Vagina is the wound that never heals up – Norman Mailer
The benevolent Deodar trees on the earth are women
And Men are the mad winds of pitiless force
Women are the disturbed mermaids of abysmal oceans
And the adventurous fishing nets are men
Women are the never drying streams of bosom love
And men, the voluptuous lot with unquenchable thirst of lust
Women are the injured vaginas with incessant blood streams
And Men, the stupid warriors possessing weapons
Women are the endless wreathes of wounds
And Men, adorn themselves with the garlands of luxury
Ever labouring hands, benumbed legs with shackles
The uncared, non-resting labourers – women and
Men are the owners of easy chairs
Women, the ushering mornings, evening zephyrs and moonlit nights,
The winged angels that descended on horizons of night
Daughters, maidens, mothers, grandmothers and great grandmothers,
The very first seeds of this creation
The wet eyelids that never go dry all through life
The never leaving cool shady umbrellas on the heads of men
The roaring calls of freedom, the harbingers of struggle,
The drums of protest;
They wish (for) an equal share in the world,
Women are the Earth Goddesses – the Gaeas
with the sun and moon as their breasts.
*
స్త్రీలు – పురుషులు
~
Vagina is the wound that never heals up – Norman Mailer
నేలపై మొలిచిన దయా దేవదారు వృక్షాలు స్త్రీలు
పురుషులు కరుణ లేని పెనుగాలులు
స్త్రీలు అగాధ సంక్షుభిత సాగర కన్యలు
సాహసోపేతులైన జాలరి వలలు పురుషులు
స్త్రీలు ఎండిపోని వక్షోజ ప్రేమ ధారలు
తపన తీరని దాహమోహితులు పురుషులు
సతత రక్తప్లావిత క్షత యోనులు స్త్రీలు
పురుషులు ఆయుధ ధారులైన అవివేక యోధులు
ఎడతెగని గాయాల మాలలు స్త్రీలు
పురుషులు విలాస మాలాధారులు
సెలవులేని చేతులు, కందులు కట్టిన సంకెళ్ళ కాళ్ళు
అలుపు సొలుపు లేని, ఆదరణ లేని పనిగత్తెలు స్త్రీలు
పురుషులు పడక్కుర్చీ యజమానులు
స్త్రీలు
తొలివేకువలు చల్లని సాయంత్రం గాలులు వెన్నెల రేలు
రాత్రి అంచుపై దిగిన రెక్కల దేవకన్యలు
కూతుళ్ళు పడుచులు తల్లులు తాతమ్మలు ముత్తవ్వలు
సృష్టికి తొలితొలి బీజాలు
బతుకంతా తడియారని కనురెప్పలు
మగవాళ్ళ తలలపై ఎప్పటికీ వీడని
చలచల్లని గొడుగులు
స్వేచ్చాగర్జనలు పోరాట సమాయత్తులు
ధిక్కార దుందుభులు
ప్రపంచంలో సమభాగం కోరుకునే వాళ్ళు
స్త్రీలు భూదేవతలు
సూర్య చంద్రులు రెండు స్తనాలైన వాళ్ళు
(శ్రీ పాపినేని శివశంకర్ ‘రజనీ గంధ’ నుంచీ)
Telugu: Papineni Sivasankar
Translated: Dr.Vijay Koganti
Painting: Satya Birudaraju
Teugu..lochadevy..villuntunda?sir