ఆరుబయట ఆరాం కుర్చీ
ఆరుపదులు దాటే సాయం కాలం-
జయాపజయాల చప్పరింతలతో
పిల్లలతో పిట్టలతో ముచ్చటించే దినాలలో
రోజూ పొద్దును
చేతికర్ర పొన్నుతో పొడుచుకుంటూ అతను
వంగిన నడుముతో ఆవిడ.
పెనిమిటిని కచేరుకు సాగనంపే పనిలో
గేటుతీసే ఆయాసంతో జారిపడుతుంది ఆమె.
బస్సులోనో ఆటోలోనో
తనను తాను కీలు కీలు విరిచేసుకొని
రోబో నడకలతో,ఎండిన తాటాకు వేళ్ళతో
పునుకుతూ పునుకుతూ
ఆఫీసుమెట్లు రోజూ ఎదురీదాలి.
తన మొఖం పైనే ఉమ్మేస్తున్న
అద్దాన్ని గుద్దలేక
తన తెలివినే ఎక్కిరిస్తున్న పట్టాలను
చూస్తున్న కండ్లను తుడువలేక
మంచానికి కంచానికి బరువై
దేశం వీపుకే భారమైన
లక్షలాది టన్నుల ఉడుకునెత్తురు…
మూడు పదుల గడ్డాలు
మారుపెట్టు వురకలేక
ముసలి యువత దేశాన్ని వెలిగిస్తుందో
దేహాన్నైనా బతికించుకుంటుందో
గూని నడుము ప్రగతి రథం
దేంట్లో దిగబడు తుందో
ఎవరు చెప్పాలి వాళ్లకు
కొలువుకెళ్లాల్సిన కొడుకు ముందరే
ఆనె కాళ్లు మాగురు కండ్లు
గోద్రెజ్ విగ్గులేసుకొని కచేరు కెళ్తుంటే
పెండ్లీడు పిల్లలు కండ్లముందే
ఉరి చావులై వేలాడుతుంటే
ఒక్కడన్నా చెయ్యేత్తకున్నా నోరెత్తడేమి
ఒక్కడైనా పిల్లల మొఖాల్లో కన్నెత్తి చూడడేమి.
*
ముసలి యువత దేశాన్ని వెలిగిస్తుందో
చాలా బాగుంది.మీ కవిత భావగర్భితంగా ఉంది
Super poem
Lines are very beautifull.
It reflect poets deep sorrow and pain on that damaged youth.