Some: People & Places

‘ఇక్కడ
నీకు లైఫ్ ఎంజాయ్
చేయడమే రాదురా చూతియేగా’-
చెవిలో జోరీగలా వాగుతుంటాడు
జీవితాన్నంత ఎంజాయ్ చేస్తున్నాననుకునే
ఇంకొకడు-
“ఇదో బఢా ప్రపంచం
ఇక్కడ సిగరెట్లు తాగాలి
గాలిలో రింగురింగుల పొగని వొదలాలి
పైసలున్నా లేకపోయినా ఫికరొద్దు
కడుపుతోపాటు కబోర్డ్ షెల్ఫులుకి కూడా సీసాల మత్తెక్కాలి.
ఒక మనిషికే సరిపోయేంత బైక్ ఉండాలి
దానిమీదే
రోజుకొక అమ్మాయిని తిప్పాలి.
అమ్మాయిలని రూమ్లకు తేవాలి
ఆర్గనైజేషన్ ఉద్దేశం తెలీకపోయినా
టాయిలెట్లను కూడా వదలకుండా
నగ్నంగా పేర్లని రాయాలి
నగ్నంగానే నిలబడాలి
మెస్ లో బెంచీలు చచ్చేలా గోల చేయాలి
Flirting లో Ph.D చదువుతుండాలి.
నాలాగ !
When you are an innocent
You are the only one who’ll be fucked up’
ఇలాగే వింటూ ఉంటాను వాడ్ని.
పక్కగా ఒక గొంతు వినిపిస్తుంది
బోల్డ్ గా ఉన్న ఒక అమ్మాయి,
వేళ్ళ మధ్య గోల్డ్ ఫ్లాక్ సిగరెట్తో
‘Bro, do you have any lighter or matchbox?’

లిఖిత్ కుమార్ గోదా

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హెచ్ సీయూ లో ఇలా ఎంజాయ్ చేయాలి రా మామా అని చెప్పేవాళ్ళు చాలా మంది తారసపడుతారు. కొందరితో మనకు పరిచయం లేకపోయిన వాళ్ళను చూస్తేనే తెలిసిపోతుంది వీళ్ళు కేవలం ఎంజాయ్ చేయడానికే వచ్చారని… వాళ్ళను చూస్తే అట్టే కనిపెట్టవచ్చు వాళ్ళ తల్లిదండ్రులు ధనవంతులై ఉంటారని…కాబట్టి డబ్బులు ఎలాగో ఉన్నాయని అనుకోని జాబ్ రాకపోయిన బిజినెస్ అయిన చేసుకొని బతికేస్తామనే పోగరు ఉంటుందేమో బహుశా.. కాని వాళ్ళని చూసి మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థులేవరైన వాళ్ళ లాగానే ఎంజాయ్ చేయాలని అనుకోని చేస్తే ఫ్యూచర్ బర్బాద్ అయిపోతుందని నా అభిప్రాయం….బాగుంది లిఖిత్ హెచ్సియూ వాతావరణాన్ని కవితల్లో భద్రపరుస్తునందుకు ధన్యవాదాలు 👍💐

  • కథైనా కవితైనా దృశ్యం చేయడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో నువ్వు ఒకడివి లిఖిత్. All the Best Dear 💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు