A2 -స్వగతం

నా కలలే కాదు

కదలికలు రహస్యం కాదు

 

ఇంటి గుమ్మం నుండి కాలేజీ దాక

ప్రవహించిన పలకరింపులన్ని

నీ డేగ కళ్ళలో రికార్డవుతున్నాయని తెలుసు

 

క్లాస్ రూంలో

అధ్యాపకుడినడిగిన మౌలిక ప్రశ్నలన్ని

నీ నోటీస్ లో  చేరుతున్నాయని గుర్తించాను

 

ప్రియురాలితో చేసిన వాగ్థానాలన్ని

చెవ్వులు రిక్కించి వింటున్న చప్పుడు

నీనుండి అర్థమవుతూనే వుంటుంది

 

నీ నిఘా..

నా స్వేచ్ఛపై దాడిచేస్తున్నా వూరుకున్నది

మనుషుల్లోని  మాధుర్యం తెలుసుకుంటావనే..

 

ఎఫ్.ఐ.ఆర్ లో..

నా వీధి మలుపు

రాష్ట్ర సరిహద్దు అవుతుందని ఊహించినదే

 

లాకప్ రూంలో  దేశం సరసాన

A2గా నిలబడతున్నందుకు

కృంగిపోక గర్వపడుతున్నా..

 

నా ఆందోళనంతా..

నీ బూట్లకింద చెల్లచెదురైనా

అమ్మ బీపి టాబ్లేట్లు

నాన్న నొప్పుల మాత్రల కోసం కాదు

ఇంట్లో పాపాయి పాలప్యాకేట్  కోసమే..

 

ఓయ్ గుర్తుంచుకో..

ఆకలితో ఆ పాపయి గుక్కపట్టిన ఏడ్పు

నీ కలలలో కల్లోలాన్ని సృష్టిస్తుంది

 

(దేశ వ్యాప్తంగా విద్యార్థుల అరెస్టుల మీద రాసినది)

అరవింద్

4 comments

Leave a Reply to Mahamood Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నా ఆందోళన అంతా నీ కాలి బూట్ల కింద నలిగిపోయిన పాపాయి పాల పేకెట్ గురుంచు మాత్రమే….మంచి పరిణితి చెందిన కవిత అరవింద్… నీ అన్ని కవితలలో ఈ కవిత నాకు నచ్చింది


  • Good.. Wonderful poem, Aravind.
    A flow of transparent mind.
    A blow of emerging desire..
    A thunderbolt undercurrent..
    A decent alternate world under construction!

    Mind blowing! Touching .. Aravind!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు