poem of thirsty times

క్కడ ఇప్పుడు కొద్దిగా నిశ్శబ్దం మిగిలి పోయింది
ఆమె  వెల్లిపోయాక
ఇంకా కొద్దిగా తన పరిమళమేదో నన్నంటుకున్నట్టు
ఈ నిశ్శబ్దపు రాతిరి వేళ
తనతో చెప్పాలనుకున్నదేదో ఇప్పుడిలా
పలవరిస్తో……

babe..! Need some more  From you
బతుక్కీ, జీవితానికి మధ్య ఉన్న
Flavor of life,
ఇవ్వనూ లేవు, కాదని చెప్పనూ లేవు

మరి నేనేమో
నీ శ్వాసల కోసం తేలియాడే నీటి మబ్బునై
వర్షించాలనీ, ప్రవహించాలనీ మరిచిపోయిన
ఒకానొక నిశ్శబ్ద ప్రవాహాన్ని
Yes now iam a baby who is on death bed
నిజాలనంగీకరించలేకా, అబద్దాలని నమ్మలేకా
నీ రొమ్ము పాలకై ఏడ్చే పసిబిడ్డనై
నీ దిగంత మేఖలల నడుమ సంచరించే
ఒంటరి సంచారిని…

Let me drown in you
నన్ను నీలో కలుపుకో, నన్ను నీలో దాచుకో
నన్ను నీవై పోనివ్వు
పెదాలపై నవ్వులు మోసుకు తిరిగే సీతాకోక
ఓ నల్లని చందమామపిల్లా!
ఎవరో అడుగుతారు నువ్వెవరని నన్ను
ఈ మహా దిగ్మండలానికి విశ్వమిచ్చిన బహుమతని చెబుతాను…

ఎవ్వరూ గుర్తించనే లేదు గానీ….
వేల ఏళ్లుగా ఇక్కడ జీవిస్తూనే ఉన్నావు నువ్వు
Like a baby of moon
ఎవరూ గుర్తించకుండానే ఈ ఎడారి భూముల మీద
ఆ పసిపాదాలతో నేలతో ముచ్చటిస్తున్నావు

Oh my dear little angel …!
ఎవ్వరూ చెప్పరు నీకు
నీవు ఈ భూమికి బహుమతిగా వచ్చావన్న రహస్యాన్ని

దేహమంతా నెత్తుటి గాయాల మీద
నవ్వునవ్వుల ఘోషాలో నువ్వు తిరుగాడుతున్నప్పుడు
ఓ చిన్నారి దేవదూతా..! నేను నిన్ను చేరుకుంటాను
చుక్కలని మోసే ఆకాశం కింద
నిన్ను, చీకటిని జోకొట్టి నిద్రపుచ్చి నీనుంచి నేను
మాయమైపోతాను

తెల్లవారి నువు కనులు తెరిస్తే….
నీ కన్నులమీద రెండు ప్రశ్నల ముద్రలు
నీ చుట్టూ వాలుతున్న సీతాకోకచిలుకలు
With a sound of heart beat around you in morning breeze
ఇప్పుడు ప్రశ్నించుకో నిన్ను నువ్వు
నువ్వెవరనీ?
ఇంకా నేనెవరనీ కూడా….

*
చిత్రం: సత్యా బిరుదరాజు

నరేష్కుమార్ సూఫీ

8 comments

Leave a Reply to Mahamood Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు