మధ్యాహ్నపు మెలన్కలిని
చీకటి గదుల మాటున ఆల్కహాల్ తాగేస్తే
కాఫీ డే
ఆకారం తీసుకున్న విద్ద్యుత్ కాంతి
సాయంత్రపు
రంగులని కలుపుకొని
తన్నుకొస్తే
రెటీనా పైపొర
ఆనకట్ట వేయగలదా?!
డైరిలో
ఒక చిన్న ఖాళీగానో
బినా లిఖా పేజీగానో
శూన్యపు కుండలా నిండు మనస్సు
మోసుకు
నడిచే నగరపు వీధుల నిండా నిండుకున్న
అనివార్య సత్యం,
సమస్త మానవాళి కొట్లాట అంతా
ఇన్ని బొట్ల రసాయన కాంక్ష మాత్రమే అని.
*
చిత్రం: మోషే దయాన్
ఇన్ని బొట్ల రసాయన కాంక్ష
మానవాళి కొట్లాట అంతా
ఇన్ని బొట్ల రసాయన కాంక్ష మాత్రమే…
బాగుంది.ultimate…ధీరజ్
Thank you sir