కొంచెం వొంటరి తనమివ్వండి!

కొంచెం వొంటరి తనమివ్వండి!

చంద్ ముక్త్-1

1.
మృదుభాష విని
చాలా కాలమే అయింది,
కొంచెం పొలం గట్టుకు  వెళ్ళి
పక్షుల అరుపులు విని రావాలి –

2.

మోహ సర్పం అల్లుకొంది,
విష పాత్రికలోనూ
మధువొలుకుతోంది –

3.
దాహంగా వుందనే వస్తాం కదా !
తీరా ఇంతచేసీ ఏదో కొంచెం సేపు
తటాకం వొడ్డున కాలక్షేపం చేసి
నీటిని ముట్టకుండానే వెళ్ళిపోతాం-

4.
మత్తుగా తాగి సృహ తప్పిపోవాలనే వొచ్చాను –
కానీ,
తాగుబోతుల ఖాళీ సీసాలను
ఏరివేయడంలోనే
కాలమంతా గడిచిపోయింది –

5.

వేళకు ఇంటికి రాక ప్రతీరోజూ
ఆమెను  మోసం చేస్తాను –
వొచ్చిన ప్రతీసారీ
నేను మోసపోతాను –

6.

ఖూనీలతో లూటీ చేసిన
మహా నగరం లాటి ఈ హృదయం –
కొంచెం వొంటరి తనమివ్వండి –
వోదార్చుకోవాలి !

7.

రాలి
ఎండి పోయిన
పువ్వులను ఏరిపారేసినట్లుగా

రోజులు గడిచి పోతున్నాయి –

8.

దయ తలచమని
మోకరిల్లలేను
వేళ అయిందని తెలుసు –

*

 

Avatar

ఇక్బాల్ చంద్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

  • ” కొంచెం వొంటరి తనమివ్వండి! పొలం గట్టుకు వెళ్ళి పక్షుల అరుపులు విని రావాలి ” అంటున్న కవి ఇక్బాల్ చంద్ గారూ… పక్షుల కలకలారావాలు లేనప్పుడు ” కభి తన్హాయియో మే యూం హమారీ యాద్ ఆయేగి ” ముబారక్ బేగం ఆపా స్వరం వినండి.

    కభి తన్హాయియో మే యూం హమారీ యాద్ ఆయేగి
    అంధేరే ఛా రహే హోంగే కి బిజిలీ కౌంధ్ జాయేగీ
    యే బిజిలీ రాత్ కర్ జాయేగి తేరే ప్యార్ కి దునియా
    న ఫిర్ తూ జీ సకేగా ఔర్ న తుజ్ కో మౌత్ ఆయేగీ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు