Telugu: Kondepudi Nirmala
Dadamma, the midwife, lifted the lukewarm castor oil bowl off the coal stove and put it on the table nearby.
Adila Devi was writhing in pain with the sudden onset of labour contractions. She wanted to stretch her legs out of habit, but when the pain suddenly pricked somewhere on that mountainous belly, she groaned and refrained from.
As Adila Devi’s blindfold loosened, Dadamma pulled it over her eyes again and tightened it.
As she was eager to open up the blindfold, Dadamma said,
“Don’t open it now, child! It is not time yet. It will all be over in fifteen minutes.”
She shaved off the hairs below the navel and cleaned the area. Any other time, a woman would be have kept quiet out of shyness or for fear of injury. But Adila Devi was beyond the realm of fear or shame.
One question… One answer… and One anguish… making cycles in her mind.
From the days of morning sickness to the onset of labour contractions, she had been lugging that fear like a cross in her mind:
“What if her first issue is a girl?”
She asked Dadamma the same question.
“Dadamma! Tell me the truth. What if the baby in my belly is not a male?”
“It is all in your hands…” she said. There was years of accustomed coolness behind her assurance.
Pouring the lukewarm castor oil in a stream across the belly to down below she said, “Don’t worry. Give birth to a prince-like male child. Okay?”
“What if it be a girl?” She did not ask this question. The tears streaming down her eyes did.
Dadamma was a veteran in midwifery. She knew that all first-time mothers cry with the same haunting question in their minds. But only few of them would deliver a male child. Those fortunate few male babies would descend to earth at the auspicious hours determined beforehand. She was also aware of the ominous consequences to the family if a girl were to be born as first-issue and knew how to relieve them of the burden.
All the midwives of Chaman Basti were professionals, having undergone training in Kathiawar. Dadamma herself disposed off twenty girls with her own hand. Did she kill them? No, she readied them for the next birth. She was not like some of the others who wash off their hands throwing the new born into the tanks of Kalasighat or Chaumukhi. She was a proud child of Manihari Village. They knew how to perform the last rites of a newborn first-issue girl child and follow the procedure meticulously. They do it as their bounden duty than for the perks. They believed that the baby would take birth as a male child next time. For that reason they bury the girl rather than throwing into a waterbody. Because Dadamma was so committed to her duty, she commanded a higher price than others.
“Ddddaaadddammaaa!” Adila Devi called. It was more like a moan than a call.
“What child,” Dadamma hurried to her.
“Don’t let anybody into this room.”
“Sure. But then, who else, other than your mother, would dare enter? She could not come here earlier because the streams were in spate. She will be here anytime and shall take the grandson into her hands.” Dadamma tried to bolster her spirits. She explained how Adila Devi should hold the arms of the cot with her own and make room for the baby to come.
Holding her breath for long to create pressure and getting tired of it, she began crying saying she could not do it anymore.
Dadamma was alarmed. “Will the baby come out before eight thirty? Of what use her helping the labour if the auspicious hour has passed? She shall have to forgo her gift if there is a slip anywhere.”
She could not wait any longer. Watching the bulge carefully, she made a rough estimate of the position of the baby in the belly and started driving down that part skillfully.
“No. No. You are here to kill my baby…” cried Adila Devi, writhing in pain and pushing Dadamma’s hands off her belly.
Dadama held her legs tight.
Instead of pains shooting in a chain, Adila Devi started feeling a shooting pain… then a fear… and then, her fears doubled with each shooting pain.
The movement of the baby slowed.
Dadamma grew anxious as she looked at the ticking wall clock. She ran up to Adila Devi’s husband waiting outside and said something to him.
Within the next minute, fire-crackers started making heavy sounds near the window of the labour room.
Fearing for life, Adila Devi took a deep breath, held it for long, and moaned pressurizing the belly like a billow.
And soon the baby slipped into the hands of waiting Dadamma.
Sounds of firecrackers ceased.
Adila Devi pulled down the blindfold to look at the baby.
A bomb had blown!
IT WAS A GIRL CHILD!
Trying to put the baby in her shoulder bowl, Dadamma said,
“What is there to look at? Take it easy, my child, and reconcile to the inevitable. By the turn of the year, it would fill our lap taking birth as a male child again.”
Summoning all her strength Adila Devi spoke in a shrill voice,
“Dadamma! Look here,” and pulled out a double-layered gold necklace from under her pillow.
Dadamma said, “Sorry, my child! There is no precedent of girl child surviving as first issue in the whole of Chaman Basti. Don’t break it now. Let me attend to my duty. I am serving this family for three generations…”
She went up to the corner, opened an earthen pot, set the bed with the blood-soiled clothes, put the new born therein and covered with bed clothes. The baby started crying.
Stopping her sobbing and drying her eyes, Adila Devi said with a gentle smile, as if she was sharing a secret,
“Poor Dadamma! This is not my first issue.”
“Don’t try to fool me getting crazy for the child! I know how chaste you are. Don’t jeopardize your marriage just for the sake of this silly child.”
She took the earthen pot into her hands.
“Dadamma! I am telling you the truth! This is my second issue.” Adila Devi reiterated pretending to be as cool as she could.
Somebody was knocking at the door anxiously.
Putting the pot down, Dadamma went up to the door to open it.
In the next minute, Adila Devi reached for the baby, took her into her arms, and commanded Dadamma,
“Go! And tell the same thing to all people there…” and shut the door behind Dadamma. She hugged her baby to her heart and kissed till she got tired of it.
She opened the hooks of her jacket and started breast-feeding.
The whole atmosphere was afire outside.
“Open the door first! You cheat! Tell me whose son was the first? Whose daughter is the present one? Tell me! Do you open the door or not?”
Her husband was shouting from outside.
“Oh! You crazy girl! Why do you spoil your life for the sake of a child?”
Her anguished mother was entreating from outside.
Adila Devi did not respond. She did not stir from her place. She was sitting coolly there and quietly cleaning the baby of her natal stains.
*
[Inspired from an article in an English magazine by a social worker in Chaman Basti, Bihar who found it strange that the first-issue in every family of the village was a male child and investigated it with the help of a health-worker.]
శారీ ఘర్[2]
–కొండేపూడి నిర్మల
వెచ్చపెట్టిన ఆముదంగిన్నె కుంపటిమీంచి దించి బల్లమీద పెట్టింది మంత్రసాని దాదమ్మ.
అకస్మాత్తుగా మొదలయిన పురిటి నొప్పులతో అతలాకుతలమవుతున్న అదిలాదేవి అలవాటుకొద్దీ కాళ్ళు జాపుకోబోయి ఆ మధ్యగా వున్న మేరుపర్వతంలాంటి కడుపులో ఎక్కడో కలుక్కుమంటే ఒకసారి మూలిగింది.
కళ్ళకు కట్టిన గంతలు జారిపోతుంటే బిగించి కట్టింది దాదమ్మ.
కళ్ళమీద చేత్తో తడుముకోబోతుంటే,
“ఒద్దొద్దు. నువ్విప్పుడే కళ్ళు తెరవకూడదు. ఒక్కపావుగంటలో పని జరిగిపోతుంది,”
అంటూనే, బొడ్డుకిందనుంచీ వున్న రోమాల్ని రేజరుతో గట్టిగా గీసి అక్కడంతా శుభ్రం చేసింది. మామూలుగా ఈ పని జరుగుతున్నప్పుడు ఏ ఆడది అయినా సిగ్గుతాలుకు ఇబ్బందితోనో, కోసుకుపోతుందనే భయంతోనో బిక్కచచ్చినట్టు అయిపోతుంది.
కానీ అదిలాదేవి శరీరస్పృహలకు అతీతంగా ఎక్కడో ఉంది.
ఒకటే ప్రశ్న… ఒకటే జవాబు… ఒకటే వేదన…
వేవిళ్ళు మొదలైనప్పటినుండీ నొప్పులోచ్చేదాకా ఒకే భయాన్ని శిలువలాగా మోస్తోంది.
ఒకవేళ ఆడపిల్ల పుడితే? అదే అడిగింది కూడా…
“దాదమా! నిజంచెప్పు. నా కడుపులో ఉన్నది మగబిడ్డ కాకపోతే?…”
“అంతా నీ చేతిలోనే వుంది.” అలవాటయిన ప్రశాంతత దాదమ్మ గొంతులో. దాదమ్మ ఆముదం ధారగాపోస్తూ పొట్టకిందనుంచీ, పిరుదులదాకా లోనా బయటా పట్టించడం అయ్యాక మళ్ళీ చెప్పింది. “రాజాలాంటి మగబిడ్డను కంటే సరి…”
“లేకపోతే?” ఈ ప్రశ్న అదిలాదేవి నోట్లోంచి రాలేదు. కన్నీటిబొట్లరూపంలో వచ్చింది.
దాదమ్మ కిదంతా మామూలే. తొలుచూలు తల్లులిలా ఏడుస్తూనే కంటారు. కన్నవాళ్ళలో ఏ కొందరో మగబిడ్డలు. నిర్ణయించిన ముహూర్తం ప్రకారం దుష్టఘడియలు రాకుండా భూమ్మీదకొస్తారు. ఆడపిల్ల పుడితే కుటుంబానికి పట్టబోయే విపత్తునెలా దాటించాలో ఆమెకు తెలుసు. కతియవార్ లో నర్సు ట్రైనింగు తీసుకుని చమన్ బస్తీలో వున్నవారంతా వృత్తి నిపుణులే. దాదమ్మ తనచేత్తో ఇరవై మందిని స్వర్గానికి పంపింది. స్వర్గం అంటే ఏమిటి? మళ్ళీ జన్మకు సిద్ధం చెయ్యడం… కళాసీఘాట్, చౌముఖి చెరువుల్లో బిడ్డనుముంచి చేతులు దులుపుకోవటం కాదు.. దాదమ్మపుట్టిన మణిహారి గ్రామంలో వాళ్ళకి పద్ధతి తెలుసు. ఆడశిశువుల అంత్యక్రియలు ఈనాంకోసం కాకుండా పవిత్ర వృత్తి ధర్మంగా చేస్తారు. కాబట్టే ఆ శిశువు తిరిగి మగబిడ్డగా పుడతాడు. అందుకని శరీరాన్ని మట్టిలో కలపడమే న్యాయమని నమ్ముతారు. నిబద్ధతతో పనిచేస్తుంది కాబట్టి దాదమ్మ పుచ్చుకునే మూల్యం మిగిలిన వాళ్ళందరికంటే కొంచెం ఎక్కువే.
“ద్దాద్దమ్మా…!” అదిలాదేవి పిలిచింది కానీ, అది పిలుపులా లేదు. కలవరింతలా వుంది.
“ఏంతల్లీ!” అంటూ వచ్చింది ఆదుర్దాగా.
ఎవర్నీ ఈ గదిలోకి రానివ్వద్దు.”
అలాగే. వస్తే గిస్తే మీ అమ్మ రావాల. రేవు పొంగడం వల్ల రాలేదు గానీ, ఇప్పుడు వస్తుంది. మనవడిని ఎత్తుకుంటుంది.” దాదమ్మ ధైర్యం చెబుతూ రెండు చేతులూ చెరోపక్కా మంచంపట్టీలు పట్టుకుని బిడ్డ రావడంకోసం ఎలా దారి ఇవ్వాలో చెప్పింది. ఊపిరి బిగబట్టి దిగశ్వాస పెంచడంలో అలిసిపోయిన అదిలాదేవి ఉన్నట్టుండి తనవల్ల కాదంటూ ఏడవడం మొదలుపెట్టింది.
దాదమ్మ గుండెలో రాయిపడింది. ఎనిమిదింపావు లోపల ఈ పిండం బయటపడుతుందా లేదా? తీరా దుష్టముహూర్తం వచ్చాక కాంపుచేసి ప్రయోజనం ఏమిటి? ఎక్కడ తప్పు జరిగినా తన ఈనాం గంగలో కలుస్తుంది. అనుకున్నదే తడవుగా పొట్ట పైభాగం నుంచి బిడ్డ శరీరాన్ని ఉజ్జాయింపుగా చూసి ఉబ్బిన భాగాన్ని నైపుణ్యంగా క్రిందికి జరపడం మొదలుపెట్టింది.
దాదమ్మ చేతులు పక్కకి నెట్టేస్తూ మంచం దిగి వెళ్ళిపోయే దానిలా గింజుకుంటూ…
“వద్దు. వద్దు. నా బిడ్డని చంపడానికే వచ్చావు,” అంటూ ఏడుస్తోంది అదిలాదేవి.
దాదమ్మ కదలకుండా కాళ్ళు రెండూ గట్టిగా పట్టుకుంది.
నొప్పి మీద నొప్పి గొలుసుకట్టుగా రావడానికి బదులు ఒక నొప్పి… ఒక బెంగ… ఒక నొప్పి రెండు బెంగలు… ఒక నొప్పి నాలుగు బెంగలు.
అదిలాదేవి కడుపులో బిడ్డప్రయాణం మందగించింది.
దాదమ్మకి పిచ్చెక్కిపోతోంది. గోడమీది గడియారం చూసి ఉలిక్కిపడి చివాలన బయటకి వెళ్ళి అక్కడ ఆత్రంగా కూచున్న యజమానితో ఏదో చెప్పింది.
అరనిమిషం గడవకుండానే ప్రసూతిగది కిటికీదగ్గర టపాకాయల కట్ట పేలడం మొదలుపెట్టింది.
ప్రాణభయంతో అదిలాదేవి ఊపిరిబిగబట్టి లేవడానికి చేసిన ప్రయత్నంలో బలంగా ముక్కింది.
కేర్ కేర్ మంటూ దాదమ్మ చేతిలోకి జారింది బిడ్డ.
టపాకాయల చప్పుడు ఆగిపోయంది.
కళ్ళమీది గంతలు కిందికి లాక్కుని చూసింది అదిలాదేవి.
ఈ సారి గుండెలోనే ఓగింది తుపాకి. ఎందుకంటే పుట్టింది ఆడబిడ్డ.
దాదమ్మ బిడ్డౌ జోలేలో కట్టుకుని అంది,
“ఏంచూస్తావు లేమ్మా చచ్చినబిడ్డ కళ్ళు చారెడు అన్నట్టు… గుండె రాయి చేసుకో. నీ బిడ్డ స్వర్గానికి వెడుతుంది. వచ్చే ఏటికల్లా మగబిడ్డలా నీ ఒడి నింపుతుంది.”
అదిలాదేవి పళ్ళబిగువున ఓపిక తెచ్చుకుని కీచుగా అరిచింది.
“దాదమ్మా! ఇటివ్వు నా బిడ్డని. ఇదిగో ఇటుచూడు…” అంటూ దిండు క్రింద నుంచి రెండువరసల చంద్రహారం బయటకి తీసి చూపించింది.
“లేదు తల్లీ! తొలిచూలు ఆడబిడ్డ చమన్ బస్తీలోనే ఎవరూ లేరు. నా పని నన్ను చేసుకోనివ్వు. మూడు తరాలుగా మీ ఉప్పు తింటున్న దాన్ని…” అంటూ గదిమూలగా ఉన్న మట్టికుండలో బిడ్డను పండబెట్టి పురిటి మైల బట్టలు కప్పింది. పడక కుదరక బిడ్డ తన్నుకుంటూ ఏడుస్తోంది.
అదిలా దేవి ఏడుపు ఆపేసి ఒక నవ్వు నవ్వి రహస్యంగా అంది,
“పిచ్చి దాదమ్మా! ఇది తొలుచూలు బిడ్దకాదు.”
“చాల్లెండమ్మా! నిప్పులాంటి మనిషి మీరు. బిడ్డమీద మమకారంకొద్దీ ఏదో చెప్పి కాపురం తీసుకోకండి.” కుండపట్టుకుని లేచింది దాదమ్మ.
“ఔను నిజమే దాదమ్మా! ఈ బిడ్డ నాకు మలిచూలు…” ప్రశాంతంగా చెప్పింది అదిలాదేవి. మూసిన తలుపులు మ్రోగుతున్నాయి ఆత్రంతో.
దాదమ్మ కుండను కిందపెట్టి తలుపుతియ్యడానికి వెళ్ళింది. ఆ రెండు నిముషాల్లోనే బిడ్డను అందుకుంది అదిలాదేవి.
“వెళ్ళు దాదమ్మా. ఈ విషయమే చెప్పు బయట… ” అంటూ ధడాల్న తలుపు వేసుకుంది.
బిడ్దను గుండెలకు హత్తుకుంది. అలిసిపోయేవరకూ ముద్దులు పెట్టింది… రవిక ముడి తీసి పాలిచ్చింది.
బయట రావణకాష్టం రగులుకుంటోంది.
“తలుపు తియ్యి ముందు… ఇంత మోసం చేస్తావా? ఎవడి కొడుకే వాడూ? మొదటివాడు ఎవడి కొడుకు? ఇప్పుడు పుట్టిన బిడ్ద ఎవరి కూతురు? చెప్పు… తలుపుతీస్తున్నావా లేదా?” భర్త.
“అయ్యో! తలుపు తియ్యమ్మా! బిడ్దకోసం కాపురం తీసుకుంటావా పిచ్చిదానా…” ఏడుస్తూ తల్లి.
అదిలాదేవి పలకలేదు. ఉలకలేదు. కొంగుతో బిడ్ద వొంటిమీది పురిటి తడిని తుడుస్తూ కూచుంది.
*
(బీహార్ లోని చమన్ బస్తీలో ప్రతి తొలిచూలూ మగబిడ్డే వుండటమేమిటని ఆశ్చర్యంతో అక్కడి దాదిని ఆచూకీ తీసిన కార్యకర్త అనుభవం ఒక పాత ఆంగ్ల దిన పత్రికలో చదివిన స్ఫూర్తితో.)
10.11.2007. ప్రాణహిత అంతర్జాల పత్రిక.
[1] Sarighar is a temporary enclosure set up with Saris to attend to emergency labour for pregnant women in rural areas.
[2] Sarighar… is a temporary enclosure set up with Saris to conduct labour for pregnant women.
Add comment