నువ్వు
నడుస్తూనే ఉంటావ్
చూస్తూనే ఉంటావ్
తెలియని పరుగు పెడుతుంటావ్
వెంపర్లాటలో వెనుకబడరాదనే ఆశ
చీకట్లను ఆర్పడానికి
దీపం పెట్టే ప్రయత్నం చేయవు
జీవితపు ఐస్ బర్గ్ ను ఢీ కొట్టి
మునుగుతున్న బతుక్కి
చిటికెనవ్రేలు కూడా అందించవ్
ముక్కలు ముక్కలుగా
విరిగిపడుతున్న సూర్యరశ్మి
పుప్పొడి పుప్పొడిగా రాలుతున్న వెన్నెల
చిగురిస్తూ చిర్నవ్వుతున్న మొక్క
ఎంపిల్లడో ఎల్దా మోస్తవా అని పలకరించే పక్షి
ఏడేడు సముద్రాలు దాటివెళ్తున్న రాత్రులు
చిల్లులసంచి అని తెలుసు
పగిలేకుండ అని తెలుసు
కుండపోత వర్షానికి చలించని
మొద్దురాయి నువ్వు
నీతో పాటూ తోటంతా కాలిపోతుంది
అప్పుడు
ఏడుస్తున్న పువ్వుల్ని
ఓదార్చేచేతులేవి
Odaarche chethulevi Kavitha baavundi
It is a nice expression
Excellent poem
Superb..poem
Good poem super
ఓదార్చే చేతులు ఇప్పుడు లేవు మంచి కవిత
గోపాల్ గారూ మీ కవిత చాలా బావుంది
చిక్కగా వుంది
అభినందనలు
గోపాల్ గారూ మీ కవిత చాలా బావుంది
చక్కటి అభివ్యక్తి.. అభినందనలు గోపాల్ గారు.
జీవితంలో లో తోడుగా ఒకరు అండగా ఉండాలి సర్
చాల బాగుంది సర్
ప్రకృతిని పదాల చేతులతో చేసిన ఓదార్పు కవిత అద్భుతం
ఏడుస్తూ న్నా పువ్వుల్ని ఓదార్చే చేతులేవీ…….సూపర్ సర్.👌చాలా బాగుంది
Bagundi Anna
చాలా మంచి కవిత.. అభినందనలండి…
బద్దకాన్ని వదలి ఎదో ఓ పని చేయమన్నట్లు గి ఉన్నది కవిత గోపాల్ సర్
కవిత బాగుంది మిత్రమా