BDSM ఫెమినిస్ట్ సాహిత్యం !

మనమింకా చిన్న చిన్న అరుపుల నిరసన స్థాయిలో ఉన్నాం అనుకోను.

“ —

లం– అంటే సిగ్గుపడి భూమిలో కుంగిపోతామనీ

పూ–ల్ని బజార్లో పెడితే ద్రౌపదిలా మోరెత్తి మొర పెడతామనీ 

–“

మధ్య కాలం లో అతి బాధించిన విషయం –  జుగుప్సాపూరితంగా బూతుతో రాసిన కవిత అందరు ఫెమినిస్టులు, సో కాల్డ్ ప్రగతి శీల వాదులు ‘ ఆహా ఓహో ‘ అంటూ తల మీద తీర్థం చల్లుకుంటున్నట్టు ఆదరించడం. ఈ సాహితీ వేత్తలలో ఉండే ‘ కలెక్టివ్ కన్ సైన్స్ ‘ ఏ స్థాయి దాకా దిగజారిపోతుందో తెలీట్లేదు. మాల్యాకు అప్పివ్వడం కరెక్ట్ అనుకున్న వాళ్ళే, నీరవ్ మోదీకి అప్పిస్తారు. అంతేగా ? మనలో ఉండే ‘ కన్సైన్శ్ irreversible గా తయారయ్యే క్రమం మనకు కొన్ని incentive ద్వారా జరగొచ్చు. అందులో – టెంపరరీ విజయం, టెంపరరీ సెన్సేషన్, టెంపరరీ హైప్, టెంపరీ mutual honour…ఇలా ఎన్నో ఉండొచ్చు. ఒక సంస్కృతి ఇలాగే ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. అందునా బూతు మాట్లాడ్డం ఒక హీరోయిజం కింద పరిగణించే ఈ సమాజం లో , ఇలాంటివి ఈజీగా నిలదొక్కుకుని , మనం నివసించే వాతావరణాన్ని Non-friendly to women and children గా తయారు చేస్తున్నాయి.

నాకు తెలిసి అక్కడొ ఇక్కడ కొంత మంది ఆడవాళ్ళు ‘ హయ్యో ‘ అని నొచ్చుకుని డిస్కరేజ్ చేయలేదు కాని, సుమారు అందరూ తల మీద తీర్థం లా పోసుకుని ఆనందించినట్టే కనిపిస్తుంది. మనలో ఒక మెజారిటెరియనిస్ట్ స్వభావం ఎలా బల పడుతుందో, అందులో ఎలాంటి పెడధోరణులను ఎంకరేజ్ చేస్తూ పోతున్నామో, ఎలాంటి మాస్ సైకాలజీ ఈ సాహితీ లోకం డెవెలప్ చేసుకుంటుండొ – ఒక జాగర్త ను తెలుపాలనే ఉద్దేశ్యం తో ఇది రాయాలని నిశ్చయించుకున్నాను.

పెద్ద పెద్ద థియరీలోకి పోకముందు కొన్ని బేసిక్స్ అర్థం చేసుకుందాం. ఈ ఫెమినిస్టులు మొత్తం కలిపితే ఒక 500 మంది ఉంటారు ఉమ్మడి రాష్ట్రాల్లో. ‘ బూతు ‘ అనే ఒక సామాజిక అపహాస్యం నుండీ వేదన పొందుతున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు. దైనందిన జీవితంలో , ఆశేష జనాంగం, బస్సుల్లో, రైళ్లలో, రోడ్ల మీద – ఏదో రకంగా బూతుల threat చుట్టు పెట్టుకుని, తల ఎత్తలేకుండా ఇబ్బంది జీవితాన్ని గడుపుతునే ఉన్నారు. ఆ సగటు ఆడవాళ్ళకు అర్థమయ్యింది – ‘ ఈ బూతు తమ గురించి ప్రత్యక్షంగా కాకపోయినా – తనకుండే ఒక జెండర్ ఐడెంటిటీని కించ పరిచే ఉద్దేశ్యం తోనే వాడబడుతుంది ‘ అని. ‘ తాను పబ్లిక్ స్పేస్ లో కోరుకునే ఒక ‘రక్షణ భావన ‘ దాని యాక్సెప్టెన్స్ మీద ఆధార పడి ఉంద’ని. తాను చేయగలిందట్టూ ఏదన్నా ఉంటే -ఆ బూతు ల నుండీ దూరంగా వెళ్లడం ఒకటే అని , తనకు చాతనైతే పబ్లిక్ ప్లేస్ లో ఎవరు బూతు మాట్లాడినా దాన్ని వారించాలనే. ఇప్పుడిప్పుడే గ్రామాల నుండి, పట్టణాలకు అప్ గ్రేడ్ అవుతున్న దళిత , బహుజన , ముస్లిం స్త్రీలలో ఉండే ‘ అభద్రత ‘ భావానికి ఈ బూతు ఆజ్యం పోస్తుంది తప్ప ఎటువంటి ఉపయోగం కలిపించదు.

అసలు బూతు పుట్టిందే – ఏదో ఆక్రోషం , ఆగ్రహం express చేసుకునే వీలు కల్పించడం కోసం కాదు – అది స్త్రీలను కించపరిచడం లో భాగంగా వచ్చింది అనే మౌళిక సూత్రాన్ని వదిలేసి మళ్ళీ ఏదో రూపం లో బూతులను ప్రమోట్ చేయడం ఫండమెంటల్ గానే తప్పు నడక. ఎవరూ ఎవరికీ హేయమైన సమస్యలను అందమైన గిఫ్ట్ పేక్ లో ఇవ్వమని కోరరు. గాని – జుగుప్స గా పబ్లిక్ స్పేస్ లో బూతులతో కవితలు రాయడం – మొదలు పెడితే – ఇకా అన్ని కవితలు బూతులతోనే రాయాలి…అప్పుడే అవి గొప్ప కవితలౌతాయి ఇక అనే అనే ఈ భావన చూస్తే –   I think we are missing a basic sense of thinking when we try to handle social issues in literature

ఇలా జనరల్ గా కాక స్పెసిఫిక్ గా ఇవి సాధించగలిగేదేంటో ఈ జుగుప్స బూతు పద్దతిని break down చేసి విశ్లేషిద్దాం.

WRONG EXPECTATION ON OUTCOME

ఈ తారాస్థాయి బూతు కవిత నుండి outcome ఏమి expect చేస్తున్నాం ? –

(a) మగవాళ్ళు ఇది చదివి కృంగి పోవాలా ?(b) మగవాళ్ళ ఆడవాళ్ళ భీకర రూపాన్ని చూసి తల్లడిల్లిపోవాలా ?(c) పితృస్వామ్యానికి ఇది చెంప దెబ్బ అని వీక్ ఫీల్ అవ్వాలా ?

పితృస్వామిక వాది – ఆడవాళ్ళు కవిత రాస్తేనే ఏహ్య భావం తో చూస్తాడు. సో – ఇది చదివి ఆత్మ హత్యకు ప్రేరేపింపబడుతాడా మరి ?! మరి ఏమి కొత్తగా ఆశించి ఇలాంటి సాహితీ రూపం వచ్చింది ? ఇది ఏ రీతిగా అయినా కేవలం బూతులు ఉపయోగించడం వలన ప్రత్యేకంగా పితృస్వామ్యాన్ని దెబ్బ తీసే లక్షణం కలిగి ఉందా ? ఇక infinite గా బూతుల మీద బూతులు రాసేస్తూ పోతే , ఇందులో పోరాటం అనే అంశం ఎక్కడుంటుంది ? మన బేసిక్ వ్యతిరేకత బూతుల మీద అనే విషయం ఎప్పుడు మర్చిపోయామో గుర్తుందా ఈ హైప్ లో ? ఇప్పుడు పితృ స్వామిక మగ వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి ? ఇంకో బూతు పద్యం లగెత్తుకున్నారు అనుకుందాం…. అప్పుడు దానికి ప్రతిగా – మళ్ళీ ఇంకో బూతు కవిత్వం రాస్తే పేట్రేగి పోయిన పితృస్వామ్యన్ని ఎదిరించినట్టా ? ఇప్పుడొ బూతు సిరీస్ ఉద్యమాన్ని మనం ఆవిష్కరించాలన్న మాట ! మనకు చాత కాని ‘ క్రియేటివిటీ’ ని ఇలా బూతుల ద్వార తీర్చుకోవద్దు !

అంటే మనం క్రియేటివ్ గా ఎదుర్కోవాల్సిన విషయం లో మన కుండే పరిమితిని దాటడం ఎలా అన్నది మనకు తెలీదు కాబట్టి ఈ బూతు సులువు విధానంగా ‘ హేండీ’ గా వచ్చిందన్న మాట ?! కవితలు, కథలు మత్రమే సమాజాన్ని మార్చవు. ఇది మొదటగా మనకు ఆ మాత్రం అవగాహన ఉండాలి. ‘ ఇలా రాస్తే కుదర్దు గాని …నేను భయంకరమైన బూతు dose పెంచుతా ..అంటే ఔట్ కం మారుతుందా ? ‘ అది కవితనే …అలాగే ఉంటుంది. అదంతకు అది లేచి బుల్లెట్లు కురిపించదు ! కవిత , కథల పరిధి దాటి తీసుకురావాల్సిన మార్పులు కొన్ని ఉంటాయి. అవి భౌతిక ఉద్యమాలలో ఉంటాయి. మనం కవితలు, కథల ద్వారా చాత కాని విషయాలను వేరె ప్లాట్ ఫాం మీద పరిష్కరించాలి కాని – బేసిక్ ఆబ్జెక్టివ్ వదిలేసి వెగటుగా బూతులు వాడి ‘ టిట్ ఫర్ టేట్ ‘ అనుకుంటే ఏం లాజిక్ ఇది ?

వెస్ట్ లో ‘ Slut Walk’ ‘అనే ఒక ఉద్యమం జరిగింది. చాలా చోట్ల ఆడవాళ్ళు బట్టలిప్పి తిరగడం జరిగింది.

తర్వాత ? ఈ సాంస్కృతికఉద్యమాలు – బూతు స్థాయిని చేరినాక ఇంక్రిమెంటల్ కంట్రిబ్యూషన్ ఒక్క hype తప్ప ఏమీ ఉండదు. అయితే – అసలు ఫెమినిస్ట్ కాజ్ కు భిన్నంగా – తిరిగి ఫెమినిస్ట్ కాజ్ నే దిగ జారుస్తుంది. ఇక్కడ మర్మాంగాలను దిగ జార్చి మాట్లాడ్డం -ఎవరు చేసినా,ఇంకా perfect society కండీషన్స్ లేని ఈ కాలం లో, అది స్త్రీని ఎఫెక్ట్ చేసేదే. ప్రతి స్త్రీ ఇంకో ఫెమినిస్ట్ వీపు వెనకాల దాక్కుని ఉండదు. ఇక్కడ జాగర్తగా గమనించాల్సింది ఏమంటే – ఒక రియాక్షనరీ ఎమోషన్ ను , మేధావులు ఎలా ఆర్గనైజ్ చేయమని గైడెన్స్ ఇస్తున్నారు ? నాన్సీ ఫ్రైడే అని ఒకావిడ తానో ఫెమినిస్ట్ పుస్తకం తీసుకొస్తున్నాని – స్త్రీలకు కూడా sexual fantasies ఉంటాయనే సబ్జెక్ట్ తో ఒక పుస్తకం తీసుకొచ్చింది 1973 లో. ఆ పుస్తకం పేరు ‘ సీక్రెట్ గార్డెన్ ‘ . ఆ పుస్తకం విపరీతంగా సేల్ అయ్యింది. అది కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ శాతం మగ వాళ్ళే!

ఇలాంటి కవితలలో , కథల్లో ఔట్కం క్లారిటీ ఉండదు ! ఎక్స్పెక్టెడ్ ఔట్ కం మీద క్లారిటీ లేని సాహితీ రూపాలు ఎప్పటికీ ‘ స్టెప్ బేక్వర్డ్ తప్ప ‘ ఫార్వర్డ్ అవ్వవు.

UNNATURALLY ESCALATED EMOTION IN THE POEM

ఏ కవిత అయినా కథ అయినా మనిషి లో ఉన్న status quo సంస్కృతిని బద్దలు కొట్తాలనే ఆశిస్తాం. మామూలుగా మాట్లాడుకున్నప్పుడు , కొట్లాట బూతుల దగ్గర ఆగుతుంది…తర్వాత ముందు పోవాలంటే చేతికి పని పెట్తాల్సిందే కదా ? ఇదీ అంతే ! ఇంత ఆవేశం ఉంటే – వెళ్ళి కత్తేసుకుని నరికేసి రావచ్చు గా ? బూతులు కసా బిసా మాట్లాడేస్తే నిరసనా ? ఇదేంటెక్నిక్ ?! మొత్తం ప్రతి పదం ఒక బూతుతో నింపేస్తే పోలా ?! ఈ బూతు లో ఉండే ఎమోషన్ చూసి కంగారు పడే మొగోడు ఒక్కడన్నా ఉన్నాడా అసల ? అసల బూతులు మాట్లాడ్డం లో పోటీ ఏంది ? చేప కోపమెక్కువై ఒడ్డు మీదకు ఎగిరిందంట..అట్లుందిది !

ఎంత ఎక్కువ బూతులు మాట్లాడితే అంత ఎమోషన్ ఉన్నట్తా ? ఇదేం ప్రమాణం అవుతుంది ? మన సాహిత్యాన్ని ఎటువంటి డైరెక్షన్ లో నడుపుతున్నామో తెలుస్తుందా ? ఎంత ఆర్టిఫిషియల్ ఎమోషన్ ను ప్రమోట్ చేస్తున్నామో తెలుస్తుందా ?

INAPT SOURCE OF ORIGINATION OF POEM

ఈ కవిత అర్బన్ క్లాస్ నుండి ఊడిపడ్ద కవిత. ఇది డైలెక్ట్ గా రాలేదు, ఇది కొంగు బిగిచ్చి, కొప్పు కట్టి కొట్లాడే స్త్రీల నేపథ్యం నుండి రాలేదు. అలాగే ఎదో ప్రజలతో మమేకమై వాళ్లకర్థమయ్యే భాషలో చెప్పాలనుకునే గద్దర్ లాంటి ఉద్యమ కారుల వద్ద నుండి కూడా రాలేదు. ఈ టెబుల్ పలగ్గొట్టే అవేశం అర్థం చేసుకోవచ్చు. కాని బూతులు మాట్లాడే ఎమోషన్ ఏంది ?! ఈ ఫెమినిస్ట్ ఆడవాళ్ళు – తమందరూ ఒక solid socially mobilizable seggregatable class అని చాలా over ఇమాజినేషన్ లో ఉన్నారు . అది రాంగ్ ! ఇది గంజి తాగే ఆమె కోసం రాసిన కవిత కాదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే భాష బూతులే గాని అశ్లీలం కాదు. కడపలో ‘ దెంక పో’ అని rural dialect ఉంది. అంటే ‘ వెళ్ళి పో ‘ అని అర్థం. ఇది అశ్లీలార్థం లో గాని, ఎబ్బెట్టు ఎక్స్ప్రెషన్ కాని కాదు. That is part of the dialect. ఈ అర్బన్ ఎలీట్ స్త్రీవాదులనబడే స్త్రీవాదులు వాడే బూతులు ఖచ్చితంగా బూతులే ! సెన్స్ లెస్ బూతులు ! చెంగు దోపి, రైక బిగించి , కొప్పు కట్టి కడుపు కోతతో మాట్లాడే బూతు కాదిది. ఎడా పెడా ఇంగ్లీష్ మాట్లాడే వీళ్ళు ఒక రోజు పొద్దున , ‘హయ్ గైస్..ఫక్ యు’ అని మాట్లాడిన ఆర్టిఫిషియల్ యాంగర్ కలిగిన బూతు ఇది. మర్మావయవాలను దిగజార్చి మాట్లాడ్డం పురుష స్వామ్య వ్యవస్థ లో ఒక ఫేషన్ ! ఇందులో నేటివ్ అప్రెస్డ్ క్లాస్ విమెన్ ఫీల్ లేదు. టచ్ లేదు. అనుభవం లేకుండా అనుభూతిలో మునిగిపోయి రాసిన కవిత బూతు స్థాయికి వెళ్లడం లో జెన్యూనిటీ లేదు . బూతుకు ఆథెంటిసిటీ ఉన్న నేపథ్యం లేదు.

బూతు సాహిత్యాన్ని నిరసనగా గుర్తించవద్దా ?

మనమింకా ఈ చిన్న చిన్న అరుపుల నిరసన స్థాయిలో ఉన్నాం అనుకోను. ఇలా ప్రేలాపనలో మునిగి ఉండే నిరసన స్థాయిలో ఉన్నామనుకోను నేను. అలా ఉన్నామనుకుంటే – ఫెమినిస్టులు చెప్పాలి ఇన్నాళ్ళ వాళ్ళ ఉద్యమమ ఇంకా ప్రిమిటివ్ గానే ఉందని ! అన్యాయానికి వ్యతిరేకంగా ఆడవాళ్ళ దగ్గర నుండే కాదు..ఎవరి దగ్గర నుండి అయినా ఒక నిరసన ! …అది ఎలా ఉన్నా వాళ్ళ పక్షానే నిలబడాలి. అందులో డౌట్ లేదు. కాని వాళ్ళు తీసుకున్న స్టాండ్ అదో గొప్ప స్టాండ్ అంటేనే సమస్య. ఆమె రాసిన కవితా శిల్పానికి అప్రూవల్ ఇవ్వడం వలన మాత్రమే ఆమె తరపున నిలబడ్డం అవుతుంది అనుకోవడం రాంగ్. పాయింట్ అది కాదు – ఇప్పుడొ ఫెమిన్సిట్ ఉద్యమ స్పూర్తితో విశ్లేషించాలి. ఇది ఫెమినిస్ట్ కాజ్ కు ‘ నెట్ పాజిటివిటీ ‘ కలిపిస్తుంద లేదా ? ఏ కోశాన అయినా స్త్రీ ఉద్యమాలకు ఎంకరేజ్ మెంట్ ఉందా ? ప్రైవేట్ గా మాట్లాడుకునే ( అది ఇద్దరి వ్యక్తుల వ్యవహారం. ప్రస్తుతానికి…అది కూడా ఓకే అనుకుందాం ) పద్దతికి ఒక సార్వత్రిక రూపం ఇచ్చే ఈ ప్రయత్నం వలన, ఫెమినిస్ట్ ఉద్యమం అడుగు ముందుకు వేసినట్టేనా ? మగవాన్ని అనీజీ పరిస్థితుల్లో పెట్టే ఎటువంటి ఫీచర్ లేదు దీనిలో. ఆ దిగంబర కవులు చేసిన పుణ్యమా అని ప్రతి అడ్దమైన సాహితీ వేత్త ‘బూతులు’ ఒక ఆయుధం అని పరిగణించే రోజులు గడుస్తున్నాయి. రెండు చోట్ల అణచివేత అని..ఇంకో చోట పితృస్వామ్యం అనో లేపోతే ఇంకో అణగారి తనం అనో పెట్టి…ముందు వెనుక రెండు వాక్యాలు ఇక అంటించండి …మ _, పూ _, దెం_….ఇలా.. రాస్తూ పోతే సరిపోతుంది…అంతేనా ? ఈ మాత్రం దానికే నీరజనాలు పడతారా ? ఇదేం నిరసన …ఏం ఆశించి నిరసన ? బూతు వద్దనా ? అమ్మాయిలు బూతులు మాట్లాడే ఉద్యమకారులవ్వాలనా ? లేదా ఒక బూతు ప్రపంచం లో ఒక బూతు యుద్ధానికి శంఖారావం పూరిద్దమనా ? నిరసన వ్యక్తం చేస్తుంది కదా …అది చాలు కదా అన్నది పాయింట్ కాదు అసల… కవిగా నీవు ప్రెజెంటేషన్ ఫాం ను ఎన్నుకుంటున్నావని?! బూతులను ఎదుర్కోడానికి క్రియేటివిటీ లేకపోతే – రాయకుండా ఉండాల కాని , రాసి బూతులను ప్రమోట్ చేస్తే ఎట్ల అని?

ఈ Standards ప్రకారం బూతు వాడకుండా రాయాల్సిన సబ్జెక్ట్ ఇక ఏదీ ఉండదు. అత్యాచారాలు, చైల్డ్ అబ్యూజ్ , గృహ హింస, ముస్లిం మహిళల వేదన, దళిత స్త్రీల అణచివేత – ఇలా ఏ సమస్య తీవ్రమైనది కాదు ? ఏ సమస్య తక్కువ ఆగ్రహం కల్పించేది , ఏ సమస్య ఎక్కువ ఆగ్రహం కల్పించేది అని క్లాసిఫై చేయాలి ? ప్రతి సమస్య పై ఉండే ఆగ్రహం ధర్మాగ్రహమే కదా? ప్రతి సమస్యపై నిరసన – నిరసనే కదా ? బూతులు వాడ్డం అంటే – మామూలుగా మేకప్ వేసుకోవడం కాకుండా డైమండ్ , రుబీస్ వేసుకున్నాట్టా ?

కవితా రంగం లో హేయ పదజాలంతో కవితలు వ్రాయడం కొత్త ప్రయోగం కానే కాదు. Postmodern literature చూస్తే existing practices ను Deconstruct చేసే ఆత్రం లో విరివిగా వాడారు. ఐతే ఇటువంటి ధోరణి shortlived and outdated . భాష వేల సంవత్సరాల క్రితం పుట్టింది. ఎన్నో భాషలు ఎంతో మంది మేధావులు ఎన్నో ప్రయోగాలు చేసారు. ఇవి మనకు వారసత్వంగా లభించకుండా ఎక్కడన్నా పెద్ద ఇనప్పెట్టెలో పెట్టి తాళం వేసారా ? అసందర్బంగా కవితా శిల్పాలను మలచద్దు. Women-friendly and child-friendly language ఎలా బిల్డ్ అప్ చేయాలో ఫోకస్ మిస్ అవ్వద్దు.

మొదట్లో చెప్పినట్టు – బూతులు స్త్రీలను కించపరచడానికే పుట్టినాయి కాని మనిషి ఆక్రోషాన్ని express చేసుకోడానికి కాదు. ఇది విస్మరించి మళ్ళీ బూతులనే అస్త్రాలుగా వాడ్డం స్త్రీ ఉద్యమ ప్రాథమిక ఉద్దేశ్యాన్ని విస్మరించినట్టు. ఇది విశాల జనాంగం లో ఉన్న సంస్కృతిని బల పరుస్తుంది తప్ప వీక్ చేయదు. ఇంచుమించు ప్రతి ఆడది ఒక unprotective వాతావరణం లోనే బతుకుతుంది. ఈ బూతుల అగ్రెషన్ ఎవరో ఒకరు ఎక్కడొ చోట పబ్లిక్ ప్లాట్ ఫాం మీద ఎంకరేజ్ చేస్తూ పోవడం వల్ల, బూతు కు ఒక లెజిటిమసీ వస్తుంది. నార్మలైజేషన్ వస్తుంది. సమాజం లో ఉండే ఒక phenomenon ను మన చుట్టే మనం ఏదో ఒక కారణం తో తిప్పుకుంటూ పోతున్నాం. అలాగని ప్రత్యేకంగా మగ వాళ్లకు కలిగే injury ఏమీ లేదు. విశాల సమాజం లో ఉండే సంస్కృతిని కొద్ది మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఫేషనబుల్ గా ‘ ఫక్ యు ‘ అన్నట్టు రాయొచ్చు గాని…నిజానికి ‘ ఫక్ యు ‘ అనే ఒక వైడ్ స్ప్రెడ్ ఏహ్యమైన ఎక్స్ప్రెషన్ కు ఇంకో కారణం కలుపుతారు తప్ప …. దాన్ని సమసి పోయే లా చేసే endeavour ఏమీ లేదు అందులో. Women domination లో బూతులున్నాయంటే – అదో Conundrum. అది aggressive feminism రూపం కాదు. ఇదో benevolent feminism. ఇంకొంచెం బండగా చెప్పాలంటే నష్టపోయేది మగవాడులా కనిపిస్తుంది కాని…నిజానికి ఆనందించేది మగవాడు ! I

ఇపుడు ఎవడన్నా అమాయి బట్తల్ని కామెంట్ చేసారనుకో .. నా బట్టల్ని కామెంట్ చేస్తావా అని బట్తలిప్పేసి తిరిగితే…ఇంకా చొంగ కారుస్తారు కాని ఎవడు ఈ సమాజం లో ఇది చూసి తిరుగు బాటు అనుకునేది ?! వెస్ట్ లో ‘ స్లట్ వాక్ ‘ అని ఏదో జరిగితే ఇష్టమొచ్చినట్టు కాపీ పేస్ట్ చేస్తే ఏమొస్తుంది?! తర్వాత బొమ్మలు , సినిమాలు లాంటివి కూడా ఈ ఫెమినిస్టులు ప్లాన్ చేసే యోచనలో ఉన్నారా ?! ఇదే గొప్ప finest కవిత అయితే Nancy Friday రాసిన ‘ సీక్రెట్ గార్డెన్ ‘గొప్ప కథనిక సంపుటి అవ్వాలి ప్రపంచ స్థాయిలో !

ఉద్యమ స్పూర్తిని, ఉద్యమ స్థాయిని dimnish చేసి…మనకు ఇంతకంటే క్రియేటివిటీ చాత కాదు కాబట్టి ఎన్ని సులువు పద్దతుల్లో వీలైతే అంత సులువు పద్దతుల్లో గీతలు గీసి పారేసి… మన పనికి మాలినతనాన్ని మనం సమర్థించుకుంటున్నాం అనిపిస్తుంది. టీ వీ లో మర్డర్ సీన్ వస్తుంది. హీరో బూతులు వాడాడు. బూతులు వచ్చిన చోట ‘ బీప్’ అని వచ్చింది. లేదు ఆ బూతు పూర్తిగా వింటే గాని మనకు ఆయన ఆవెశం తీవ్రత తెలీదనుకుంటే మనము ‘సెన్ సార్ బోర్డు ‘ ను ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మర్డర్ సీన్ blur చేసి చూపిస్తే మనకు బాధ తీవ్రత తెలీదు అనుకున్నా అదే వర్తిస్తుంది. అంటే దీనర్థం ప్రతి వస్తువును సున్నితంగా tackle చేయమన్నట్టు కాదు. కవిత చదివే పాఠకులు ఒక సీరియస్ సాంఘిక సమస్య ను చర్చిస్తున్నప్పుడు – ఏదో బార్ కెళ్ళి మందు కొట్టి సమస్యను ఏదో frustrating ప్రేలాపనలతో , బండ బూతులతో లెదా జుగుప్సా కరంగా చర్చిస్తున్నట్టు ఉండ రాదు. సమస్య మూలాన్ని తీవ్రత ను సూటిగా తాకేలా పాఠకున్ని చర్చింప జేయాలి అనేది కవి ఉద్దేశ్యం అయి ఉండాలి.

ఈ బూతు శైలి లో ఉండే ఒక advantage ఏంటంటే – పాఠకుడికి ఒక ‘ eye popping ‘ లాంటి అనుభూతి తెప్పించడం. అంత వరకే ! అది మించితే శిల్పం వస్తువును Dominate చేస్తుంది. అయితే ఇది poetic innovation ను limit చేస్తుంది. మరియు misogynistic గా ఉంటుంది.

BDSM ఫుల్ ఫాం – Bondage, Domination, Sadism and Machoism అని. ఇది సెక్స్ విషయం లో ఒక పర్వర్టెడ్ విధానం. ఇందులో పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ ని మానసికంగా శారీరకంగా గాయ పరుస్తుంది (డు) . దాని వలన ఎదుటి మనిషిలో బాధ ఎక్కువ కాక పోగా , ఆర్గాజమిక్ ఎక్స్పీరియన్స్ ను పొందుతాడు (ది) . అందరూ పెద్ద వాళ్ళే , మెచ్యూర్డ్ వాళ్ళే కాబట్టి ఈ చిన్న వివరణను అలా యాక్సెప్ట్ చేయండి. ఆడవాళ్ళు రాసే ఈ కవితల్లో, కథల్లో ఒక భీభత్సమైన బూతు, అలవికాని ఏహ్యమైన విశృంఖలత ఉంటుంది. అవి చదివి మగ వాళ్ళు ఫుల్లుగా డీలా పడి పోతారు , ఇక పితృస్వామ్యం నశించిపోయిందనే ఫీలింగ్ ఉంటుంది. నిజానికి విశాల జనాంగమైన ఆడవాళ్ళు ఏ ‘ బూతు ‘ గురించి సఫర్ అవుతున్నారో, దానిని ఇది బలపరుస్తుంది ( ఏదో ఒక అభ్యుదయం అనే కారణం తో ) ఇది అగ్రెసివ్ ఫెమినిజం అప్పియరెన్స్ ఉంటుంది కాని ఇది నిజానికి బెనివలెంట్ ఫెమినిజం . మరి మగాళ్లకేమౌతుంది ?! దీని వలన మగాళ్ళు కుమిలిపోయినట్టు , మిగతా వాళ్ళకు అనిపించినా బూతు సంస్కృతి ఏదోలా బలపడుతూ ఉంటే…వాళ్లకు మాత్రం ఆనందం లభిస్తుంది ! అందుకే ఈ ఫెమింజం ను నేను BDSM Feminism అంటున్నా !

ఈ బూతు నార్మలైజ్ అయిపోయి , ఇదే అద్భుత సాహిత్యం అని మన బుర్రళ్ళొకి కిక్కు దింపే ముందు , కంక్లూడింగ్ గా ఇక్కడ కొన్ని ప్రశ్నలు వదుల్తూ ముగిస్తున్నా

….

  • ఇంత వరకు చరిత్రలో బూతు రాయడం వలన మాత్రమే Eye popping effect కాక ఇక వేరెగా కలిగిన మార్పు ఏమన్నా ఉందా ?
  • బూతు ఏదో కారణం తో ఇలాగే బతికి ఉండడం వలన అమ్మాయిలకు – ముఖ్యంగా – గ్రామాల్లో నుండి, పట్టణాల వేపు జీవనో పాధికి కదుల్తున్న దిగువ మధ్య తరగతి అమ్మాయిలకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా ?
  • బూతు రాస్తూ పోతే ఏ స్థాయిలో ఆపేయాలి ? లేదా ఇలా అనంతంగా బూతు రాసుకుంటూ పోవచ్చా ?
  • ఇప్పటి వరకున్న సాహిత్యం తో పోలిస్తే ఇది ‘ ఫార్వార్డ్ సాహిత్యం ‘ ఏలా అవుతుంది ? ఏ ప్రాతిపదికన ?
  • ఇలా ప్రతి ఒక్కరు బూతు రాయడం చేసి ప్రతి కవిత మ_, పూ_, దెం_ పదాలతో నింపేసి , ఒక వంద లేపోతే వేయి కవితలతో ఫెమినిస్ట్ కవితలు తీసుకొచ్చి, ఒక పది సభల్లో – కేవలం బూతులు మాట్లాడే స్పీచ్ లు తప్ప ఏమీ ఇవ్వకుండా పెట్టి, దీనితో పాటు కొన్ని బూతులు నింపిన అంటే పూ_, మ_, దెం_ ఇలా పాటలు రాసేస్తే ఫైనిస్ట్ ఉద్యమం ఇంకో అడుగు ముందుకేసినట్టేనా ?
  • బూతులు మాట్లాడ్డం పోరాట విధానమని, ఒక పద్దతితో పితృస్వమ్యాన్ని కూల్చగలదని ఏ అంశాల బట్టి చెప్పగలము ?

(రచయితను ఫేస్ బుక్కు ఐ డీ P V Vijay Kumar ద్వారా గాని , ఈమెయిల్ ఐ డీ pvvkumar@yahoo.co.uk ద్వారా గాని సంప్రదించవచ్చు)

విక్టర్ విజయ్ కుమార్

23 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • avunu nijam lenin tana sahacharula to padava lo vellutunnappudu vaaru o paata padaataru ,ame gounu kinda chudu ani saradagaa padutmte lenin vaari kamdistadu manam samskarimpabadali kaada

  • మీకు ఆ కవితలో ఆ రెండు పదాలు తప్ప మరేమీ కనిపించనందుకు విచారంగా వుంది.

    • కవితలో ఆ రెండు పదాలే లేకపోవచ్చు, కానీ ఆ రెండు పదాల్లేకపోతే ఆ కవితకి అన్ని షేర్లూ కామెంట్లూ, ఆ స్పందనా మద్దతూ వచ్చేవంటారా? ఇక్కడ విజయ కుమార్ గారు మాట్లాడుతుంది ఆ టెండెన్సీ గురించనుకుంటాను.

      • NK గారూ, కచ్చితంగా రావు.
        ఏ పదాల వల్ల బూతు బూతు అయ్యిందో, అవే పదాల వల్ల ఆ కవిత శక్తిమంతం అయ్యింది.
        ఈ పదాలను స్త్రీలు వుచ్చరించలేరు, ఆ మాట అనగానే తలలు దాచుకుంటారు అనే గదా ఆ బూతులకు దిగేవారి మనస్తత్వం.
        ఆ కవిత ఆ మనస్తత్వాన్నే ఎండగట్టింది.

    • Eye popping కోసమే రాసి…హైప్ క్రియేట్ చేస్తే…శిల్పం వస్తువును డామినేట్ చేయడా మిత్రమా ? ఈ వ్యాసం లో నేను చివరడిగిన ప్రశ్నలు, పాయింట్ బై పాయింట్ విశ్లేషణ మీకు ఎందుకు అగుపించలేదు ? మనకు నచ్చింది మాత్రమే కాదు..నఛ్చనిదాని విషయం లో డెప్ట్ కు వెళ్లగలగాలి….

      • విజయ్ కుమార్ గారూ,
        ఏది బూతు అన్న బేసిక్ విషయంలోనే మీతో విభేదిస్తున్నాను గనుక ఇక మిగతా విషయాలన్నీ కూడా దాన్ని ఆధారం చేసుకున్నవే.
        “ఒసే లంజా” అని ఒకడు ఒకామెను అన్న మాటలో, “నన్ను లంజా అంటావురా?” అనే ఆమె సమాధానంలో రెండింటిలోనూ “లంజా” అనే పదం వుంది గదా అని రెండూ బూతులు అవవు.
        మీరు ఆమె కవితలో బూతు వుంది అనే నిర్ధారరణకు వచ్చి వ్యాసమంతా రాసినట్లున్నారు గనుక నాకు మిగిలిన పాయింట్లేవీ ఆనలేదు.

      • నేను రాస్తున్న విషయం ఉద్దేశ్య పూర్వకంగా అర్తం చేసుకోట్లేదా మీరు ? ఎలా చెప్పాలి ఇక ? ఇక్కడ ఒక పబ్లిక్ టాక్ గురించి మాట్లాడుతున్నాం. సినిమా ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సినిమాలో విలన్ కౄరత్వం లో బూతులు మాట్లాడినప్పుడు బూతు ప్లేస్ లో ‘ బీప్’ అని పెట్తడం సబబు అని ఎందుకనుకుంటాము ? బాత్ రూంలో వెళ్ళి చేసె పనులు అందరూ చేసేవి గా అని అనేసుకుని … డెటెయిల్డ్ గా పిక్చరైజ్ చేయము …ఎందుకు ? ఇది ఆల్రెడీ ఆర్టికల్ లో డిస్కస్ చేసాము కదా…ప్రైవేట్ టాక్ లో ఎక్స్ప్రెస్ చేసే అంశాన్ని పబ్లిక్ టాల్ లో ఇరికించి చూస్తారేంటి ఇదెం లాజిక్ ? అసలు ఈ సమాజం లో బూతు లేని అంశం ఏదన్నా ఉందా..కులం పెత్తనం లో లేదా, మత దురహంకారం లో లేదా, ప్రాంతీయ వివక్షలో లేదా….ప్రతి అణచివేత లో బూతు ఒక apparatus లానే చూస్తున్నారుగా ?! ఇక బూతు మయం చేద్దాం మన సాహిత్యం మొత్తం ? ఇవన్నీ ఆల్రెడీ ఆర్టికల్ లో చర్చించినవే. వీటికి value add చేయగలిగితే సంతొషిస్తా. సౌలభ్యం కోసం ఆర్టికల్ ను ప్రశ్నలతో ముగించా . వీలైతే ఆ ఫ్రేం లో – పాయింట్ బై పాయింట్ క్లియర్ గా ఆన్సర్ చేయండి. చర్చించొచ్చు. పాటకులకు కూడా value addition ఉంటుంది. అడిగినదే , చెప్పినదే మీరు నేను చేస్తే – energy waste !

  • ఇది ఒక అద్భుతమైన ఆర్టికల్..దాచి పెట్టు కోవాల్సిన విశ్లేషణ…కుడోస్..కుడోస్..రచయితకు ప్రణామాలు.. ఎంత అద్బుతంగా రాసారో…I strongly feel this is the article which is need of the hour and situation….
    Once again i am so happy in reading this wonderful article…

  • ముందు స్వాతిగారి కవిత చదవగానే నచ్చింది. అది షేర్ చేసిన వాళ్ళ మెసెంజర్ లో కవిత గురించి ‘hats off’ ‘ అని రాసేను. కానీ ఈ వ్యాసంతో . పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అభినందనలు విజయకుమార్ గారూ

  • I, still, am able to understabd why people are able to like the poem. But the need of the hiur is to delve into -are we so handicapped in expreswions and choosing presentation forms ? R v not loosing sight of big picture ? ఇవి ఆలోచించాల్సిందిగా మనవి చేస్తూ రాయడమైనది

  • ” కవితలు, కథలు మత్రమే సమాజాన్ని మార్చవు. ఇది మొదటగా మనకు ఆ మాత్రం అవగాహన ఉండాలి.”
    mari imkEmiti samasya? aamE Emi raasukumTE manakemduku?

    …మ _, పూ _, దెం_….ఇలా, idEnti? idE kada aamE raasimdi kuda?

    • ఆ విషయాన్ని చర్చించడానిక్కూడా ఆ పదాలు వుచ్చరించ అనర్హమైనవి అని విజయ్ కుమార్ గారు అనుకున్నట్టున్నారు.
      ఇక్కడే ఈయనతో నేను విభేదిస్తున్నాను. సైన్సు పాఠాల్లో స్త్రీ శరీరం గురించి చెప్పేటపుడు “యోని” అంటారు. అదే పదానికి తత్సమానమైన తెలుగు పదాన్ని వుపయోగించరు. అలా ఒక పదాన్ని వుపయోగిస్తేనే (అకడమిక్ అవసరాల్లో కూడా) బూతు అనుకొని వాటిని నిషేధించడం వల్లే, బూతురాయుళ్ళకు వాటిలో విపరీతమైన కిక్కు వుంటున్నది.

      • సార్.. నేను చెప్తుంది ఏంటి ?….మీరు allude చేస్తున్న సందర్భాలు ఏంటి ? cervical cancer వస్తే జననాంగాల గురించి ప్రస్తావించకుండా డాక్టర్ ను ట్రీట్ మెంట్ ఇవ్వమంటారా ఎవరన్నా ? లిటరేచర్ లో బండ బూతుల గురించి ఇన్న ప్రశ్నలతో, ఇన్ని ఉదాహరణలతో ఎక్స్ప్లెయిన్ చేస్తే సెక్స్ ఎడ్యుకేషన్ లో బూతుల గురించి మాట్లాడుతారేంటి ? please read this if u want to se what is the point. I suggest refrain from reading if u want to stick to ur point. its waste of energy both sides.

  • నేను పూర్తిగా పై వ్యాసంతో coincide అవుతున్నాను. ఈ భూతుకవితోద్యమమ్ society కి negative results ఇస్తుంది

    • అసలు సాహిత్యం ఎటువంటి వంటి మార్పు తీసుకరాద అంటుంటే మళ్ళీ చెడు ప్రభావం ఎలా ఉంటుంది?
      సాహిత్యం సమాజం మీద అంతో ఇంతో ప్రభావం చూపిస్తుంది అంటే దీన్ని గురించి చర్చించ వచ్చు గాని, ఏ ప్రభావాన్ని చూపని దాని మీద ఎందుకు ప్రయాస?
      సాహిత్యానికి కొన్ని నమూనాలు నిర్ణయించి ఆనమూనాల ప్రకారం లేదంటే సరే! బూతులు ఉండకూడదు అనే దాంతో ఎటువంటి విభేదాలు ఉండ నక్కరలేదు. అందరూ ఒప్పు కుంటారు. కానీ, ఏది బూతు అనే దాంట్లో నే!. బూతు పేరు చెప్పి ఈ విజయ కుమార్ గారే ఎక్కువ రాసారు. యాదవ కులములో ముసలం పుట్టి ఒకరినొకరు చంపుకుంటుంటే, వారని తప్పించ పోయిన కృష్ణుడే ఎక్కువ మంది ని చంపాడట. అలా ఉంది.

  • బూతు వినియోగం సృజనాత్మకత లేకపోవడమే అనలేము కానీ, ఇది వాళ్ళ అగ్రెస్షన్. అయితే పర్యవసానంలో పరమార్ధం దెబ్బతింటున్న ప్రమాదం మాత్రం వాస్తవం.
    నాచురల్ గా లేదు. హైప్ గా నే ఉంది. ఇదొక ఉద్యమంగా నిలబడి సాధించిన ప్రయోజనాలు తక్కువే. అయితే కలిగించిన ఎరుక చిన్నది కాదు. ఈ ధోరణుల్ని ప్రోత్సహించడాన్ని నిశితంగానే చదవాల్సిన అవసరం ఉంది. కాలం తన అభివ్యక్తిని తను నిర్దేశించుకుంటుంది. ఆపాదిస్తే తీసుకునేది కాదు కదా ? మంచి చర్చకి తావిచ్చే ఆర్టికల్. ఇంకా లోతుగా, సూటిగా మాట్లాడుకోవాలి. థ్యాంక్యూ & కంగ్రాట్స్ ఆల్సో. 🙂

    • I appreciate your comment అండి. నేను రాసిన ఈ వ్యాసం – నిర్మొహమాటంగా బూతును సాహిత్యం లో వ్యతిరేకిస్తుంది. సాహిత్యాన్ని women-friendly and children friendly చేయాలి అనేది నా ఉద్దేశ్యం. women firendly అంటే few urban elite feminsits friendly కాదని నా అభిప్రాయం. అశేష మహిళా జనాంగం అనే. ఇది చేసిన మేలు కంటే చేస్తున్న కీడు ఎక్కువ అందుకే – దీన్ని BDSM feminism అంటారు అని కూడా రాసాను. ఇంకా ఎవరన్నా ఇంతకంటే లోతుగా , వేసిన ప్రశ్నలను లేవనెత్తిన concerns ను address చేస్తే స్వాగతించాలి.

    • ఒక ఉద్యమ పంధాలొ దేశకాల పరస్తితులను పరిగణ లోకి తీసుకోవాలి .western country లొ బ్రా ఊడదీసి రోడ్డు పై నిరసన చేస్తున్నారని ఇక్కడ అలాంటి నిరసన success అవుతుందని,ఇక్కడ మహిళలు తమ నిరసనతొ కూడిన frustetion బూతు కవితల ద్వారా exhibit చేయటం సమంజసామా?. ఇక్కడ so called సాంప్రదాయలుండగనే , ఒక్కసారిగా perverted person లా దూకటం అదో sensational seasonal కవిత్వానికే పరిమితం అవుతుంది.

      • సాంప్రదాయాలు పాటించాలి కాబట్టి బూతు మాట్లాడవద్దు అనట్లేదు సార్ ! సాంప్రదాయాలు మించిన బూతు ఏదీ ఉండదు కాని….ఇది కవితల్లో ఒక ‘ లిబరేటింగ్ ఎక్స్ప్రెషన్ ‘ అని చూడ్డం గాని ఒక ‘ రెవల్యూషన్రీ ఎక్స్ప్రెషన్ ‘ నో గ్లోరిఫై చేయడం గాని తప్పు అని మాత్రమే చెప్తుంది ఇక్కడ !

  • చక్కని అందమైన ప్రదేశంలో బ్రతుకుతున్నామని అనుకుంటాము. ఎక్కడో పొరబాటున చిన్న గుంట ఏర్పడి బురద చేరితే మొత్తం బురద మయం చేసుకుంటామా?
    ఒక అనాగరిక భాషనుండి ఒక అనాగరిక సమాజం నుండీ శ్రమించి పైకి వచ్చాం అని అనుకుంటున్నాము. భాష సంస్కృతికి చిహ్నం. మళ్ళీ వెనక్కు వెళ్దామా? ఎదుటి వాడు గోతిలో పడితే మనమూ పడతామా?
    ఎదుటి వారి స్థాయికి దిగజారాల్సిన అవసరం ఉండా? అశుద్ధం మీద రాయి విసిరితే మనమీదే పడుతుంది. అసలు మన సంస్కారం మరచిపోతే ఎలాగ?
    రేపటి తరానికి ఏం చెబుతారు?
    కొవ్వెక్కిన నాలుకలు అదుపు తప్పితే మనమూ అదుపు తప్పాలా? ఎందుకిలా రాస్తున్నారని ఒకరిద్దరని అడిగితే ఇలా రాస్తేనే సంచలనం , గుర్తింపు అన్నారు.
    మహిళలూ ఆలోచించండి. మీ స్థాయి నిలుపుకుని కారు కూతలు కూసే వారిని ఎడం కాలితో తన్నండి అంతే కాని వాళ్ళ స్థాయి కి వెళ్ళాలని భాషను కలుషితం చెయ్య వద్దు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు