White Noise

The only way we see things clearly in this world

Is by closing our eyes

Because it’s no longer about what can be seen

Really, it’s about what can be heard.

 

The ping ping of the notifications that won’t stop coming

The buzz of the TV that won’t stop cursing

The whispers of strangers who won’t stop judging

And the shhhh of our own minds that won’t stop fearing

All these noises rise up into a chaotic whirlwind

Swishing and swashing any voice along the way.

 

It’s really hard to make sense of anything you hear

When so many sounds are targeted towards you

You subconsciously close your eyes

Because you can’t close your ears anyway

It’s funny how suddenly

Without you even realizing it

This whirlwind of white noise

Blinds you.

 

It blinds you from reason

And carries you forward on a wave of ignorance

Making you see more weight in WhatsApp forwards

Than the stories of people they make out to be the enemy

Making you believe jokers who scream the loudest in rallies

Than the shivers of those who are silenced by them

Making you turn your head away from violence

Than standing up to make it stop.

 

Your ears learn to adapt

To the deafening beat

Of the drum you’re not playing

You let the sharp words go

And leave the shrill sentences behind

You are convinced that this is what

The world should sound like.

 

“Kill them, rape them, they’re not even human

We’re better, we’re more, we can’t even stand them”

We and them

Them and we

This is all we hear

Why can’t we just see?

 

Open your eyes

And drone out the sounds

Believe what’s in front of you

Believe the tears that are trickling down

Faster than the rights being taken away

Believe the wounds that are being inflicted

Deeper than the hatred finding it’s way

Believe the voices of those

Who just want to live another day.

 

  • Bhavana Bhattiprolu

 

శబ్దకాలుష్యం

 

కళ్ళు మూసుకుంటే తప్పా మనకేం కనపడట్లా ఈ లోకంలో

ఇప్పుడు మనకేం కనపడుతోందని కాదుట క్రితంలా

మన చెవిలో మోగే రొద మాత్రమే  శ్రుతం ఇప్పుడంతా

 

టింగ్ టింగ్ మని ఆగని నోటిఫికేషన్లు

గుయ్యని నిరంతరం రొదపెట్టే టివీ శాపనార్థాలు

వినిపించీ వినిపించకుండా అపరిచితుల అవిరామ తీర్పులు

గుండె పీచు పీచు మంటూ తెరపిలేని భయాలు

ఓ అయోమయపు సుడిగాలిగా ఎగిసే ఇన్ని గోలలు

ఎగిరొచ్చే ఏ గొంతునైనా కర్కశంగా నొక్కేస్తూ

 

ఇన్ని రణగొణలు భీభత్సాలూ నీ మీదకి ఉరికొరికి వస్తుంటే

ఏ ఒక్క ముక్కా, ముచ్చటా అర్థం కాకుండ పోతుంది

నీకే తెలియకుండా నీ కళ్ళు మూతలు పడిపోతాయి

ఎందుకంటే, నీ చెవులు నువు  మూసుకోలేవు గనక

ఎంత తమాషా అంటే

ఎప్పుడు, ఎలా జరిగిందో కూడా నీకు తెలీదు

ఈ శబ్దకాలుష్యం నిన్ను గుడ్డిదాన్ని చేసేస్తుంది

 

నీ ఆలోచనని నువ్వే గుర్తించలేనంత గుడ్డితనం

నిన్ను మూర్ఖత్వంలోకి సుతారంగా  నడిపిస్తూ

వాట్సాపు లో తేలివచ్చే పిచ్చివాగుళ్ళలో నీకు అనురక్తి ని కలిగిస్తారు

ఆ తర్వాత వాళ్ళు ముద్రవేసిన వాళ్ళే నీకు శత్రువుల్లా కనపడతారు

ఆ ఉన్మాదుల్లో ఎవడెక్కువ అరిస్తే వాణ్ణే నువ్వు నమ్మేలా చేస్తారు

ఆ గొంతుపడిపోయి, నిశ్చేష్టులయిన, నిశ్చేతనులయి వణికిపోతున్న వాళ్ళు

వాళ్ళ నించి, ఆ హింస నించి నీ తల తిప్పుకునేలా, తిప్పుకోగలిగేలా చేస్తారు

దాన్ని ఆపాలేమోనన్న ఆలోచనకూడా నీకు రానీరు

 

మెల్లిగా నీ చెవులు అలవాటుపడతాయి

నీది కాని, నువ్వుమోగించని హింసధ్వనిని వింటానికి

ఆ శూలాల్లాంటి మాటలు నిన్నింకెతకాలం బాధించవు

ఆ దుర్మార్గపు నిర్వచనాలని  దాటుకుంటూ వెళ్ళిపోతావు

నమ్మేస్తావు, స్థిరపడిపోతావు

ఇలాగే ఈ ప్రపంచం సాగాలని, వినబడాలని

 

చంపేయ్, నరికేయ్, మానభంగం చేసేయ్

వాళ్ళు మనుషులే కారు

మనది ఉన్నత జాతి, మనం ఎక్కువమందిమి, వాళ్ళ ఉనికి మనకి దుర్భరం

మనమూ, వాళ్ళూ

వాళ్ళూ, మనమూ

అంతే, అదొక్కటే మనం వినేది

మనం ఎందుకు చూడలేక పోతున్నాం?

 

నీ కళ్ళు తెరవు

చెవుల్లోకి ప్రసరిస్తున్న విషాన్ని విసిరిగొట్టు

నీ కళ్ళముందు ఉన్నదేదో గమనించు,  దాన్ని నమ్ము

ఉగ్గబట్టిన కన్నీళ్ళని ప్రవహించనీ, వాటినీ నమ్ము

కోల్పోతున్న హక్కులకన్నా వేగంగా,

గుచ్చి గుచ్చి రేపుతున్న గాయాలని గర్తించు

చిమ్ముతున్న ద్వేషపు చిక్కదనం  కన్నా

ఇంకొక్కరోజు బతకాలని ప్రాధేయపడే వాడి ఆక్రందనకి చలించు

 

ఆంగ్ల మూలం :  భావన భట్టిప్రోలు

అనువాదం : అక్కిరాజు భట్టిప్రోలు

 

Bhavana Bhattiprolu

4 comments

Leave a Reply to Madhu Chittarvu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అనువాదం చాలా బావుంది.
    P.S.: Et tu, Brute?
    అపరిచితులు
    శత్రువులు
    ఎగిసే
    గుడ్దితనం
    నిశ్చేష్టులు

    • తెలియక చేసిన తప్పులు కొన్ని, తెలిసి చేసిన టైపోలు కొన్ని. Will plead editors to make corrections at their convenience.
      Thanks so much for the feedback. Much appreciated!

      -Akkiraju

  • Bhavana ,you are writing very well.Your expression is quite poetic.White noise and the drum we are not playing .Liked it.Keep writing.
    The translation is equally good .

  • Bhavana ,you are writing quite well.Your expression is quite poetic . White noise. And the drum we do not play.And we can’t close our own ears.Liked it.
    The translation is equally good.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు