సూక్ష్మంగా ఒక మొక్కలా…..

1
నీలో..
దృష్టి, స్వరం స్పష్టంగా ఉన్నప్పుడు
చీకటి నుండి స్వచ్ఛమైన కాంతి ప్రవహిస్తూ వుంటుంది.
విరిగిన చోటనే వికసిస్తుంటావు.
నిశ్శబ్దం ఒక లక్ష్యాన్ని చూపుతూ వుంటుంది.
నిశ్చలమైన, ఉత్తమమైన ఉద్దేశ్యాలు అడ్డుగోడలని తొలగిస్తుంటాయి. మరింత ఖాళీలను పూరించుకునే అవగాహన కలుగుతూ వుంటుంది. సూక్ష్మంగా ఒక మొక్కలా ఎదుగుతుంటావు. అదంతా నిజాయితీని నింపుకున్న సమయం. అందుకే శాంతి వెన్నెలలా ప్రవహిస్తూ వుంటుంది నీలో..
పునరుద్ధరణ 
భూమి
తడితడిగా తగులుతున్నప్పుడు
చిగురించిన ఆకులు
గొప్ప కాంతిని చూస్తుంటాయి
ఆ రాత్రిలో –
చీకటిలో
చంద్రుడు పెరుగుతూ వుంటాడు
అదే సమయంలో
కొన్ని చిక్కుముడుల నుండి
విడిపించుకుంటుంటావు
మళ్ళీ
కొత్తగా ప్రారంభించడానికి
మళ్ళీ మళ్ళీ విడుదలవుతూ వుంటావు.
*

లక్ష్మి కందిమళ్ళ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు