం.వి రమణారెడ్డి గారు ఇటీవలే మనకు  దూరమయ్యారు. అక్సిజన్ మాస్క్  ఆసరాగా చివరి వరకు అక్షరాలకు ప్రాణం పోశారు. ఎంత కష్టమైనా ఎదురొడ్డి నిలిచే అరుదైన వ్యక్తిత్వం వారిది.   వైద్యవృత్తితో ఆయన ప్రజా జీవితం మొదలు పెట్టి  తాను  నమ్మిన సిద్దాంతాలు, ఉద్యమాలు, సాహిత్యాన్ని అంటిపెట్టుకొని  నడిచారు.

తొలిదశలో విప్లవ భావాలకు ఆకర్షితులై కార్మికనాయకుడిగా, రాయలసీమ ఉద్యమనేతగా, సంపాదకులుగా, రచయితగా, అనువాదకులుగా ఇలా అనేక రంగాలలో బహుముఖ కృషి చేసి తనదైన స్థానం పొందారు. భావితరాలకు స్ఫూర్తి కలిగించేలా డా. ఎం.వి రమణారెడ్డి గారి స్మృత్యర్ధం ఒక విశేష సంచికను ప్రచురించి, ఏప్రిల్ 4 న  జయంతి రోజున ఆవిష్కరించాలని నిర్ణయించాం. రమణారెడ్డి గారితో ఉన్న  అనుబంధం,  వ్యక్తిత్వం,  ఉద్యమం,  సాహిత్యం, రాజకీయ జీవితం తదితర అన్ని అంశాలతో సమగ్రంగా  సంచికను ప్రచురిస్తున్నాం.

రమణారెడ్డి గారి  సన్నిహితులు,  ఆయనతో పాటు అడుగులు వేసిన సహచరులు,  ఉద్యమకారులు, మేధావులు, సాహిత్యకారులు, వివిధ సంఘాల వారు తమ విలువైన పరిశీలనలు, విశేషాలు, సందేశాలను, అభిప్రాయాలు, వ్యాసాలు రాసి పంపాలని మనవి చేస్తున్నాము. రమణారెడ్డి గారికి  సంబంధించిన అరుదైన చిత్రాలు, ఉపన్యాసాలు, ప్రభంజనం పత్రిక ప్రతులు, కరపత్రాలను కూడా పంపాలని కోరుతున్నాం.

వ్యాసాలు పంపవలసిన పోస్టల్  చిరునామా:

ఎడిటర్

డాక్టర్ యం వి రమణారెడ్డి ప్రత్యేక సంచిక

C/o M. MURALIDHAR

3/75, RAYAVARAM,

KHADARABAD, PRODDATUR – 516 362.

KADAPA.

9494080926.

వ్యాసాలు పంపవలసిన Email:     jmettupalli@gmail.com       వాట్సప్ నెంబరు:1630 667 3612

ఇట్లు.

జయదేవ్ మెట్టుపల్లి ,సమన్వయకర్త

డా.ఎం.వి రమణారెడ్డి స్మృతి సంచిక

జయదేవ్ మెట్టుపల్లి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు