ఖమ్మం ఈస్థటిక్స్ -2022 పురస్కారాలకు ఆహ్వానం!

త్యుత్తమ సాహిత్య పురస్కారాలకు ఖమ్మం వేదిక కానుంది. ఖమ్మం ఈస్ధటిక్స్ పేరిట ప్రతి యేటా ఒక ఉత్తమ కవితా సంపుటికి, మూడు ఉత్తమ కథలకు పురస్కారాలు ఇవ్వనున్నారు . మూడు ఉత్తమ కధలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ పురస్కారాలు ఇవ్వడమే కాక మరో తొమ్మిది కథలతో  పన్నెండు కధల పుస్తకంగా అచ్చవుతాయి.

మూడు ఉత్తమ కధలకు మొదటి బహుమతిగా 25వేలు, రెండవ బహుమతిగా 15 వేల రూపాయలు, మూడవ బహుమతిగా 10 వేల రూపాయలు అందచేస్తారు. ఉత్తమ కవితా సంపుటి కి 40 వేల రూపాయల నగదు బహుమతి ఉంటుంది. విజేతలకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం,  ప్రత్యేక సత్కారం వుంటాయి.

కవితా సంపుటి 2021 ఏప్రిల్, 2022 మార్చ్ నడుమ ప్రచురితమై ఉండాలి. కనీసం 25 కవితలకు తగ్గకుండా సంపుటి ఉండాలి. పురస్కారం కోసం కవితా సంపుటి నాలుగు ప్రతులను పంపాల్సి ఉంటుంది. పోటీకి పంపే కధలు కేవలం ఈ పురస్కారం కోసం మాత్రమే రాసినవై ఉండాలి. ఏ ఇతర పోటీకీ పంపలేదని హామీ పత్రం జతచేయ్యాలి.

కథ ప్రింట్ నాలుగు ప్రతులను, యూనికోడ్ సాఫ్ట్ కాపీని పంపాలి. అంటే…మెయిల్ కు పంపుతూ నాలుగు హార్డ్ కాపీ ప్రతు లను పోస్ట్ లో కూడా పంపాలి. ఖమ్మంలో ప్రతి యేటా నవంబర్ నెల లో జరిగే వేడుకలో అవార్డుల ప్రదానం ఉంటుంది.

ఈ అవార్డుల కోసం కధలు ,కవితా సంపుటులు పంపగోరేవారు ఆగస్ట్ 31/2022 లోపు క్రింది చిరునామాకు పంపాలి.

ఈ అవార్డుల కమిటీకి ఓల్గా, ఎల్లెస్సార్ ప్రసాద్ గౌరవ సలహాదారులుగా వ్యవహరిస్తారు. ఖమ్మం ఈస్థటిక్స్ సభ్యులుగా ప్రసేన్, సీతారాం,మువ్వశ్రీనివాసరావ్,రవిమారుత్, ఫణి మాధవి, వంశీ కృష్ణ, పగిడిపల్లి వెంకటేశ్వర్లు వ్యవహరిస్తారు.

కవితా సంపుటులు,కథలు పంపాల్సిన చిరునామా. ఖమ్మం ఈస్ధటిక్స్ సాహిత్య పురస్కారాలు 11-2-51 బాలాజీ నగర్ ఖమ్మం 507001 mobile-9849114369. Khammamaesthetics@gmail.com

*

ప్రసేన్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ప్రసేన్ గారూ
  రెండు ప్రశ్నలు
  1. కవితా సంపుటి, కథలు అన్నారు గానీ అవి తెలుగులో రాసినవేనా?
  2. ఈ పోటీ ఖమ్మం వారికేనా? భద్రాద్రి కొత్తగూడెం వారికి కూడానా? తెలంగాణా వారికా? ‘ఆంధ్రోళ్ల’కు కూడానా? లేదా ఇతర దేశాలు, ప్రదేశాలలో వున్నవాళ్లకు కూడా వర్తిస్తుందా?

  తెలుగు సాహిత్య సమాజం ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ప్రశ్నలు తప్ప ‘ఈకలు పీకడానికి కాదని’ మనవి.
  (తెలుగు)కవులకు, కథా సృజనులకు ఇది మంచి అవకాశమే.
  శుభాకాంక్షలు.

 • తెలుగే…
  ప్రపంచ వ్యాప్త తెలుగు వారికి

 • సాహిత్య ప్రియులం. కనీసం మనమేనా మన తెలుగు వాళ్ళందర్నీ ఎక్కడున్నా గౌరవించుకోవడం కనీస మర్యాద కదండీ. సత్యదేవ్ గారు ‘ఆంధ్రోళ్ళ’కు కూడానా అనడం ఏమాత్రం బావులేదండీ. sorry to say.
  – తులసి బాలకృష్ణ, హైదరాబాద్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు