LGBT లు మనుషులు ! సెక్స్ మాంగర్స్ కాదు !

LGBT  సమస్య ఆ మధ్య ఒక ఫెమినిస్ట్ ఒక చోట రాసిన రైట్ అప్ కనిపించింది ” LGBT సమస్య sexual orientation   సమస్య “ అని. ఇది చాలా మందిలో ఉండే తప్పుగా గైడ్ చేయబడ్డ అభిప్రాయం. నిజానికి ఇదో అర్ధ సత్యం ! మైనారిటీల సమస్య ‘ మతం ‘ ఎలా కాదో  LGBT సమస్య సెక్స్ సమస్య కాదు.  LGBT సమస్యల పట్ల సానుభూతి ప్రకటిస్తున్న వాళ్ళకు ఒక  సిస్టమేటిక్ ఆలోచన ఉండకపోతే ఇక అంతా సెక్స్ మయం లా కనిపించే ప్రమాదం ఉంది.

ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని ప్రేమించింది అనుకుందాం. ఆ ప్రేమించాలనుకునే అమ్మాయి లెస్బియన్. కాబట్టి ఇంకో అమ్మాయి కూడా లెస్బియన్ అయితేనే ప్రేమిద్దాం అనుకుంటదా ? అలాగే ప్రేమ కలుగుతదా ? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. అతను అబ్బాయి అని ఈమె అనుకుంది . ఆ అబ్బాయి కాస్త అబ్బాయి కాదు అని తెలిసాక అతని మీద ప్రేమ కలుగదా ? ఒక అబ్బాయి ఇంకో అమ్మాయి దగ్గరకి వెళ్ళి ” నీవు లెస్బియనో కాదో నాకు తెలీదు…కాని నేను నిన్ను ప్రేమిస్తున్నాను ” అని ప్రపోజ్ చేస్తాడా ? అందునా LGB లది ఒక సమస్య అయితే T ది ఒక సమస్య. ఇదిలా ఉంటే , LGB  సమస్యను ఏ మత గ్రంథాలు ఆమోదించవు. బైబిల్ లో ట్రాన్సెక్సువల్స్ కు సంబంధించి ఆదరణ ఉంది. మిగతా సెక్సువల్ ఓరియెంటేషన్ ను కు సంబంధించి సమర్థన లేదు. ( అయితే ఆ ఖండన క్రిమినలైజ్ చేసి నెట్టేయమనే వ్యతిరేకత కాదు ) . అన్నిటికన్న విభిమన్నమైన సమస్య ‘ బై సెక్సువల్ సమస్య ‘ బై సెక్సువల్ అంటే – ఒక మనిషికి మగాడి మీద, ఆడ వాళ్ళ మీద కూడా ఒకేలా అట్రాక్షన్ కలగడం. ఇది సెక్సువల్ ఓరియెంటేషన్ సమస్యనే. అయితే – ఒకే సారి ఇద్దరికి అట్రాక్ట్ అయ్యి ఇద్దరిని ఒకేసారి ప్రేమించడం అని అర్థం కాదు లేదా ఒకే సారి సెక్సువల్ రిలేషన్ లో ఉండడం అని కాదు.  ఇద్దరితో ఒకేసారి ప్రేమ కొనసాగించడం అది అక్రమ సంబంధం అవుతుంది. బై సెక్సువల్ సమస్యను ఈ రేంజ్ లో అపార్థం చేసుకుని రాసిన కొన్ని ఫెమినిస్టుల కథలు ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి పొరపాటు. అక్రమ సంబంధాలు బై సెక్సువల్స్ పెట్టుకున్నా, హేటిరో సెక్సువల్స్ పెట్టుకున్నా, హోమో సెక్సువల్స్ పెట్టుకున్నా అది అంగీకారం కాదు. ఆ దిశగా రచనలు చాలా అనారోగ్యకరం.   ఇదిలా ఉంటే   ట్రాన్సెక్సువల్స్ అప్పియరెన్స్ లోనే విభిన్నంగా ఉంటారు. ఇది మెజారిటెరియనిస్ట్ ‘ మనిషీ ‘  అనే ఇమేజ్ కు భిన్నంగా ఉంటుంది. నిజానికి ఒకే స్కేల్ మీద ట్రాన్సెక్సువల్ సమస్య  లెస్బియన్, గే, బై సెక్సువల్స్ ను కలిపి చూడగలిగే సమస్య కాదు.   ఇక్కడ చూడాల్సిందేమంటే – LGBT  సమస్య పైకి కనిపించేంత సింపుల్ సమస్య కాదు.

LGBT  లు ఈ మెజారిటేరియనిస్ట్ ప్రపంచం లో సెక్సువల్ మైనారిటీస్. అంటే – ఒక మెజారిటేరియనిస్ట్ వ్యక్తికి ఉండే సెక్సువల్ ఇంప్రెషన్స్ సంబధించిన ఫ్రేం లో వీళ్ళు ఫిట్ అవ్వరు. కాబట్టి వీళ్ళు  odd man out   లా బతకాల్సిన పరిస్థితి ఒకటి ఉంటుంది సమాజం లో. మనిషి రూపు రేకల పట్ల ఉండే ఓవర్ జనరలైజేషన్ వలన ఈ ట్రాన్సెక్సువల్ సెక్షన్ ఒక సోషల్ స్టిగ్మా కు గురవుతారు . యూనివర్సల్ గా కొన్ని రూపు రేకల సాంప్రదాయం ఏర్పరుచుకున్న సమాజం, ఈ ట్రాన్సెక్సువల్ ను ఒక హీన స్థాయి మనుష్యులుగా చూడ్డం మొదలెడుతుంది. ఆడామె అంటే ఒక పితృస్వామ్య రూపం లో నాజుకుగా ఉండాలి. నాజూకుగా లేకపోతే ? నాజుకుగా లేని ఆడామె అవుతుంది తప్ప …ఆడామెనే కాకుండా ఎట్లా పోతుంది ?  అలాగే ఏ హీన స్థాయి తనం అయిన, స్టీరియో టైపింగ్ ను ఎదుర్కోక తప్పదు. ఇక్కడి నుంచి ట్రాన్సెక్సువల్స్ యొక్క సమస్యల ప్రయాణం మొదలుతుంది.

మొదటగా – వివక్ష ! మెజారిటెరియనిస్ట్ సమాజం – ఇది మా సమాజం మీ లాంటి వాళ్ళకు చొటు లేదు అని చూస్తుంది కాబట్టి. ఇది  కేవలం సెక్సువల్ రికగ్నిషన్ కు సంబంధించిన వివక్ష మాత్రమేనా ? ఇది మొత్తంగా ఒక మనిషిని ‘ ఏలియన్ ‘ లా ట్రీట్ చేయడం సమస్య. వీళ్ళెవరు మన మధ్యలో ఉన్నారు అన్నట్టు గా ప్రవర్తించడం. సినిమా హాళ్ళలో ఎవరి పక్కన కూర్చోవాలి, ఎవరి టాయిలెట్స్ లో కెళ్ళాలి, అప్లికేషన్ లో ఏమని ఫిల్ అప్ చేయాలి.ఇలా సాధారణంగా ఉండే ప్రతి దైనందిన కార్య క్రమం లో ఎటు దిక్కు తోచని బతుకు బతకడం ఒక దుర్భరమైన సమస్య. లింగ నిర్ధారణ భౌతిక జననాంగాల బట్టి మాత్రమే  నిర్ధారించే విధానం మానవాళి మొత్తం రివ్యూ చేసుకునే పరిస్థితి ఇప్పట్లో వస్తుందనేది దురాశ.  ఇది సాంస్కృతికంగా మొదలై సాంఘికంగా ఎదుగుతుంది.

సాంఘిక వివక్షకు మూలం సెక్సువల్ ఓరియెంటేషన్ అవుతుంది. అయితే సెక్సువల్ ఓరియెంటేషనే సమస్య కాదు. ఇక్కడ సెక్సువల్ ఓరిఎంటేషన్ సమస్య  సాంస్కృతికంగా మేజారిటేరియనిస్ట్ పితృస్వామ్య పద్దతి వల్ల జరుగుతుంది. దానర్థం సెక్సువల్ కోరికల వల్ల అని కాదు. సెక్సువల్ అర్జ్ వ్యక్తిగతం. సామాజికం కాదు. ఇక్కడ సమస్య మనమే సంస్కృతిలో బతుకుతున్నామనేది. ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక ఫ్రేం లోనే పెట్టి ఆ ఫ్రేం లోనే మనుష్యులను ఇరికించాలనే మెజారిటేరియనిస్ట్ ఆతురత తో సమస్య. ఆ ఫ్రేం లో ఫిట్ అవ్వకపోతే ఏలియనేట్ చేద్దామనే ఒక నడవడికతో సమస్య

ఇక వివక్ష నుండి ముదలై ఈ సమస్య ఎలాంటి సమస్యల పరిణామాన్ని సృష్టిస్తుంది అని చూస్తే ముఖ్యంగా ఇది ఆ మనుష్యుల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, ధన సముపార్జన అవకాశాలను దెబ్బ తీసేస్తుంది. ఈ సమస్య ఈ సెక్సువల్ మైనరిటీస్ యొక్క ఆయువుపట్టు మీద కొట్టడం లాంటిది. జూన్ 2020 లో అమెరికా సుప్రీం కోర్ట్ 6-3 రూలింగ్ తో ‘ లైంగిక వివక్ష తో ఎవరినైనా ఉద్యోగం లో నుండి తీసేయడం చట్ట విరుద్ధం అని ‘ తీర్పు ఇచ్చింది. ఇక్కడ మనం నిప్పు కొత్తగా కనిపెట్టినట్టు లెదూ ? అంతే గాక  ఇక్కడ తీర్పు గురించి కాదు ఆలోచించాల్సింది . ఇందులో ముగ్గురు జడ్జ్ లు  డిసెంట్  ఇచ్చ్చారు . అది కూడా ఎంతో అభివృద్ధి చెందిన మోడ్రనైజ్ అయ్యిన అమెరికా లాంటి  సుప్రీం కొర్టు లెవెల్ లో. ఇది చాల కంగారు పెట్టే అంశం. నిజానికి ట్రంప్ ప్రభుత్వం ట్రాన్సెక్సువల్స్ ను మిలిటరీ లో ఉద్యోగం ఇవ్వకూడదని చేసిన తీర్మానాన్ని ఈ కోర్ట్ తోసిపుచ్చలేదు అని గమనించాలి ఇక్కడ. ఒక మనిషికి ఉండే ఆర్థిక అవకాశాల కాళ్ళు నరికి వేసే  పరిస్థితి రావడం కన్నా దుర్మార్గం వేరే ఉండదు. ఇందు వలన ఈ సెక్షన్స్ నిరంతర పేదరికం లోకి, నిరంతరంగ ఒకరి మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఈ వివక్ష ఇలాగే institutionalise అయ్యి తర తరాలు బాధ పడాల్సి వస్తుంది. ఇది అన్నికంటే దారుణమైన సమస్య.

అలాగే సమాజానికి మూలం అయిన కుటుంబం వీళ్ళ విషయం లో ఎలా ఉండాలి అన్నది కూడా ఒక ప్రధాన సమస్య. వీళ్ళకు బయోలాజికల్ గా  పిల్లలు కలగే అవకాశం లేదు ( బై సెక్సువల్ కు తప్ప ). కుటుంబం లేని శూన్యాన్ని వీళ్ళకు సృష్టించాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది.  వీళ్లకు పిల్లలను దత్తతు తీసుకునే చట్టాలు కూడా అనుకూలంగా లేవు. ప్రధానంగా ఇంకా వీళ్ళ పెళ్ళిల్లను ఈ సమాజం రిజిస్టర్ చేసుకుని ఒక ఫేమిలీగా గుర్తించే పరిస్థితి లేదు. ఒక ఫేమిలీ సపోర్ట్ లేకుండా, ఆ ఫేమిలీ నిర్మాణానికి అనుకూలమైన చట్టాలు ( రిజిస్ట్రేషన్,  డైవోర్స్, ప్రాప్ర్టీ మొ || చట్టాలు ) లేకుండా ఫేమిలీ నిర్మాణం అనే ఒక హక్కును ఈ సెక్షన్స్ కు పూర్తిగా తీసి వేయబడుతుంది.

ఒక పక్క సాంస్కృతిక ఒత్తిడి కారణంగా మానసిక ఆరోగ్యాన్ని పోగుట్టుకునే ప్రమాదం లో ఉండి, ఇంకో పక్క వీళ్ళకు సరి అయిన ఆరోగ్య సదుపాయాలను కూడా అమోదించలేని పరిస్థితి లో ఈ సమాజం ఉంది. ఇది ముఖ్యంగా ట్రాన్స్ జెండర్ సమస్య. మిగతా సెక్షన్స్ సమస్య కాదు. వీళ్ళకు హెల్త్ ఇన్స్యూరెన్శ్ అందుబాటులో ఉండదు. ఈ మధ్య అమెరికా ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం హాస్పిటల్ వాళ్ళు ట్రాన్స్ జెండర్ కు ట్రీట్ మెంట్ చేయడానికి నిరాకరిస్తే అందులో నేరం ఏమీ లేదు. ఇక్కడైనా అంతే ! ముఖ్యంగా HIV లాంటి భయానకమైన వ్యాధులకు ఉన్ముఖమైన వాళ్ళు. పైగా ఎక్కువగా పేదరికం తో బాధ పడే వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో దిక్కు లేని జీవితం గడపాల్సిన పరిస్ఠితి ఈ ప్రభుత్వం కలిపిస్తుంది.

LGBT వరుసలో queer  ‘ అని కూడా కలుపుతారు. ఇవన్ని ఎక్స్టెన్షన్స్ మాత్రమే కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం లేదు

LGBT సమస్య ముఖ్యంగా మనవ హక్కుల సమస్య. ఇందులో sexual rights అన్నది ఒక భాగం మాత్రమే. అయితే అది కూడా సెక్సువల్ అర్జ్ అనే వ్యక్తిగత విషయంతో కలిపి కలగాపులగం చేయొద్దు. ఎవరి వ్యక్తిగత సెక్సువల్ ప్రెఫెరెన్సెస్ వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకుంటారు. ఇదో వ్యవస్థాగతమైన సమస్య. హోమోఫోబియా, పేదరికం, నిరుద్యోగం, క్రిమినలైజేషన్, చట్ట సమస్యలు ఇవన్నీ వీళ్ళ జీవితాలను ఛిద్రం చేసే సమస్యలు. అలా కాక వీళ్ళ సమస్యలు కథల్లో సెక్స్ కోసం మాత్రమే కుదించి వీళ్ళను నార్మల్ మనుష్యులుగా కానట్టు చిత్రించడం సరి అయినది కాదు. బై సెక్సువల్ , queer సెక్సువల్ సమస్యలను మల్టిపుల్ రిలేషన్స్ కు సంబంధిచిన సమస్యగా అర్థం చేసుకోవడం పరిమిత ఙానం వలన జరుగుతుంది లేదా సెన్సేషనలిజం వలన జరుగుతుంది. వీళ్ళ సమస్య ను సక్రమంగా అర్థం చేసుకోకపోతే మనం ఏదో ఒక చిందరవందర సెక్స్ ప్రపంచాన్ని కోరుకున్నట్టు కథలు, రచనలు వస్తాయి. పెట్టుబడి దారీ సమాజం వచ్చిన ఇన్నాళ్ళకు కూడా  ఈ సమస్య కు కలిగిన సమాధానం ఇంకా అణురూపం లో మాత్రమే ఉంది.

సెక్సువల్ ఓరియెంటేషన్ అనే సమస్య భుజాల నుండి సెక్స్ అనే బుల్లెట్ వదలడం ద్వారా ఎవరికీ లాభం లేదు. LGBT సమస్యను సెక్స్ సమస్య గా  LGBT లు ‘సెక్సువల్ మాంగ ర్స్ ‘ గా కాకుండా , ఒక సజీవమైన ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం మనం చేయాలి.  ఒక హయ్యర్ ఆర్డర్ సొసిటీని నిర్మించడం ఒక కథకుడు ఒక రచయిత జెనెరిక్ బాధ్యత. దీనర్థం – మనం సమస్య ను ఒక భౌతిక సమస్య గా చూడ్డం దగ్గర ఆగకుండ, ఆ సమస్య చుట్టు ఉన్న విలువలను ఎలా ప్రోత్సాహించాలో , దీని చుట్టు ఒక తాత్వికత ఎలా వృధ్ధి చేయాలో చూడ్డం మనకు ముఖ్యం. ఇదో అమానుషమైన సమస్య. ఈ సమస్యను కూకటి వేళ్ళతో పెకలించే దృఢ నిశ్చయం, చిత్త శుద్ధి ఖచ్చితమైన భాషలో మన దగ్గరుండాలి.

*

 

 

 

Avatar

విక్టర్ విజయ్ కుమార్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చర్చించాల్సిన పాయింట్స్ లేవనెత్తారు వ్యాసంలో .ఈ సమూహాలకు చెందిన వ్యక్తుల సమస్య కేవలం లైంగిక స్వేచ్ఛ కు సంబంధించినది మాత్రమే కాదు ,అది సామాజిక ,ఆర్థిక హక్కుల సమస్య కూడా .తెలుగు సాహిత్యంలో ఈ అంశాలన్నిటినీ సమగ్రంగా చర్చించే రచనలు రావాల్సిన అవసరం ఉంది .కేవలం వారి లైంగిక ప్రత్యేకతను మాత్రమే ఎత్తిచూపటం వల్ల సామాజిక జీవనంలో వారిని భాగం చేసుకునే ప్రక్రియకు మరింత అవరోధమే ఏర్పడుతుంది .
    ఈ సమూహాలకు అవసరమైన అన్ని హక్కులూ మానవ హక్కులేనని గుర్తింపు లభించటం కేవలం చట్టాలతో మాత్రమే సాధ్యపడదు .సామాజిక అవగాహనలో ఆ ఎరుకను భాగం చెయ్యటంలో సాహిత్యం నిర్వహించాల్సిన బాధ్యత చాలా ఉంది .

  • ఆలోచన రేకెత్తించేదిగా ఉంది మీ విశ్లేషణ.
    మంచి analysis.
    Thank you .
    ఈ మధ్య నేను Evening Shadows అనే ఫిల్మ్ చూశాను. LGBT నేపథ్యంలోననేపథ్యంలోని అంశం. గొప్ప అనుభూతి కలిగింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు